Kings II - 2 రాజులు 18 | View All

1. ఇశ్రాయేలురాజును ఏలా కుమారుడునైన హోషేయ యేలుబడిలో మూడవ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా యేలనారంభించెను.

1. ishraayeluraajunu elaa kumaarudunaina hosheya yelubadilo moodava samvatsaramandu yoodhaaraajunu aahaaju kumaarudunaina hijkiyaa yelanaarambhinchenu.

2. అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె; ఆమెకు అబీ అని పేరు.

2. athadu elanaarambhinchinappudu iruvadhi yayidhendlavaadai yerooshalemunandu iruvadhi tommidi samvatsaramulu elenu. Athani thalli jekaryaa kumaarthe; aameku abee ani peru.

3. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను.

3. thana pitharudaina daaveedu chesinatlu athadu yehovaa drushtiki poornamugaa neethinanusarinchenu.

4. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభ ములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి

4. unnatha sthalamulanu kottivesi vigrahamulanu pagulagotti dhevathaa sthambha mulanu padagotti moshechesina yitthadi sarpamunu chinnaabhinnamulugaa chesenu. daaniki ishraayeleeyulu nehushtaananu perupetti daaniki dhoopamu veyuchu vachiyundiri

5. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు.

5. athadu ishraayeleeyula dhevudaina yehovaa yandu vishvaasamunchinavaadu; athani tharuvaatha vachina yoodhaa raajulalonu athani poorvikulaina raajulalonu athanithoo samamainavaadu okadunuledu.

6. అతడు యెహోవాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను.

6. athadu yehovaathoo hatthukoni, aayananu vembadinchutalo venuka theeyaka aayana mosheku aagnaapinchina aagnalannitini gaikonuchundenu.

7. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను.

7. kaavuna yehovaa athaniki thoodugaa undenu; thaanu vellina choota nella athadu jayamu pondhenu. Athadu ashshooru raajunaku sevacheyakunda athanimeeda thirugabadenu.

8. మరియగాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.

8. mariyu gaajaa pattanamuvaraku daani sarihaddulavaraku kaaparula gudiselayandhemi, praakaaramulugala pattanamulayandhemi, anthatanu athadu philishtheeyulanu odinchenu.

9. రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సర మందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారు డగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను.

9. raajaina hijkiyaa yelubadilo naalugava samvatsara mandu, ishraayeluraajaina elaa kumaaru dagu hosheya yelubadilo edava samvatsaramandu, ashshooruraajaina shalma neseru shomronu patnanamumeediki vachi muttadivesenu.

10. మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు, ఇశ్రాయేలురాజైన హోషేయ యేలు బడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను.

10. moodu samvatsaramulu poorthiyaina tharuvaatha ashshooreeyulu daani pattukoniri. Hijkiyaa yelubadilo aarava samvatsaramandu, ishraayeluraajaina hosheya yelu badilo tommidava samvatsaramandu shomronu pattanamu pattabadenu.

11. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి యుండిరి.

11. thama dhevudaina yehovaa selavichina maata vinanivaarai aayana nibandhanakunu aayana sevakudaina moshe aagnaapinchina daananthatikini lobadaka athikraminchi yundiri.

12. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.

12. ashshooru raaju ishraayelu vaarini ashshooru dheshamuloniki theesikoni poyi gojaanu nadhi daggaranunna haalahu haaboru anu pattanamulalonu maadeeyula pattanamulalonu vaarini unchenu.

13. రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవ త్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశ మందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా

13. raajaina hijkiyaa yelubadilo padunaalugava sanva tsaramandu ashshooruraajaina sanhereebu yoodhaa dhesha mandunna praakaaramulugala pattanamulanniti meediki vachi vaatini pattukonagaa

14. యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపినావలన తప్పు వచ్చినది;నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియ మించెను.

14. yoodhaaraajaina hijkiyaa laakeeshu pattanamandunna ashshooru raajunoddhaku doothalanu pampinaavalana thappu vachinadhi;naayoddhanundi thirigi neevu vellipoyinayedala naameeda neevu mopinadaanini nenu bharinchudunani varthamaanamucheyagaa, ashshooruraaju yoodhaa raajaina hijkiyaaku aaru vandala manugula vendiyu aruvadhi manugula bangaaramunu julmaanaagaa niya minchenu.

