Genesis - ఆదికాండము 41 | View All

1. రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా

1. After two years had passed, the king of Egypt dreamed that he was standing by the Nile River,

2. చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.

2. when seven cows, fat and sleek, came up out of the river and began to feed on the grass.

3. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను.

3. Then seven other cows came up; they were thin and bony. They came and stood by the other cows on the riverbank,

4. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.

4. and the thin cows ate up the fat cows. Then the king woke up.

5. అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.

5. He fell asleep again and had another dream. Seven heads of grain, full and ripe, were growing on one stalk.

6. మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.

6. Then seven other heads of grain sprouted, thin and scorched by the desert wind,

7. అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.

7. and the thin heads of grain swallowed the full ones. The king woke up and realized that he had been dreaming.

8. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.

8. In the morning he was worried, so he sent for all the magicians and wise men of Egypt. He told them his dreams, but no one could explain them to him.

9. అప్పుడు పానదాయకుల అధిపతి - నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

9. Then the wine steward said to the king, 'I must confess today that I have done wrong.

10. ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి యింట కావలిలో ఉంచెను.

10. You were angry with the chief baker and me, and you put us in prison in the house of the captain of the guard.

11. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి.

11. One night each of us had a dream, and the dreams had different meanings.

12. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను.

12. A young Hebrew was there with us, a slave of the captain of the guard. We told him our dreams, and he interpreted them for us.

13. అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా

13. Things turned out just as he said: you restored me to my position, but you executed the baker.'

14. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.

14. The king sent for Joseph, and he was immediately brought from the prison. After he had shaved and changed his clothes, he came into the king's presence.

15. ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు

15. The king said to him, 'I have had a dream, and no one can explain it. I have been told that you can interpret dreams.'

16. యోసేపు నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.

16. Joseph answered, 'I cannot, Your Majesty, but God will give a favorable interpretation.'

17. అందుకు ఫరో నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని.

17. The king said, 'I dreamed that I was standing on the bank of the Nile,

18. బలిసినవియు, చూపున కందమైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.

18. when seven cows, fat and sleek, came up out of the river and began feeding on the grass.

19. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.

19. Then seven other cows came up which were thin and bony. They were the poorest cows I have ever seen anywhere in Egypt.

20. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.

20. The thin cows ate up the fat ones,

21. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.

21. but no one would have known it, because they looked just as bad as before. Then I woke up.

22. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను.

22. I also dreamed that I saw seven heads of grain which were full and ripe, growing on one stalk.

23. మరియు తూర్పు గాలిచేత చెడిపోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.

23. Then seven heads of grain sprouted, thin and scorched by the desert wind,

24. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.

24. and the thin heads of grain swallowed the full ones. I told the dreams to the magicians, but none of them could explain them to me.'

25. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు

25. Joseph said to the king, 'The two dreams mean the same thing; God has told you what he is going to do.

26. ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.

26. The seven fat cows are seven years, and the seven full heads of grain are also seven years; they have the same meaning.

27. కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.

27. The seven thin cows which came up later and the seven thin heads of grain scorched by the desert wind are seven years of famine.

28. నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.

28. It is just as I told you---God has shown you what he is going to do.

29. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.

29. There will be seven years of great plenty in all the land of Egypt.

30. మరియు కరవుగల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.

30. After that, there will be seven years of famine, and all the good years will be forgotten, because the famine will ruin the country.

31. దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.

31. The time of plenty will be entirely forgotten, because the famine which follows will be so terrible.

32. ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడియున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను.

32. The repetition of your dream means that the matter is fixed by God and that he will make it happen in the near future.

33. కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.

33. 'Now you should choose some man with wisdom and insight and put him in charge of the country.

34. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను.

34. You must also appoint other officials and take a fifth of the crops during the seven years of plenty.

35. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.

35. Order them to collect all the food during the good years that are coming, and give them authority to store up grain in the cities and guard it.

36. కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.

36. The food will be a reserve supply for the country during the seven years of famine which are going to come on Egypt. In this way the people will not starve.'

37. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక

37. The king and his officials approved this plan,

38. అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.

38. and he said to them, 'We will never find a better man than Joseph, a man who has God's spirit in him.'

39. మరియఫరో - దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.

39. The king said to Joseph, 'God has shown you all this, so it is obvious that you have greater wisdom and insight than anyone else.

40. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.
అపో. కార్యములు 7:10

40. I will put you in charge of my country, and all my people will obey your orders. Your authority will be second only to mine.

41. మరియఫరో - చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.

41. I now appoint you governor over all Egypt.'

42. మరియఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి

42. The king removed from his finger the ring engraved with the royal seal and put it on Joseph's finger. He put a fine linen robe on him, and placed a gold chain around his neck.

43. తన రెండవ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు - వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.
అపో. కార్యములు 7:10

43. He gave him the second royal chariot to ride in, and his guard of honor went ahead of him and cried out, 'Make way! Make way!' And so Joseph was appointed governor over all Egypt.

44. మరియఫరో యోసేపుతో - ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.

44. The king said to him, 'I am the king---and no one in all Egypt shall so much as lift a hand or a foot without your permission.'

45. మరియఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.

45. He gave Joseph the Egyptian name Zaphenath Paneah, and he gave him a wife, Asenath, the daughter of Potiphera, a priest in the city of Heliopolis. Joseph was thirty years old when he began to serve the king of Egypt. He left the king's court and traveled all over the land.

46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.
అపో. కార్యములు 7:10

46. (SEE 41:45)

47. సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.

47. During the seven years of plenty the land produced abundant crops,

48. ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.

48. all of which Joseph collected and stored in the cities. In each city he stored the food from the fields around it.

49. యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్యమాయెను గనుక కొలుచుట మానివేసెను.

49. There was so much grain that Joseph stopped measuring it---it was like the sand of the sea.

50. కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.

50. Before the years of famine came, Joseph had two sons by Asenath.

51. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.

51. He said, 'God has made me forget all my sufferings and all my father's family'; so he named his first son Manasseh.

52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.

52. He also said, 'God has given me children in the land of my trouble'; so he named his second son Ephraim.

53. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత

53. The seven years of plenty that the land of Egypt had enjoyed came to an end,

54. యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.
అపో. కార్యములు 7:11

54. and the seven years of famine began, just as Joseph had said. There was famine in every other country, but there was food throughout Egypt.

55. ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో - మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.
యోహాను 2:5, అపో. కార్యములు 7:11

55. When the Egyptians began to be hungry, they cried out to the king for food. So he ordered them to go to Joseph and do what he told them.

56. కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను;

56. The famine grew worse and spread over the whole country, so Joseph opened all the storehouses and sold grain to the Egyptians.

57. మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.

57. People came to Egypt from all over the world to buy grain from Joseph, because the famine was severe everywhere.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 41 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఫరో కలలు. (1-8) 
జోసెఫ్ జైలులో ఉన్నాడు, కానీ రాజుకు కొన్ని ప్రత్యేక కలల కారణంగా అతను విడుదలయ్యాడు. ఈ కలలు జోసెఫ్‌కు సహాయం చేయడానికి దేవుడు పంపాడు. ఈ రోజుల్లో, దేవుడు ఇకపై అలాంటి కలల ద్వారా మనతో మాట్లాడడు, కాబట్టి మన కలల గురించి మాట్లాడటం ముఖ్యం కాదు. అయినప్పటికీ, తన కలలు ముఖ్యమైనవని ఫరోకు తెలుసు, ఎందుకంటే అతను మేల్కొన్నప్పుడు అవి అతనికి ఆందోళన కలిగించాయి.

జోసెఫ్ ఫరో కలలను వివరించాడు. (9-32)
దేవుడు తన ప్రజలు ఎదగడానికి ఉత్తమమైన సమయాన్ని ఎంచుకుంటాడు. జోసెఫ్ జైలు నుండి ముందే విడుదల చేయబడి ఉంటే, అతను ఇంటికి తిరిగి వెళ్లి ఉండవచ్చు మరియు అతను చేసినంత విజయవంతం కాకపోవచ్చు. యోసేపు ఫరోను కలిసినప్పుడు, అతడు దేవునికి ఘనత ఇచ్చాడు. ఈజిప్టు పంటలకు ముఖ్యమైన నైలు నది నుండి ఆవులు రావడం గురించి ఫరోకు కల వచ్చింది. దేవుడు మనకు వర్షం మరియు నదుల వంటి అనేక రకాలుగా బహుమతులు ఇస్తాడు, కానీ మనం ఇప్పటికీ ప్రతిదీ చేసిన దేవునిపై ఆధారపడతాము. జీవితం మారవచ్చు మరియు రేపు లేదా వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా చెప్పలేము. మనకి ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి, అది చాలా లేదా కొంచెం. చెడ్డవాళ్ళ కంటే ముందు ఏడు సంవత్సరాల మంచి పంటలు ఇవ్వడం ద్వారా దేవుడు మనకు మంచిగా ఉన్నాడు, కాబట్టి మేము సిద్ధం చేయగలము. కొన్నిసార్లు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం ఉంటుంది, మరియు కొన్నిసార్లు మనకు తగినంతగా ఉండదు, కానీ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని మనం ఎల్లప్పుడూ నమ్మవచ్చు. కరువులో కోల్పోయిన పెద్ద పంటల వంటి జీవితంలో మనం ఆనందించే విషయాలు త్వరగా అదృశ్యమవుతాయి, కాబట్టి మనం ఇప్పుడు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండాలి. ఒక ప్రత్యేకమైన రొట్టె ఉంది, అది శాశ్వతంగా ఉంటుంది మరియు దాని కోసం కష్టపడి పనిచేయడం ముఖ్యం. మనం ఈ ప్రపంచంలో వస్తువులను పొందడం గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తే, తరువాత వాటి గురించి ఆలోచించినప్పుడు మనం చాలా సంతోషంగా ఉండము.

