హిల్కీయా (హిల్కీయా)


యెహోవాయే నా స్వాస్థ్యము

Bible Results

"హిల్కీయా" found in 7 books or 31 verses

2 రాజులు (9)

18:18 హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యా కీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపుదస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి.
18:26 హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారుచిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాట లాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా
18:37 గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడు నైన ఎల్యాకీ మును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును, బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.
22:4 నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి, ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము.
22:8 అంతట ప్రధానయాజకుడైన హిల్కీయాయెహోవా మందిరమందు ధర్మశాస్త్రగ్రంథము నాకు దొరికెనని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథ మును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి
22:10 యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించెనని రాజుతో చెప్పి ఆగ్రంథమును రాజు సముఖమందు చదివెను.
22:12 తరువాత రాజు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అశాయా అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా
22:14 కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అశాయా యును ప్రవక్త్రియగు హుల్దాయొద్దకు వచ్చిరి. ఈమె వస్త్ర శాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్యయై యెరూషలేములో రెండవ భాగమందు కాపురస్థురాలై యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగా
23:4 రాజుబయలు దేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణము లన్నిటి యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపి వేసెను.

1 దినవృత్తాంతములు (5)

6:13 షల్లూము హిల్కీయాను కనెను, హిల్కీయా అజర్యాను కనెను,
6:45 హషబ్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కీయా కుమారుడు,
6:46 హిల్కీయా అవీ్జు కుమారుడు, అవీ్జు బానీ కుమారుడు, బానీ షమెరు కుమారుడు,
9:11 దేవుని మందిరములో అధిపతియైన అహీ టూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కీయా కుమారుడైన అజర్యా;
26:11 రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.

2 దినవృత్తాంతములు (7)

34:9 వారు ప్రధానయాజకుడైన హిల్కీయాయొద్దకు వచ్చి, ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశములయందు ఇశ్రాయేలువారిలో శేషించియున్న వారందరియొద్దనుండియు, యూదా బెన్యామీనీయులందరి యొద్ద నుండియు కూర్చి, దేవుని మందిరములోనికి తీసికొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి.
34:14 యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మ శాస్త్రముగల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కన బడెను.
34:15 అప్పుడు హిల్కీయాయెహోవా మందిరమందు ధర్మశాస్త్రముగల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్ప గించెను.
34:18 మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవిచేసికొని, శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దానినుండి చదివి వినిపించెను.
34:20 హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను
34:22 అప్పుడు హిల్కీయాయును రాజు నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణకర్తయునగు షల్లూముయొక్క భార్యయైన హుల్దా అను ప్రవక్త్రియొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుప భాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా
35:8 అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయుల కును మనః పూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మంది రపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరువందల గొఱ్ఱెలను మూడువందల కోడెలను ఇచ్చిరి.

ఎజ్రా (2)

7:1 ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు
7:2 హిల్కీయా షల్లూము కుమారుడు షల్లూము సాదోకు కుమారుడు సాదోకు అహీటూబు కుమారుడు

నెహెమ్యా (3)

8:4 అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వ మందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.
12:7 సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి.
12:21 హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు.

యెషయా (3)

22:20 ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమా రుడునగు ఎల్యాకీమును పిలిచి
36:3 హిల్కీయా కూమారుడును రాజు గృహనిర్వాహ కుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.
36:22 గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.

యిర్మియా (2)

1:1 బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
29:3 హిల్కీయా కుమారుడైన గెమర్యాచేతను, యెరూషలేములోనుండి చెర పట్టబడిపోయినవారి పెద్దలలో శేషించినవారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేమునుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవె

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , యాకోబు , బిలాము , గిద్యోను , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , తెగులు , కెజీయా , ఎలియాజరు , యోబు , గిల్గాలు , రోగము , బేతేలు , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , తీతు , కనాను , ఆషేరు , మార్త , ఆసా , దొర్కా , సీమోను , రక్షణ , సబ్బు , బెసలేలు , బేతనియ , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , ఏఫోదు , హిజ్కియా , పరదైసు , కయీను , ఎలీషా , హాము , తామారు , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , రూతు , బర్జిల్లయి ,

Telugu Keyboard help