Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిబంధనా జనులం - నిరీక్షణా ధనులం


    • నిబంధనా జనులం - నిరీక్షణా ధనులం
    • ఘనుడగు యేసుని - సిలువ రక్తపు సంబంధులం - మేము నిబంధనా జనులం
    • యేసురాజు వచ్చునూ - ఇంకా కొంత కాలమే - మోక్షమందు చేరెదము - 2
    •  
    • 1. అబ్రహాము నీతికి - వారసులం
    • ఐగుప్తు దాటిన - అనేకులం =  2
    • మోషే బడిలో - బాలురము - 2
    • యేసయ్య ఒడిలో - కృతార్దులం.. ప్రియ పుత్రులం - [మేము....]
    •  
    • 2. విశ్వాసమే మా - వేదాంతం
    • నిరీక్షణే మా - సిద్దాంతం = 2
    • వాక్యమే మా - ఆహారం - 2
    • ప్రార్ధనే మా - వ్యాయామం .. అనుదినమూ - [మేము....]
    •  
    • 3. అశేష ప్రజలలో - ఆస్తికులం
    • అక్షయుడేసుని - ముద్రికలం = 2
    • పునరుత్థానుని - పత్రికలం - 2
    • పరిశుద్ధాత్ముని - గోత్రికులం.. యాత్రికులం - [మేము....]
    •  
    • 4. నజరేయుని ప్రేమ - పొలిమేరలో
    •  సహించుటే మా - ఘననియమం = 2
    • క్షమించుటే ఇల - మా న్యాయం - 2
    • భరించుటే మా - సౌభాగ్యం అదే.. పరమార్ధం - [మేము....]
    •  
    • 5. క్రీస్తేసే మా - భక్తికి పునాది
    • పునరుత్థానుడే - ముక్తికి వారధి = 2
    • పరిశుద్ధాత్ముడే - మా రథసారధి  - 2
    • ప్రభుయేసే మా - ప్రధానకాపరి.. బహునేర్పరి - [మేము....]
    •  
    • 6. ఎవరీ యేసని అడిగేవో - ఎవరోలే యని వెళ్లేవో - 2
    • యేసే మార్గం - యేసే జీవం - 2
    • యేసే సత్యం - కాదు చోద్యం.. ఇదే మా సాక్ష్యం -[నిబంధనా....]
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 946 times