జోసెఫ్ సలహా, అతను చాలా అభివృద్ధి చెందినవాడు. (33-45) 
జోసెఫ్ ఫరోకు మంచి సలహా ఇచ్చాడు. విషయాల గురించి మిమ్మల్ని హెచ్చరించే వ్యక్తులను వినడం మరియు మీకు సహాయం చేయగల వ్యక్తుల సలహాలను కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. బైబిల్‌లో, దేవుడు మనకు రాబోయే కష్ట సమయాలు ఉంటాయని చెప్పాడు మరియు మనం మంచిగా ఉండటం ద్వారా మరియు అతని సహాయం కోసం అడగడం ద్వారా వాటి కోసం సిద్ధం కావాలి. జోసెఫ్ నిజంగా మంచి వ్యక్తి అని ఫరో భావించాడు మరియు అతనిలో దేవుని ఆత్మ ఉన్నందున అతన్ని చాలా గౌరవించాడు. ఫరో యోసేపును ఎంత విలువైనవాడో చూపించాడు. జోసెఫ్‌కు కొత్త పేరు వచ్చింది, అది అతనికి ఇచ్చిన వ్యక్తికి అతను ఎంత ముఖ్యమో చూపించాడు. అతను రహస్యాలను బహిర్గతం చేయగలడు అంటే ఇది ప్రత్యేకమైన మారుపేరు లాంటిది. దీంతో ప్రజలకు దేవుడిపై నమ్మకం పెరిగింది. కొంతమంది జోసెఫ్‌ను "లోక రక్షకుడు" అని కూడా పిలుస్తారు. యేసు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి మరియు పరలోకం మరియు భూమిపై అన్ని శక్తిని కలిగి ఉన్నాడని ఇది మనకు గుర్తుచేస్తుంది. 

జోసెఫ్ పిల్లలు, కరువు ప్రారంభం. (46-57)
జోసెఫ్‌కు మనష్షే మరియు ఎఫ్రాయిమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు మరియు కష్ట సమయాల్లో దేవుడు తనకు సహాయం చేసి విజయం సాధించాడని అతను నమ్మాడు. అతను చాలా ఆహారంతో మంచి సమయాన్ని గడిపాడు, కానీ అది శాశ్వతంగా ఉండదని అతనికి తెలుసు. కాబట్టి, కష్ట సమయాల్లో కొంత ఆహారాన్ని ఆదా చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు. తరువాత, చాలా చోట్ల ఆహార కొరత ఏర్పడింది, కానీ జోసెఫ్ తెలివైనవాడు మరియు ఇతరులకు సహాయం చేయడానికి తగినంత పొదుపు చేసాడు. జోసెఫ్ ముఖ్యమైన విషయాలపై పని చేస్తున్నప్పుడు అతని తండ్రి యాకోబు అతను వెళ్లిపోయాడని చెప్పాడు. నిజం తెలుసుకుంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. చెడు విషయాలు జరిగినప్పుడు మనం యేసు గురించి ఆలోచించాలి. మనం సంతోషంగా ఉండాలంటే మనం చెల్లించాల్సిన అవసరం లేకుండా యేసు మనకు ఇవ్వగలడు. కానీ మనం యేసు మాట వినకపోతే, మనం ఆకలితో మరియు ఇబ్బందుల్లో ఉంటాము. 




Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |