Chronicles II - 2 దినవృత్తాంతములు 11 | View All

1. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రా యేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలో నుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్ష యెనుబది వేలమందిని సమకూర్చగా

1. When Rechav'am arrived in Yerushalayim, he assembled the house of Y'hudah and Binyamin, 180,000 select soldiers, to fight Isra'el and bring the rulership back to Rechav'am.

2. దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. But this word of ADONAI came to Sh'ma'yah the man of God:

3. నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను, యూదా యందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోను ఈ మాట ప్రకటించుము

3. Speak to Rechav'am the son of Shlomo, king of Y'hudah, and to all Isra'el in Y'hudah and Binyamin; tell them

4. ఈ కార్యము నావలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక, బయలుదేరకుండను మీ సహో దరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి.

4. that this is what ADONAI says: 'You are not to go up and fight your brothers! Every man is to go back home, because this is my doing.'' They paid attention to the words of ADONAI and turned back from attacking Yarov'am.

5. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను.

5. Rechav'am lived in Yerushalayim and built cities for defense in Y'hudah-

6. he built Beit-Lechem, 'Eitam, T'koa,

7. Beit-Tzur, Sokho, 'Adulam,

8. మారేషా, జీపు, అదోర యీము,

8. Gat, Mareshah, Zif,

9. Adorayim, Lakhish, 'Azekah,

10. జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశము లందుండు ప్రాకారపురములను కట్టించి

10. Tzor'ah, Ayalon and Hevron; these are fortified cities in Y'hudah and Binyamin.

11. దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.

11. He fortified the strongholds, appointed captains in charge of them and supplied them with food, olive oil and wine.

12. మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంత మైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి.

12. In every city he put shields and spears, making them very strong. Y'hudah and Binyamin stuck with him.

13. ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీ యులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.

13. The [cohanim] and [L'vi'im] from wherever they lived throughout all Isra'el made themselves available to Rechav'am.

14. యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.

14. The [L'vi'im] left their pasture lands and property and came to Y'hudah and Yerushalayim; since Yarov'am and his sons had thrown them out, not allowing them to function as [cohanim] for ADONAI,

15. యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.

15. and had appointed for himself [cohanim] for the high places and for the images of goat-demons and calves that he had made.

16. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలుల నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.

16. Those from all the tribes of Isra'el who had set their hearts on seeking ADONAI, the God of Isra'el, followed them to Yerushalayim to sacrifice to ADONAI, the God of their fathers.

17. దావీదును సొలొమోనును నడచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడచి, యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి.

17. For three years they strengthened the kingdom of Y'hudah and made Rechav'am the son of Shlomo strong, because for three years they followed the way of life of David and Shlomo.

18. రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తె యగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెమ.

18. Rechav'am married Machalat the daughter of Yerimot the son of David and Avichayil the daughter of Eli'av the son of Yishai;

19. అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి.

19. and she became the mother of his sons Ye'ush, Sh'maryah and Zaham.

20. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయ కాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.

20. After her, he married Ma'akhah the daughter of Avshalom; she became the mother of Aviyah, 'Atai, Ziza and Shlomit.

21. రెహబాము పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమా రులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్ను లందరికంటెను అబ్షా లోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను.

21. Rechav'am loved Ma'akhah more than all his other wives and concubines- for he had eighteen wives and sixty concubines and was the father of twenty-eight sons and sixty daughters.

22. రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలచి, అతని సహోదరులమీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను.

22. Rechav'am appointed Aviyah the son of Ma'akhah chief, the leader of his brothers, because he intended to make him king.

23. అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధి పతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను.

23. He was wise in his treatment of his sons, sending all of them throughout the territory of Y'hudah and Binyamin, to every fortified city, providing them with plenty of supplies and seeking for them many wives.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

రెహబాము ఇశ్రాయేలుతో యుద్ధం చేయడాన్ని నిషేధించాడు. (1-12) 
రెహబాము ప్రజల తిరుగుబాటును కొన్ని బాగా ఎంచుకున్న పదాల ద్వారా నివారించవచ్చు; ఏది ఏమైనప్పటికీ, అతని రాజ్యం యొక్క శక్తి ఎంతైనా పరిస్థితిని తిప్పికొట్టదు. దేవుని ఉద్దేశాలు మనకు స్పష్టంగా తెలిసినప్పుడు, వాటికి వ్యతిరేకంగా పోరాడడం వ్యర్థం. నిజమైన విశ్వాసం లేని వ్యక్తులు కూడా అప్పుడప్పుడు దేవుని బోధలను పాటిస్తారు, తద్వారా వారు తప్పు చేసే వారి స్వాభావికమైన వంపులకు లొంగిపోకుండా అడ్డుకుంటారు.

యాజకులు మరియు లేవీయులు యూదాలో ఆశ్రయం పొందారు. (13-23)
యాజకులు మరియు లేవీయులు యెరూషలేముకు వచ్చిన తరువాత, భక్తి మరియు భక్తిగల ఇశ్రాయేలీయులు వారి అడుగుజాడలను అనుసరించారు. ఇశ్రాయేలీయుల దేవుడైన ప్రభువును వెదకడానికి తమను తాము కట్టుబడి ఉన్నవారు తమ పూర్వీకుల వారసత్వాన్ని ఇష్టపూర్వకంగా వదులుకున్నారు. వారు దేవుని బలిపీఠాన్ని అడ్డంకి లేకుండా పొందేందుకు యెరూషలేముకు ప్రయాణించారు, తద్వారా దూడలను ఆరాధించే ప్రలోభాలకు దూరంగా ఉన్నారు. మన సరైన ఎంపికలు మన ఆత్మల శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వాలి; అన్ని బాహ్య సుఖాల కంటే, మనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను వెంబడించాలి. దేవుని నమ్మకమైన ప్రజలు ఆయన అంకితభావంతో ఉన్న పూజారులు ఎక్కడ సేవ చేస్తారో అక్కడ సమకూడాలి. క్రీస్తు మరియు ఆయన సువార్త పట్ల మనకున్న నిబద్ధత ద్వారా ప్రాపంచిక ఆందోళనలను విడిచిపెట్టడానికి మన సుముఖతను ప్రదర్శించినప్పుడు, మన నిజమైన శిష్యత్వానికి బలమైన సాక్ష్యాలను అందిస్తాము. మతాన్ని మరియు దాని అనుచరులను రక్షించడం ఒక దేశం యొక్క స్వార్థ ప్రయోజనం.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |