“యెహోవా, ప్రభూ”– దీనికి హీబ్రూ పదాలు “అదొనాయ్ యెహోవా”. హీబ్రూ భాష పాత ఒడంబడిక గ్రంథంలో ఈ పేరు 400 కంటే ఎక్కువ సార్లు వాడారు. అదొనాయ్ అంటే ప్రభువు, యజమాని, పరిపాలకుడు. అదొనాయ్ భూమి అంతటికీ ప్రభువు (యెహోషువ 3:11), ప్రభువులకు ప్రభువు (ద్వితీయోపదేశకాండము 10:17). దీనికి గ్రీకు పదం కురియొస్. ఇది క్రొత్త ఒడంబడిక గ్రంథంలో యేసు క్రీస్తుకు వాడిన బిరుదు నామం. అబ్రాహాము యెహోవాను తన యజమానిగా, అన్నిటికీ ప్రభువుగా గుర్తిస్తున్నాడు. తనకు కుమారుణ్ణి అనుగ్రహించగల శక్తివంతుడుగా గుర్తిస్తున్నాడు.