ఆకీషు (ఆకీషు)


గాతు రాజులలో నొకడు

Bible Results

"ఆకీషు" found in 2 books or 20 verses

1 సమూయేలు (18)

21:10 అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకువచ్చెను.
21:11 ఆకీషు సేవకులుఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచు సౌలు వేలకొలది హతముచేసెననియు, దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా
21:12 దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.
21:14 కావున ఆకీషురాజుమీరు చూచితిరికదా? వానికి పిచ్చిపట్టినది, నాయొద్దకు వీని నెందుకు తీసికొని వచ్చితిరి?
27:2 లేచి తనయొద్దనున్న ఆరువందలమందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.
27:3 దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.
27:5 అంతట దావీదురాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా
27:6 ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
27:9 దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱెలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను.
27:10 ఆకీషుఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదుయూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమున కును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.
27:12 దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.
28:1 ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధము నకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచినేను దండెత్తగా నీవును నీ జనులును నాతో కూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా
28:2 దావీదునీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందు వనెను. అందుకు ఆకీషుఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను.
29:2 ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్య మును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహ పరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి.
29:3 ఫలిష్తీయుల సర్దారులుఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడుఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నాయొద్దనుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటనుండి నేటివరకు ఇతనియందు తప్పే మియు నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను.
29:6 కాబట్టి ఆకీషు దావీదును పిలిచియెహోవా జీవము తోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే;నీవు నాయొద్దకు వచ్చిన దినమునుండి నేటి వరకు నీయందు ఏ దోషమును నాకు కన బడలేదుగాని సర్దారులు నీయందు ఇష్టములేక యున్నారు.
29:8 దావీదునేనేమి చేసితిని? నా యేలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధముచేయుటకై నేను రాకుండునట్లు నీయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీ దాసుడనై నాయందు తప్పేమి కనబడెనని ఆకీషు నడిగెను.
29:9 అందుకు ఆకీషుదైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులుఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.

1 రాజులు (2)

2:39 అయితే మూడు సంవత్సరము లైన తరు వాత షిమీయొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు నొద్దకు చేరిరి. అంతటనీవారు గాతులో ఉన్నారనిషిమీకి వర్తమానము కాగా
2:40 షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. ఈలాగున షిమీ పోయి గాతులోనుండి తన పని వారిని తీసికొనివచ్చెను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , యాకోబు , గిద్యోను , బిలాము , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , సెల , యెరూషలేము , అగ్ని , ప్రేమ , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , యెహోషాపాతు , అన్న , ఐగుప్తు , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , అబ్దెయేలు , రోగము , గిల్గాలు , బేతేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , ఆషేరు , కనాను , మార్త , దొర్కా , ఆసా , సీమోను , రక్షణ , సబ్బు , బెసలేలు , బేతనియ , యెహోవా వశము , ఎఫ్రాయిము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , కయీను , ఎలీషా , తామారు , హాము , హిజ్కియా , అంతియొకయ , ఊజు , రూతు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help