Chronicles II - 2 దినవృత్తాంతములు 28 | View All

1. ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది సంవత్సర ములవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు.

1. Achas was twentye yeare olde whan he was made kynge, and reigned sixtene yeare at Ierusalem, and dyd not that which was righte in the sighte of the LORDE, as did Dauid his father,

2. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి, బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను.

2. but walked in the wayes of the kinges of Israel, and made molten ymages vnto Baalim,

3. మరియు అతడు బెన్‌ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.

3. and brent incense in the valley of the children of Hennon, and bret his awne sonnes in ye fire, after the abhominacions of the Heithen, who the LORDE expelled before the childre of Israel.

4. అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.

4. And he dyd sacrifice and brent incense vpon the hye places and vpon the hilles, and amoge all grene trees.

5. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజుచేతి కప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి. అతడును ఇశ్రాయేలు రాజుచేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను.

5. Therfore dyd the LORDE his God delyuer him in to the hande of the kynge of Syria, so that they smote him, and caryed awaye a greate multitude of his men presoners, and broughte them to Damascon. He was geuen also vnder the hande of the kynge of Israel, so yt he dyd a greate slaughter vpon him.

6. రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.

6. For Pecah the sonne of Romelia smote in Iuda an hundreth & twentye thousande in one daye (which all were valeaunt men) eue because they had forsaken ye LORDE God of their fathers.

7. పరాక్రమ శాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభాముఖ్యుడైన అజ్రీకామును ప్రధాన మంత్రియైన ఎల్కొనానును హతము చేసెను.

7. And Sichri a mightie ma of Ephraim slewe Maeseia ye kinges sonne, & Asrikam the prynce of the house, & Elkana the nexte vnto the kynge.

8. ఇదియు గాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారుల నేమి కుమార్తెల నేమి రెండు లక్షల మందిని చెరతీసికొని పోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.

8. And the children of Israel caried of their brethren presoners two hundreth thousande, wemen, sonnes and doughters, and toke a greate spoyle from them, and broughte the spoyle vnto Samaria.

9. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికిపోయి వారితో ఈలాగు చెప్పెనుఆల కించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్ప గించెను; మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి.

9. But eue there was there a prophet of ye LORDE, whose name was Obed, which wete out to mete ye hoost that came to Samaria, and sayde vnto them: Beholde, because the LORDE God of youre fathers is wroth at Iuda, therfore hath he geuen them ouer in to youre handes: but ye haue slayne them so abhominably, that it is come vnto heaue.

10. ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్థులను మీకొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరచుకొన దలచియున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా?

10. Now thinke ye to subdue the children of Iuda and Ierusalem, to be bondmen and bondmaydens vnto you. Is not this a trespace then wt you agaynst the LORDE yor God?

11. యెహోవా మహోగ్రత మీమీద రేగియున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలోనుండి మీరు చెరపట్టిన వీరిని విడచి పెట్టుడి.

11. Herken now vnto me, and sende ye presoners hence agayne, whom ye haue caried awaye from youre brethren: for the wrath of ye LORDE is fearce ouer you.

12. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా షల్లూము కుమారుడైన యెహిజ్కియా హద్లాయి కుమారుడైన అమాశా అనువారు యుద్ధమునుండి వచ్చినవారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి

12. Then gat vp certayne of the chefe of the children of Ephraim, Asarias the sonne of Iohanan, Barachias the sonne of Mesillemoth, Ezechias the sonne of Sallum, & Amasa ye sonne of Hadlai, agaynst them yt came from ye battayll,

13. యెహోవా మన మీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు జేయుటకు మీరు పూనుకొని యున్నారు; మన అపరాధము అధికమై యున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.

13. & sayde vnto them: Ye shal not brynge the presoners in hither, for youre mynde is but to make vs trespace before the LORDE, to make oure synnes and offences the greater: for the trespace is to moch allready, & the wrath is fearce ouer Israel.

14. కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.

14. So the hoost lefte the presoners & the spoyle before ye rulers and before the whole cogregacion.

15. పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహో దరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.

15. Then stode vp the men (which now were rehearced by name) and toke the presoners, and as many as were naked amonge them, clothed they with ye spoyles, & deckte them, and put shues vpon their fete, and gaue the to eate and drynke, and anoynted them, and caried them vpon asses (as many as were feble) and broughte them to Iericho to ye Palme cite vnto their brethren, and came agayne to Samaria.

16. ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా

16. At the same tyme sent kynge Achas vnto the kynges of Assur, yt they shulde helpe him.

17. రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.

17. And the Edomites came agayne, and smote Iuda, and caried some awaye captyue.

18. ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గివ్జూెనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.

18. The Philistynes also fell in to the cities in the playne, & towarde ye south parte of Iuda, & wanne Beth Semes, Aialon, Gederoth, and Socho with the vyllages therof, Timna wt the vyllages therof, & Gimso with the vyllages therof, and dwelt therin.

19. ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదావారిని హీనపరచెను.

19. For ye LORDE subdued Iuda for Achas sake ye kynge of Iuda, because he made Iuda naked, and rebelled agaynst the LORDE.

20. అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.

20. And Teglatpilnesser the kynge of Assur came agaynst him, and beseged him, & he was not mightie ynough for him.

21. ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు.

21. For Achas spoyled the house of the LORDE, and the kynges house, and of the rulers, to geue vnto ye kynge of Assur, but it helped him not.

22. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధిక ముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.

22. Morouer kinge Achas trespaced yet more against the LORDE euen in his trouble,

23. ఎట్లనగాసిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదనను కొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.

23. and dyd sacrifyce vnto the goddes of them of Damascon, which had smitten him, & sayde: The goddes of the kynges of Syria helpe them, therfore wil I offre vnto them, that they maye helpe me also, where as the same yet were a fall vnto him and to all Israel.

24. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూష లేమునందంతట బలిపీఠములను కట్టించెను.

24. And Achas gathered the vessels of ye house of God together, and brake the vessels in ye house of God, & shut the dores of the house of ye LORDE, and made him altares in all corners at Ierusalem,

25. యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

25. and euery where in the cyties of Iuda made he hye places to burne incense vnto other goddes, and prouoked ye LORDE God of his fathers vnto wrath.

26. అతడుచేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్య యంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

26. What more there is to saye of him and of all his wayes (both first and last) beholde, it is wrytten in the boke of the kynges of Iuda and Israel.

27. ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతి పెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.

27. And Achas fell on slepe with his fathers, and they buried him in ye cite of Ierusalem: for they brought him not amonge the sepulcres of the kynges of Israel. And Ezechias his sonne was kynge in his steade.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 28 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదాలో ఆహాజు దుష్ట పాలన.

దైవిక కోపానికి సాధనంగా మారిన యూదా పట్ల దైవిక అసంతృప్తి ఫలితంగా ఇజ్రాయెల్ ఈ విజయాన్ని సాధించింది. తమ అక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. పాపాత్ములు క్రూరత్వాన్ని ప్రదర్శించడం తగదు. వారు తమ తోటి జీవుల పట్ల దయ మరియు న్యాయాన్ని ప్రదర్శించడంలో విఫలమైతే దేవుని దయను పొందగలరని వారు ఊహించగలరా? క్రైస్తవ మతం యొక్క తోటి అనుచరులు కాకపోయినా, ప్రతి వ్యక్తి పొరుగువాడు, మానవత్వంలో తోబుట్టువు అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. దేవుని బోధలతో పరిచయం ఉన్న ఏ వ్యక్తి అయినా బానిసత్వం ప్రేమ సూత్రాలకు మరియు దయ యొక్క సందేశానికి విరుద్ధంగా ఉందని నొక్కి చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇతరులతో ఎలా ప్రవర్తించాలని కోరుకున్నారో అలా ప్రవర్తించాలనే సూత్రాన్ని ఉల్లంఘించకుండా ఒక సోదరుడిని ఎలా బానిసలుగా చేయవచ్చు? పాపులు తమ స్వంత హృదయాల కోరికలకు వదిలివేయబడినందున, వారి దుష్టత్వం మరింత తీవ్రమవుతుంది. దేవుడు వారి ఖైదీల విడుదలను ఆజ్ఞాపించాడు మరియు వారు కట్టుబడి ఉంటారు. యెహోవా యూదాను తగ్గించాడు. దేవుని బోధల ముందు తమను తాము తగ్గించుకోవడానికి నిరాకరించేవారు దైవిక తీర్పుల ద్వారా వినయాన్ని సరిగ్గా అనుభవిస్తారు. దుష్ట వ్యక్తులు తమతో సఖ్యతగా ఉండేవారి పట్ల నిజమైన కనికరం కలిగి ఉండరని మరియు వారి పట్ల దయతో వ్యవహరించడం పట్ల శ్రద్ధ చూపడం లేదని తరచుగా గమనించవచ్చు. విచారకరమైన రాజు ఆహాజును పరిగణించండి! ఇంత నీచమైన మనిషి! నిజంగా దుర్మార్గులు మరియు దుర్మార్గులు, వారి బాధల ద్వారా అభివృద్ధిని కనుగొనడం కంటే మరింత దిగజారేవారు. వారి బాధలు ఉన్నప్పటికీ, వారు అతిక్రమించడంలో పట్టుదలతో ఉంటారు, వారి హృదయాలు దుష్టత్వంలో మరింత పాతుకుపోతాయి. ఏది ఏమైనప్పటికీ, వారి కష్టాలకు మూలం మరియు వారి విముక్తిని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆప్యాయతలు మరియు విధేయతలు తప్పుదారి పట్టడం ఆశ్చర్యకరం. దుష్టత్వం మరియు దుఃఖంలోకి దిగడం తరచుగా వేగంగా జరుగుతుంది, మరియు ఒక పాపాత్ముడు బాధ యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి విసిరివేయబడటం గురించి ఆలోచించడం నిజంగా హుందాగా ఉంటుంది.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |