గాజా (గాజా)


బలమైన దుర్గము

Bible Results

"గాజా" found in 13 books or 21 verses

ఆదికాండము (1)

10:19 కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజావరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషా వరకును ఉన్నది.

ద్వితీయోపదేశకాండము (1)

2:23 గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.

యెహోషువ (3)

10:41 కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను.
11:22 ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయు లలో ఎవడును మిగిలియుండలేదు; గాజాలోను గాతు లోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి.
15:47 గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,

న్యాయాధిపతులు (5)

1:18 యూదావంశస్థులు గాజా నుదాని ప్రదేశమును అష్కె లోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి.
6:4 వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధన మైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు.
16:1 తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను.
16:2 సమ్సోను అక్కడికి వచ్చె నని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టిరేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమను కొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి.
16:21 అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.

1 సమూయేలు (1)

6:17 అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.

1 రాజులు (1)

4:24 యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతల నున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.

2 రాజులు (1)

18:8 మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.

1 దినవృత్తాంతములు (1)

7:28 వారికి స్వాస్థ్యములైన నివాసస్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములును ఉన్నంతవరకు వ్యాపించెను.

యిర్మియా (2)

47:1 ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు
47:5 గాజా బోడియాయెను, మైదానములో శేషించిన ఆష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?

ఆమోసు (2)

1:6 యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.
1:7 గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

జెఫన్యా (1)

2:4 గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడై పోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్ట ణము దున్నబడును.

జెకర్యా (1)

9:5 అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ము కొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.

అపో. కార్యములు (1)

8:26 ప్రభువు దూతనీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"గాజా" found only in one lyric.

ప్రభు యేసుని వదనములో - Prabhu Yesuni Vadanamulo

Sermons and Devotions

Back to Top
"గాజా" found in 3 contents.

ఆమోసు
ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా

నహూము
ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయ జూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. {Luke,12,48}. ఏకైక సత్యదేవుని తెలిసికొనే మంచి అవకాశము నీనెవెకు లభించినది. యోనా సందేశమును వినిన ఈ మహా పట్టణము మారు మనస్సు పొందినది. అందువలన దేవుడు తన అత్యంత కృపచేత దాని మీ

ఎన్నిక
ప్రతి జీవికి ఒక ఆత్మ కథ వున్నట్టుగా, ప్రతి గ్రామానికీ, ప్రతి పట్టణానికీ ఒక ఆత్మ కథ వున్నది. యేసుని జననమునకు ముందు ఒక కుగ్రామం వుంది. అది చాలా స్వల్పమైన గ్రామం కాబట్టి దానికి ఎలాంటి విలువా లేదు. అదే బెత్లెహేము. అలాంటి బెత్లేహేమును దేవాదిదేవుడు ఏర్పరచుకున్నాడు. అందులోనుండే యూదుల రాజును ఉదయింపజేసేం

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , యాకోబు , బిలాము , గిద్యోను , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , తెగులు , కెజీయా , ఎలియాజరు , యోబు , గిల్గాలు , రోగము , బేతేలు , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , కనాను , ఆషేరు , మార్త , ఆసా , దొర్కా , సీమోను , రక్షణ , సబ్బు , బెసలేలు , బేతనియ , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , ఏఫోదు , హిజ్కియా , పరదైసు , కయీను , ఎలీషా , హాము , తామారు , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , రూతు , బర్జిల్లయి ,

Telugu Keyboard help