15. కావున హిజ్కియా యెహోవా మందిర మందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను.

15. kaavuna hijkiyaa yehovaa mandira mandunu raajanagarunandunna padaarthamulalo kanabadina vendiyanthayu athanikicchenu.

16. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను.

16. mariyu aa kaalamandu hijkiyaa dhevaalayapu thalupulakunna bangaaramunu thaanu kattinchina sthambhamulakunna bangaaramunu theeyinchi ashshooru raajunakicchenu.

17. అంతట అష్షూరురాజు తర్తానును రబ్సారీసును రబ్షా కేనును లాకీషు పట్టణమునుండి యెరూష లేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా

17. anthata ashshooruraaju tharthaanunu rabsaareesunu rabshaa kenunu laakeeshu pattanamunundi yeroosha lemunandunna raajaina hijkiyaameediki bahu goppa samoohamuthoo pampenu. Vaaru yerooshalemumeediki vachi chaakirevu maargamandunna merakakolanu kaaluva yoddha praveshinchi nilichi raajunu piluvanampagaa

18. హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యా కీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపుదస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి.

18. hilkeeyaa kumaarudunu gruhanirvaahakudunaina elyaa keemunu, shaastriyagu shebnaayunu, raajyapudasthaavejula meeda nunna aasaapu kumaarudaina yovaahunu vaari yoddhaku poyiri.

19. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెనుఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడుమహా రాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగానీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి?

19. appudu rabshaake vaarithoo itlanenu'ee maata hijkiyaathoo teliyajeppudumahaa raajaina ashshooruraaju selavichinadhemanagaaneevu eelaagu cheppavalenu. neevu nammukonu ee aashrayaaspadamu epaati prayojanakaari?

20. యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?

20. yuddha vishayamulo nee yochanayu nee balamunu vatti maatale. Evani nammukoni naameeda thirugubaatu cheyuchunnaavu?

21. నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చు కొని దూసి పోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొను వారి కందరికిని అట్టివాడే.

21. naligina relluvanti yee aigupthunu neevu nammukonuchunnaavu gadaa okadu daanimeeda aanukonnayedala adhi vaanichethiki guchu koni doosi povunu. Aigupthuraajaina pharo athani nammukonu vaari kandarikini attivaade.

22. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెద రేమో సరే. - యెరూషలేమందున్న యీ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా?

22. maa dhevudaina yehovaanu memu nammukonuchunnaamani meeru naathoo cheppeda remo sare. -- Yerooshalemandunna yee balipeethamunoddha maatrame meeru namaskaaramu cheyavalenani yoodhaa vaarikini yerooshalemuvaarikini aagna ichi hijkiyaa yevani unnathasthalamulanu balipeethamulanu padagotteno aayanegadaa yehovaa?

23. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న యెడల నేను వాటిని నీకిచ్చెదను.

23. kaavuna chitthaginchi ashshooru raajaina naa yelinavaanithoo pandemu veyumu; renduvela gurramulameeda rauthulanu ekkinchutaku neeku shakthiyunna yedala nenu vaatini neekicchedanu.

24. అట్లయితే నా యజ మానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే.

24. atlayithe naa yaja maanuni sevakulalo atyalpudaina adhipathiyagu okanini neevelaagu edirinthuvu? Rathamulanu rauthulanu pampunani aigupthuraajunu neevu aashrayinchukontive.

25. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు; ఆ దేశముమీదికి పోయి దాని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను.

25. yehovaa selavu nondakaye ee dheshamunu paaducheyutaku nenu vachithinaa? Ledu; aa dheshamumeediki poyi daani paadu cheyumani yehovaa naaku aagna icchenu anenu.

26. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారుచిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాట లాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా

26. hilkeeyaa kumaarudaina elyaakeemu shebnaayu yovaahu anuvaaruchitthaginchumu, nee daasulamaina maaku siriyaa bhaasha teliyunu ganuka daanithoo maata laadumu; praakaaramumeeda nunna prajala vinikidilo yoodula bhaashathoo maatalaadakumani rabshaakethoo anagaa

27. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమమలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద కూర్చున్నవారియొద్దకును నన్ను పంపెనుగదా అని చెప్పి

27. rabshaake ee maatalu chepputakai naa yajamaanudu nee yajamaanuni yoddhakunu neeyoddhakunu nannu pampenaa? thamamalamunu thinunatlunu thama mootramunu traagunatlunu meethookooda praakaaramumeeda koorchunnavaariyoddhakunu nannu pampenugadaa ani cheppi

28. గొప్పశబ్దముతో యూదాభాషతో ఇట్లనెనుమహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా

28. goppashabdamuthoo yoodhaabhaashathoo itlanenumahaaraajaina ashshooruraaju selavichina maatalu vinudi. Raaju selavichinadhemanagaa

29. హిజ్కియాచేత మోసపోకుడి; నా చేతిలోనుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.

29. hijkiyaachetha mosapokudi; naa chethilonundi mimmunu vidipimpa shakthi vaaniki chaaladu.

30. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించియెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.

30. yehovaanu batti mimmunu namminchiyehovaa manalanu vidipinchunu, ee pattanamu ashshooruraaju chethilo chikkakapovunani hijkiyaa cheppuchunnaade.

31. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు; అష్షూరురాజు సెలవిచ్చినదేమ నగానాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టుఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును.

31. hijkiyaa cheppina maata meerangeekarimpavaddu; ashshooruraaju selavichinadhema nagaanaathoo sandhichesikoni naayoddhaku meeru bayatiki vachinayedala meelo prathimanishi thana draakshachettuphalamunu thana anjoorapuchettu phalamunu thinuchu thana baavi neellu traaguchu undunu.

32. అటుపిమ్మట మీరుచావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమున కును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావునయెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.

32. atupimmata meeruchaavaka bradukunatlugaa memu vachi mee dheshamuvanti dheshamunaku, anagaa godhumalunu draakshaarasamunu gala dheshamunakunu, aahaaramunu draakshachetlunu gala dheshamuna kunu,oleevathailamunu theneyunugala dheshamunakunu mimmunu theesikoni povudunu, acchata meeru sukhamugaa nunduru. Kaavunayehovaa mimmunu vidipinchunani cheppi hijkiyaa meeku bodhinchu maatalanu vinavaddu.

33. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా?

33. aayaa janamula dhevathalalo edainanu thana dheshamunu ashshooruraaju chethilonundi vidipinchenaa?

34. హమాతు దేవతలు ఏమా యెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?

34. hamaathu dhevathalu emaa yenu? Arpaadu dhevathalu emaayenu? Separvayeemu dhevathalu emaayenu? Hena ivvaa anuvaari dhevathalu emaayenu? (shomronu dheshapu) dhevatha maa chethilonundi shomronunu vidipinchenaa?

35. యెహోవా మా చేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను.

35. yehovaa maa chethilonundi yerooshalemunu vidipinchunanutaku aayaa dheshamula dhevathalalo edainanu thana dheshamunu maa chethilonundi vidipinchinadhi kaladaa ani cheppenu.

36. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి.

36. ayithe athaniki pratyuttharamiyyavaddani raaju selavichi yundutachetha janulu enthamaatramunu pratyuttharamiyyaka oorakundiri.

37. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడు నైన ఎల్యాకీ మును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును, బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.

37. gruha nirvaahakudunu hilkeeyaa kumaarudu naina elyaakee munu, shaastriyagu shebnaayunu, raajyapu dasthaavejulameedanunna aasaapu kumaarudaina yovaahunu, battalu chimpukoni hijkiyaayoddhaku vachi, rabshaake palikina maatalanniyu teliyajeppiri.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదాలో హిజ్కియా మంచి పాలన, విగ్రహారాధన. (1-8) 
హిజ్కియా నిజంగా దావీదు స్ఫూర్తిని మూర్తీభవించాడు, అయితే ఇతరులు కూడా సరైనది చేసేవారు, దావీదు భక్తితో ఎవరూ సరిపోలలేదు. కష్టం మరియు నైతిక క్షీణత సమయాల్లో, విషయాలు అనంతంగా క్షీణించబడతాయని భావించడం ముఖ్యం. ఇది ఇచ్చినది కాదు. పేద పాలకుల వారసత్వం ఉన్నప్పటికీ, దేవుని ప్రావిడెన్స్ నుండి డేవిడ్‌ను గుర్తుచేసే నాయకుడు ఉద్భవించాడు.
ఇత్తడి పాము నిశితంగా సంరక్షించబడింది, ఇశ్రాయేలీయుల ఎడారిలో నివసించే సమయంలో దేవుని దయకు ఇది నిదర్శనం. అయితే, దానికి ధూపం వేయడం వ్యర్థం మరియు పాపం. దేవుని వాక్యం ద్వారా ఆమోదించబడని ఏదైనా భక్తి ఆచారాలు విశ్వాసం యొక్క యథార్థ అభ్యాసానికి భంగం కలిగిస్తాయి, ఇది తరచుగా మూఢనమ్మకాలకు మరియు ఇతర ప్రమాదకరమైన ఆపదలకు దారి తీస్తుంది. మానవ వంపు అటువంటి పద్ధతులను వక్రీకరించే ధోరణిని కలిగి ఉంటుంది. నిజమైన విశ్వాసానికి అటువంటి ఊతకర్రలు అవసరం లేదు; దేవుని వాక్యంలో లీనమై, ప్రతిరోజూ దాని గురించి ఆలోచించడం మరియు దాని గురించి ప్రార్థించడం మాత్రమే అవసరమైన బాహ్య మద్దతుగా సరిపోతుంది.

సన్హెరీబ్ యూదాపై దండెత్తాడు. (9-16) 
యూదాపై సన్హెరిబ్ యొక్క దండయాత్ర రాజ్యం మీద తీవ్ర విపత్తును తెచ్చిపెట్టింది, ఇది హిజ్కియా విశ్వాసానికి పరీక్షగా మరియు దేవుడు తన ప్రజలను క్రమశిక్షణలో ఉంచడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది. దాగి ఉన్న శత్రుత్వం, నిష్కపటమైన ప్రవర్తన మరియు చాలా మందిలో ఆవేశం లేకపోవడం సరిదిద్దాల్సిన అవసరం ఉంది; ఈ పరీక్షలు నీతిమంతుల విశ్వాసం మరియు ఆశావాదాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి, దేవుని ప్రావిడెన్స్‌పై నిజమైన ఆధారపడే దిశగా వారిని నడిపిస్తాయి.

రబ్షాకే దూషణలు. (17-37)
యూదుల ప్రతిఘటన వ్యర్థమని వారిని ఒప్పించడానికి రబ్షాకే ప్రయత్నిస్తాడు. మీరు ఏ విధమైన హామీలో మీ నమ్మకాన్ని ఉంచుతారు? దేవునితో సయోధ్యను కోరుకునేటప్పుడు పాపులు ఈ వాదనను పట్టించుకోవడం తెలివైన పని. కాబట్టి, మనం ఆయనకు లొంగిపోవడం వివేకం, ఆయనకు వ్యతిరేకంగా పోరాడడం చివరికి వ్యర్థం. ఆయనను వ్యతిరేకించే వారికి ఎలాంటి విశ్వాసం ఉంటుంది? రబ్షాకే ప్రసంగం వాక్చాతుర్యం యొక్క మోసపూరిత ప్రదర్శన, అయినప్పటికీ అది గర్వం, దుర్మార్గం, అబద్ధం మరియు దైవదూషణతో నిండి ఉంది.
హిజ్కియా ప్రభువులు మౌనంగా ఉండటాన్ని ఎంచుకున్నారు. మాట్లాడటానికి ఒక క్షణం ఉన్నట్లే, పదాలను నిలిపివేయడానికి ఒక క్షణం ఉంది. కొంతమంది వ్యక్తులు మతపరమైన లేదా తార్కిక స్వభావం గల దేనినీ అంగీకరించరు, ఇది స్వైన్ ముందు ముత్యాలు వేయడానికి సమానంగా ఉంటుంది. వారి మౌనం రబ్షాకే యొక్క అహంకారానికి మరియు ఆత్మసంతృప్తికి ఆజ్యం పోసింది. తరచుగా, అటువంటి వ్యక్తులు వారి రెయిలింగ్‌లను మరియు దైవదూషణను వెదజల్లడానికి అనుమతించడం అత్యంత ప్రభావవంతమైనది; విరక్తి యొక్క స్పష్టమైన ప్రదర్శన వారికి వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. అన్ని హృదయాలపై ఆధిపత్యం వహించే ప్రభువుకు పరిస్థితిని అప్పగించాలి. నిరీక్షణలో విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, హృదయపూర్వకమైన ప్రార్థనలో నిమగ్నమై, వినయంగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |