యోషీయా (యోషీయా)


యెహోవా బాగుచేయువాడు లేక పోషించువాడు

Bible Results

"యోషీయా" found in 8 books or 50 verses

1 రాజులు (1)

13:2 ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రక టనచేసెనుబలిపీఠమా బలి పీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగాదావీదు సంత తిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.

2 రాజులు (12)

21:24 దేశపు జనులు రాజైన ఆమోనుమీద కుట్రచేసిన వారినందరిని చంపి అతని కుమారుడైన యోషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి.
21:26 ఉజ్జాయొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యోషీయా అతనికి మారుగా రాజాయెను.
22:1 యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా.
22:3 రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు, మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారు డును శాస్త్రియునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఈలాగు సెల విచ్చెను.
23:16 యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను.
23:19 మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిర ములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను.
23:23 ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను.
23:24 మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహ ములను, యూదాదేశమందును యెరూష లేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీ యాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.
23:28 యోషీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
23:29 అతని దినముల యందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరురాజుతో యుద్ధముచేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.
23:30 అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూష లేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహో యాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
23:34 యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.

1 దినవృత్తాంతములు (2)

3:14 మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.
3:15 యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.

2 దినవృత్తాంతములు (15)

33:25 దేశ జనులు ఆమోను రాజుమీద కుట్ర చేసినవారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.
34:1 యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరము ఏలెను.
34:33 మరియు యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలోనుండి హేయ మైన విగ్రహములన్నిటిని తీసివేసి, ఇశ్రాయేలీయులందరును తమ దేవుడైన యెహోవాను సేవించునట్లు చేసెను. అతని దినములన్నియు వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.
35:1 మరియు యోషీయా యెరూషలేమునందు యెహో వాకు పస్కాపండుగ ఆచరించెను. మొదటి నెల పదునాల్గవ దినమున జనులు పస్కాపశువును వధించిరి.
35:7 మరియు యోషీయా తన స్వంత మందలో ముప్పది వేల గొఱ్ఱెపిల్లలను మేకపిల్లలను మూడువేల కోడెలను అక్కడ నున్న జనులకందరికి పస్కాపశువులుగా ఇచ్చెను.
35:16 ఈ ప్రకారము రాజైన యోషీయా యిచ్చిన ఆజ్ఞనుబట్టి వారు పస్కాపండుగ ఆచరించి, యెహోవా బలిపీఠముమీద దహన బలులను అర్పించుటచేత ఆ దినమున ఏమియు లోపము లేకుండ యెహోవా సేవ జరిగెను.
35:18 ప్రవక్త యగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీ యులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయు లును, అక్కడ నున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూషలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కాపండు గను ఆచరించి యుండలేదు.
35:19 యోషీయా యేలుబడి యందు పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కాపండుగ జరిగెను.
35:20 ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిర మును సిద్ధపరచినప్పుడు ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నదియొద్దనున్న కర్కెమీషుమీదికి దండెత్తి వెళ్లుచుండగా యోషీయా అతనిమీదికి బయలు దేరెను.
35:22 అయినను యోషీయా అతనితో యుద్ధము చేయగోరి, అతనియొద్దనుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని, యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయ వచ్చెను.
35:23 విలుకాండ్రురాజైన యోషీయామీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి - నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్నుకొని పోవుడని చెప్పెను.
35:24 కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.
35:25 యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.
35:26 యోషీయా చేసిన యితర కార్యములన్నిటిని గూర్చియు, యెహోవా ధర్మ శాస్త్రవిధుల ననుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు
36:1 అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.

యిర్మియా (16)

1:2 ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజై యుండగా అతని యేలుబడి పదుమూడవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్ష మాయెను.
1:3 మరియు యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజైయుండగాను, యోషీయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై యుండగాను, అతని యేలుబడి పదునొకండవ సంవత్సరాంతమువరకును, అనగా ఆ సంవత్సరమున అయిదవ నెలలో యెరూషలేము చెరదీసికొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగు చుండెను.
3:6 మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెనుద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.
22:11 తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలిన వాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగి రాడు;
22:18 కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగ లార్చరు.
25:1 యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబులోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
25:3 ఆమోను కుమారుడును యూదారాజునైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.
26:1 యోషీయా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
27:1 యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏల నారంభించినప్పుడు యెహోవా యొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
35:1 యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్దనుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై
36:1 యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము నాలుగవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
36:2 నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారిని గూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.
36:9 యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమ్మిదవ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరును యూదా పట్టణములలోనుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరును యెహోవాపేరట ఉపవాసము చాటింపగా
37:1 బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను.
45:1 యూదారాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్తయైన యిర్మీయా అతనితో చెప్పినది
46:2 ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట.

జెఫన్యా (1)

1:1 యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

జెకర్యా (1)

6:10 చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికిపోయి

మత్తయి (2)

1:10 హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;
1:11 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"యోషీయా" found only in one content.

జెఫన్యా
ఇశ్రాయేలు దేశము రెండు ముక్కలుగా చీలగా, యెరూషలేము రాజధానిగానున్న దక్షిణ రాజ్యమే, యూదా దేశము. దీని ఆత్మీయ, రాజకీయ చరిత్రలలో పునరుద్ధీకరణలు, పరిశుద్ధ పరచబడుట పలుమారు జరిగియున్నవి. ఆమోను కుమారుడైన యోషీయా పరిపాలనా కాలములో ఇట్టి సంఘటన యొకటి సంభవించెను. అనగా దేవుని వైపు మళ్లుకొనుట జరిగెను. శుద్ధీకరణ పొం

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , మరియ , ఇశ్రాయేలీయులు , గిద్యోను , యాకోబు , బిలాము , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , సెల , అగ్ని , ప్రేమ , యెరూషలేము , సాతాను , సౌలు , హనోకు , పౌలు , ప్రార్థన , రాహాబు , దేవ�%B , ఇశ్రాయేలు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , అన్న , యెహోషాపాతు , ఐగుప్తు , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , అబ్దెయేలు , రోగము , గిల్గాలు , బేతేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , తీతు , ఏలీయా , ఆషేరు , కనాను , మార్త , రక్షణ , సీమోను , దొర్కా , సబ్బు , ఆసా , బెసలేలు , బేతనియ , యెహోవా వశము , ఎఫ్రాయిము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , కయీను , హాము , ఎలీషా , తామారు , హిజ్కియా , అంతియొకయ , ఊజు , రూతు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help