Kings II - 2 రాజులు 14 | View All

1. ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.

1. In the second year of Jehoash the son of Jehoahaz, king of Israel, Joash's son Amaziah began to rule as king of Judah.

2. అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువదితొమ్మిది సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపుర స్థురాలైన యెహోయద్దాను.

2. He was twenty-five years old when he became king. And he ruled twenty-nine years in Jerusalem. His mother's name was Jehoaddin of Jerusalem.

3. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక పోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను.

3. Amaziah did what was right in the eyes of the Lord, but not like David his father. He did all that his father Joash had done.

4. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.

4. But the high places were not taken away. The people still gave gifts and burned special perfume on the high places.

5. రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను.

5. As soon as the nation was under Amaziah's power, he killed the servants who had killed his father when he was king.

6. అయితేకుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింప కూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణ శిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్ర మందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.

6. But he did not kill the sons of the killers. Because it is written in the Book of the Law of Moses, as the Lord said, 'The fathers must not be put to death for the sons. And the sons must not be put to death for the fathers. Each must be put to death for his own sin.'

7. మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.

7. Amaziah killed 10,000 Edomites in the Valley of Salt, and took Sela by war. He gave it the name Joktheel, which is its name to this day.

8. అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపిమనము ఒకరి నొకరము దర్శించు నట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా

8. Then Amaziah sent men with news to Jehoash, the son of Jehoahaz son of Jehu, king of Israel, saying, 'Come, let us look at each other in the face.'

9. ఇశ్రా యేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెనులెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటినీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానో నులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.

9. Jehoash king of Israel answered Amaziah king of Judah, saying, 'The thorn bush in Lebanon sent word to the cedar tree in Lebanon, saying, 'Give your daughter to my son in marriage.' But a wild animal passed by in Lebanon, and crushed the thorn bush under its feet.

10. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతొకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయ ములో దిగుదువని చెప్పినను

10. Yes, you have won the battle against Edom. Your heart has become proud. Be happy with your greatness and stay at home. For why should you make trouble so that you fall, and Judah with you?'

11. అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా

11. But Amaziah would not listen. So King Jehoash of Israel went up. He and Amaziah king of Judah fought each other at Beth-shemesh, which belongs to Judah.

12. యూదావారు ఇశ్రా యేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి.

12. Israel won the battle against Judah, and every man of Judah ran away to his tent.

13. మరియు ఇశ్రా యేలు రాజైన యెహోయాషు అహజ్యాకుపుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూష లేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

13. King Jehoash of Israel took Amaziah king of Judah, son of Jehoash the son of Ahaziah, at Beth-shemesh. Then he came to Jerusalem and tore down the city wall, from the Gate of Ephraim to the Corner Gate. He tore down the wall as far as 200 long steps.

14. మరియయెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్తవస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.

14. He took all the gold and silver and all the objects found in the house of the Lord and in the store-rooms of the king's house. He took people against their will also, and he returned to Samaria.

15. యెహోయాషు చేసిన యితర కార్యములను గూర్చియు, అతని పరాక్రమ మును గూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

15. Now the rest of the acts of Jehoash, his strength and how he fought with King Amaziah of Judah are written in the Book of the Chronicles of the Kings of Israel.

16. అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్ట బడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.

16. Jehoash died and was buried in Samaria with the kings of Israel. His son Jeroboam became king in his place.

17. యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహోయాహాజు కుమారుడైన యెహో యాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.

17. Amaziah the son of Joash, king of Judah, lived fifteen years after the death of Jehoash the son of Jehoahaz, king of Israel.

18. అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

18. The rest of the acts of Amaziah are written in the Book of the Chronicles of the Kings of Judah.

19. అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.

19. They made plans against Amaziah in Jerusalem, and he ran away to Lachish. But they sent men after him to Lachish and killed him there.

20. వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.

20. Then they brought him on horses and buried him with his fathers at Jerusalem the city of David.

21. అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభి షేకము చేసిరి.

21. The people of Judah took Azariah and made him king in the place of his father Amaziah. He was sixteen years old.

22. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.

22. Azariah built Elath and returned it to Judah, after the king died.

23. యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా యేలుబడిలో పదునయిదవ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రో నులో ఏలనారంభించి నలువదియొక సంవత్సరములు ఏలెను.

23. In the fifteenth year of Amaziah the son of Joash, king of Judah, Jeroboam the son of Joash, king of Israel, began to rule in Samaria and ruled forty-one years.

24. ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

24. Jeroboam did what was sinful in the eyes of the Lord. He did not turn away from all the sins of Jeroboam the son of Nebat, which made Israel sin.

25. గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలువారి సరి హద్దును మరల స్వాధీనము చేసికొనెను.

25. He took back the land of Israel from Hamath as far as the Sea of the Arabah, as was told by the word of the Lord, the God of Israel. The Lord spoke about this through His servant Jonah the son of Amittai. Jonah was the man from Gath-hepher who spoke for the Lord.

26. ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.

26. For the Lord saw that the trouble of Israel was very bitter. There was no one left of the servants or of those who were free. There was no one to help Israel.

27. యెహోవా ఇశ్రాయేలువారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకాశము క్రిందనుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి యుండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొ బాము ద్వారా వారిని రక్షించెను.

27. The Lord did not say that He would destroy the name of Israel from under heaven. So He saved them by the hand of Jeroboam the son of Joash.

28. యరొబాము చేసిన యితరకార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంత టిని గూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు, అతడు చేసిన యుద్ధమునుగూర్చియు, దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రా యేలువారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

28. Jeroboam fought Judah and took back Damascus and Hamath for Israel. The rest of the acts of Jeroboam, all he did and his strength are written in the Book of the Chronicles of the Kings of Israel.

29. యరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.

29. Jeroboam was buried with his fathers, the kings of Israel. His son Zechariah became king in his place.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అమజ్యా మంచి పాలన. (1-7) 
అమజియా సానుకూల గమనికతో ప్రారంభించాడు, కానీ అతని పురోగతి కొనసాగలేదు. సామాజిక నిబంధనలకు అనుగుణంగా మన భక్తుడైన పూర్వీకుల చర్యలను పునరావృతం చేయడం సరిపోదు. మనం వారిని కేవలం పనుల్లోనే కాకుండా, విశ్వాసం మరియు భక్తి యొక్క అంతర్లీన పునాదిలో కూడా వారి చిత్తశుద్ధి మరియు దృఢనిశ్చయాన్ని కొనసాగించాలి.

అమజ్యా ఇశ్రాయేలు రాజు యోవాషును రెచ్చగొట్టి, జయించబడ్డాడు. (8-14) 
రాజ్యాల విభజన తరువాత, ఇజ్రాయెల్ నుండి వచ్చిన శత్రుత్వం కారణంగా యూదా ప్రతికూల కాలాన్ని అనుభవించింది. ఆసా యుగం తర్వాత, ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలు మరియు పొత్తుల కారణంగా అది మరిన్ని సవాళ్లను ఎదుర్కొంది. ప్రస్తుతం, మేము వారి మధ్య మళ్లీ శత్రుత్వాన్ని చూస్తున్నాము. నిరాడంబరమైన వ్యక్తికి ఇద్దరు అహంకారాలు మరియు అసహ్యకరమైన వ్యక్తులు తమ తెలివిని ఒకరినొకరు చిన్నచూపు మరియు తక్కువ అంచనా వేయడాన్ని గమనించడం చాలా వినోదభరితంగా ఉంటుంది. అపవిత్రమైన విజయాలు అహంకారాన్ని పెంచుతాయి మరియు అహంకారం సంఘర్షణలకు ఆజ్యం పోస్తుంది. ఇతరులలో అహంకారం యొక్క పరిణామాలు తమలో తాము అహంకారాన్ని కలిగి ఉన్నవారికి భరించలేనివిగా మారతాయి. వ్యక్తిగత జీవితంలో అలజడులకు, అక్రమాలకు ఇవే మూలాలు. అయినప్పటికీ, వారు పాలకుల మధ్య తలెత్తినప్పుడు, వారు మొత్తం రాజ్యాల బాధగా రూపాంతరం చెందుతారు. యోవాష్ అమజ్యాకు తన సవాలు యొక్క మూర్ఖత్వం గురించి జ్ఞానోదయం చేస్తాడు, అతని హృదయం గర్వంతో నిండిపోయిందని ఎత్తి చూపాడు. అన్ని పాపాల మూలం హృదయంలో ఉద్భవించింది మరియు తరువాత బయటికి వ్యాపిస్తుంది. వ్యక్తులు అహంకారం, ఆత్మసంతృప్తి, అసంతృప్తి లేదా ఇలాంటివి కావడానికి కారణం ప్రొవిడెన్స్, ఈవెంట్‌లు లేదా పరిస్థితుల వంటి బాహ్య కారకాలు కాదు. బదులుగా, వారి స్వంత హృదయాలు వారిని ఆ మార్గంలో నడిపిస్తాయి.

అతను కుట్రదారులచే చంపబడ్డాడు. (15-22) 
అమాజియా తన సొంత వ్యక్తుల చేతిలో తన మరణాన్ని కలుసుకోవడానికి ముందు పదిహేను సంవత్సరాల పాటు తన విజేతను మించి జీవించాడు. ఉజ్జియా అని కూడా పిలువబడే అజారియా, అతని తండ్రి చంపబడినప్పుడు చాలా చిన్నవాడు. అతని పాలనా కాలం నిర్దిష్ట సంఘటన నుండి లెక్కించబడినప్పటికీ, అతను పదకొండు సంవత్సరాల తరువాత వరకు అధికారికంగా సింహాసనాన్ని అధిరోహించలేదు.

జెరోబోమ్ II యొక్క దుష్ట పాలన. (23-29)
దేవుడు ఇజ్రాయెల్ పట్ల తన ఉద్దేశాలను ప్రకటించడానికి ప్రవక్త అయిన యోనాను ఒక పాత్రగా లేపాడు. ప్రజల మధ్య నమ్మకమైన పరిచారకులు కొనసాగడం దేవుడు వారిని విడిచిపెట్టలేదనడానికి సూచన. దేవుడు వారికి విజయాలను ఎందుకు ప్రసాదించాడో వివరించడానికి రెండు కారణాలు అందించబడ్డాయి: 
1. వారి ప్రగాఢ బాధ అతని కరుణను ప్రేరేపించి, అతని దయతో కూడిన జోక్యాన్ని ప్రేరేపించింది. 
2. వారి విధ్వంసం యొక్క శాసనం అమలులోకి రావడానికి ఇంకా సమయం రాలేదు. ఇజ్రాయెల్‌లో చాలా మంది ప్రవక్తలు ఉద్భవించినప్పటికీ, ఈ యుగం వరకు ఎవరూ వ్రాతపూర్వక ప్రవచనాలను వదిలిపెట్టలేదు, అవి ఇప్పుడు బైబిల్లో భాగమయ్యాయి. యరొబాము పాలనలో, హోషేయ తన ప్రవచన పరిచర్యను ప్రారంభించాడు, ఆమోస్‌తో కలిసి మరియు కొంతకాలం తర్వాత మీకా ద్వారా. ఆహాజు మరియు హిజ్కియా కాలంలో, యెషయా కూడా ప్రవక్తగా ఉద్భవించాడు. ఈ పద్ధతిలో, చర్చి యొక్క అస్పష్టమైన మరియు అత్యంత క్షీణించిన కాలాల్లో కూడా, దేవుడు కాంతి దీపస్తంభాలుగా ప్రకాశించేలా ప్రకాశించే బొమ్మలను లేపాడు. వారి బోధనలు, సజీవ ఉదాహరణలు మరియు కొన్ని సందర్భాల్లో, రచనల ద్వారా, వారు తమ స్వంత కాలాలను ప్రకాశింపజేసారు మరియు ఈ చివరి యుగాలలో మన కాలాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉన్నారు.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |