Genesis - ఆదికాండము 23 | View All

1. శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికిన యేండ్లు నూట ఇరువది యేడు.

1. Sarah lived to be 127 years old.

2. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.

2. She died in Hebron in the land of Canaan, and Abraham mourned her death.

3. తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుట నుండి లేచి హేతు కుమారులను చూచి

3. He left the place where his wife's body was lying, went to the Hittites, and said,

4. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నుల యెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా
హెబ్రీయులకు 11:9-13

4. 'I am a foreigner living here among you; sell me some land, so that I can bury my wife.'

5. హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;

5. They answered,

6. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి.

6. 'Listen to us, sir. We look upon you as a mighty leader; bury your wife in the best grave that we have. Any of us would be glad to give you a grave, so that you can bury her.'

7. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి

7. Then Abraham bowed before them

8. మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.

8. and said, 'If you are willing to let me bury my wife here, please ask Ephron son of Zohar

9. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.

9. to sell me Machpelah Cave, which is near the edge of his field. Ask him to sell it to me for its full price, here in your presence, so that I can own it as a burial ground.'

10. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారులమధ్యను కూర్చుండి యుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా

10. Ephron himself was sitting with the other Hittites at the meeting place at the city gate; he answered in the hearing of everyone there,

11. అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలో నున్న గుహను నీకిచ్చుచున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టుమనెను

11. 'Listen, sir; I will give you the whole field and the cave that is in it. Here in the presence of my own people, I will give it to you, so that you can bury your wife.'

12. అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి

12. But Abraham bowed before the Hittites

13. సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చుకొనిన యెడల మృతిబొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడు నట్లు ఎఫ్రోనుతో చెప్పెను.

13. and said to Ephron, so that everyone could hear, 'May I ask you, please, to listen. I will buy the whole field. Accept my payment, and I will bury my wife there.'

14. అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును;

14. Ephron answered,

15. నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను;

15. 'Sir, land worth only four hundred pieces of silver---what is that between us? Bury your wife in it.'

16. అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.
అపో. కార్యములు 7:16

16. Abraham agreed and weighed out the amount that Ephron had mentioned in the hearing of the people---four hundred pieces of silver, according to the standard weights used by the merchants.

17. ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటి లోనున్న ఆ పొలము చెట్లన్నియు,
అపో. కార్యములు 7:16

17. That is how the property which had belonged to Ephron at Machpelah east of Mamre, became Abraham's. It included the field, the cave which was in it, and all the trees in the field up to the edge of the property.

18. అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

18. It was recognized as Abraham's property by all the Hittites who were there at the meeting.

19. ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే యెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.

19. Then Abraham buried his wife Sarah in that cave in the land of Canaan.

20. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.

20. So the field which had belonged to the Hittites, and the cave in it, became the property of Abraham for a burial ground.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 23 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
శారా మరణం, అబ్రహం సమాధి స్థలం కోసం వర్తిస్తుంది. (1-13) 
ప్రతి ఒక్కరి జీవితం చివరికి ముగుస్తుంది, కానీ జీవితం తర్వాత పాపం, మరణం లేదా విచారం లేని స్థలం ఉన్నందుకు మనం కృతజ్ఞతతో ఉండవచ్చు. మనం చనిపోయినప్పుడు కూడా దేవునితో సన్నిహితంగా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండవచ్చు. మనం చనిపోయినప్పుడు మన శరీరం మురికిగా మారుతుంది, కాబట్టి మనం భౌతిక విషయాల గురించి చింతించకుండా మంచి వ్యక్తులుగా ఉండటంపై దృష్టి పెట్టాలి. మనం చేసే అదే పనిని వారు విశ్వసించనప్పటికీ, ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి. అబ్రాహాము దీనికి మంచి ఉదాహరణ ఎందుకంటే అతను దేవుణ్ణి అనుసరించని వ్యక్తుల సమూహం యొక్క నాయకులను గౌరవించాడు, కానీ అతను వారి దయను ఉపయోగించుకోలేదు. ఇతరులు మనకు ఉచితంగా వస్తువులను ఇస్తున్నప్పుడు కూడా వారితో నిజాయితీగా మరియు న్యాయంగా ఉండటం ముఖ్యం.

శారా సమాధి చేసే స్థలం. (14-20)
మా వ్యవహారాల్లో న్యాయంగా మరియు నిజాయితీగా ఉండటం ముఖ్యం, మోసం చేయడం సరైంది కాదు. అబ్రాహాము ఎవ్వరినీ మోసం చేయడానికి ప్రయత్నించకుండా తనకు కావలసినది చెల్లించాడు, ఒక రోజు కనానులోని భూమి అంతా అతను స్వంతం చేసుకుంటాడని అతనికి తెలుసు. తనకు అవసరమైన భూమిని కొనుగోలు చేసి నిజాయితీగా చెల్లించాడు. ఆఖరికి భూమి అంతా తానే సొంతం చేసుకుంటానని తెలిసినా, తనకు కావాల్సినంత డబ్బు చెల్లించాడు. తాను కొన్న భూమిలో తన భార్య శారాను ఓ ప్రత్యేక స్థలంలో పూడ్చిపెట్టాడంటే ఆ భూమిపై అతనికి ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. అతనికి ఎక్కువ భూమి లేకపోయినా, అతను పునరుత్థానాన్ని విశ్వసించాడు మరియు ఏదో ఒక రోజు అతను మళ్లీ లేస్తానని తెలుసు. మనం మళ్లీ లేచినప్పుడు ఎవరితో ఉంటాం అనేది చాలా ముఖ్యమైన విషయం.



Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |