Chronicles II - 2 దినవృత్తాంతములు 35 | View All

1. మరియయోషీయా యెరూషలేమునందు యెహో వాకు పస్కాపండుగ ఆచరించెను. మొదటి నెల పదునాల్గవ దినమున జనులు పస్కాపశువును వధించిరి.

1. Josiah then celebrated a Passover to Yahweh in Jerusalem. The Passover victims were slaughtered on the fourteenth day of the first month.

2. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి, యెహోవా మందిరసేవను జరిగించుటకై వారిని ధైర్యపరచి

2. He assigned the priests to their posts, encouraging them to do their duty in the Temple of Yahweh.

3. ఇశ్రాయేలీయులకందరికి బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుపరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక, ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి, మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి.

3. Then he said to the Levites, who had understanding for all Israel and were consecrated to Yahweh, 'Put the sacred ark in the Temple built by Solomon son of David, king of Israel. You need not carry it about on your shoulders any more. Now serve Yahweh your God and Israel his people!

4. ఇశ్రాయేలీ యుల రాజైన దావీదు వ్రాసియిచ్చిన క్రమముచొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ మీ పితరుల యిండ్లకు ఏర్పాటైన వరుసలనుబట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి.

4. Prepare yourselves by families according to your orders, as laid down in the decree of David king of Israel and that of Solomon his son,

5. జనుల ఆ యా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆ యా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి, వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరులకొరకు సేవచేయుడి.

5. and take up positions in the sanctuary corresponding to the family divisions of your brothers the laity, so that there are Levites for each family division.

6. ఆప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతి ష్ఠించుకొని, మోషేద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞలను అనుసరించి, దానిని మీ సహోదరులకొరకు సిద్ధపరచుడి.

6. Slaughter the Passover, sanctify yourselves and prepare it so that your brothers can observe it in the way the word of Yahweh through Moses requires.'

7. మరియయోషీయా తన స్వంత మందలో ముప్పది వేల గొఱ్ఱెపిల్లలను మేకపిల్లలను మూడువేల కోడెలను అక్కడ నున్న జనులకందరికి పస్కాపశువులుగా ఇచ్చెను.

7. For the laity Josiah provided small livestock, that is, lambs and young goats -- everything for the Passover offerings for all who attended -- to the number of thirty thousand, as well as three thousand bullocks; these were from the king's own possessions.

8. అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయుల కును మనః పూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మంది రపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరువందల గొఱ్ఱెలను మూడువందల కోడెలను ఇచ్చిరి.

8. His officials also made voluntary contributions for the people, the priests and the Levites; and Hilkiah, Zechariah and Jehiel, the chiefs of the Temple of God, gave two thousand six hundred lambs and three hundred bullocks to the priests for the Passover offerings;

9. కొనన్యాయు, అతని సహోదరులైన షెమయాయు, నెత నేలును, లేవీయులలో నధిపతులగు హషబ్యాయు, యెహీ యేలును యోజాబాదును పస్కాపశువులుగా లేవీయులకు అయిదువేల గొఱ్ఱెలను ఐదువందల కోడెలను ఇచ్చిరి.

9. while Conaniah, Shemaiah, Nethanel his brother, Hashabiah, Jeiel and Jozabad, the head Levites, provided five thousand lambs and five hundred bullocks as Passover offerings for the Levites.

10. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి.

10. So the service was arranged, the priests stood in their places and the Levites in their orders as the king had commanded.

11. లేవీయులు పస్కాపశువులను వధించి రక్తమును యాజకుల కియ్యగా వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలువగా

11. Then they slaughtered the Passover victims and while the priests sprinkled the blood as they received it from the Levites, the latter did the skinning.

12. మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసికొనిరి.

12. Next they put the burnt offering aside for presentation to the family divisions of the laity, so that they could offer it to Yahweh in the way prescribed in the Book of Moses; they did the same with the bullocks.

13. వారు ఎడ్లనుకూడ ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధిప్రకారము పస్కాపశు మాంసమును నిప్పుమీద కాల్చిరిగాని యితరమైన ప్రతిష్ఠార్పణలను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికి త్వరగా వడ్డించిరి.

13. They roasted the Passover victim over an open fire in accordance with the regulation and boiled the consecrated offerings in pots, kettles and pans, which they then distributed to all the laity as quickly as they could.

14. తరువాత లేవీయులు తమకొరకును యాజకులకొరకును సిద్ధముచేసిరి. అహరోను సంతతివారగు యాజకులు దహనబలి పశుమాంసమును క్రొవ్వును రాత్రివరకు అర్పింపవలసివచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతివారగు యాజకులకొరకును సిద్ధపరచిరి.

14. Afterwards they provided for themselves and the priests, since the Aaronite priests were kept busy till nightfall making the burnt offerings and offering the fat; that was why the Levites prepared the Passover for themselves and for the Aaronite priests.

15. మరియఆసాపు సంతతివారగు గాయకు లును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి; ద్వారములన్నిటియొద్దను ద్వార పాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.

15. The Asaphite singers were at their places, in accordance with the command of David and Asaph, Heman and Jeduthun the king's seer; so were the gatekeepers at each gate. Because they could not leave their duties, their brothers the Levites prepared the Passover for them.

16. ఈ ప్రకారము రాజైన యోషీయా యిచ్చిన ఆజ్ఞనుబట్టి వారు పస్కాపండుగ ఆచరించి, యెహోవా బలిపీఠముమీద దహన బలులను అర్పించుటచేత ఆ దినమున ఏమియు లోపము లేకుండ యెహోవా సేవ జరిగెను.

16. So the whole service of Yahweh was arranged that day to celebrate the Passover and to bring burnt offerings on the altar of Yahweh, in accordance with King Josiah's command.

17. అక్కడ నున్న ఇశ్రాయేలీయులు, ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి.

17. On that occasion the Israelites who were present celebrated the Passover and the feast of Unleavened Bread for seven days.

18. ప్రవక్త యగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీ యులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయు లును, అక్కడ నున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూషలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కాపండు గను ఆచరించి యుండలేదు.

18. No Passover like this one had ever been celebrated in Israel since the days of the prophet Samuel, nor had any of the kings of Israel ever celebrated a Passover like the one celebrated by Josiah, the priests, the Levites, all Judah and Israel who were present, and the inhabitants of Jerusalem.

19. యోషీయా యేలుబడి యందు పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కాపండుగ జరిగెను.

19. This Passover was celebrated in the eighteenth year of Josiah's reign.

20. ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిర మును సిద్ధపరచినప్పుడు ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నదియొద్దనున్న కర్కెమీషుమీదికి దండెత్తి వెళ్లుచుండగా యోషీయా అతనిమీదికి బయలు దేరెను.

20. After all this, when Josiah had provided for the Temple, Necho king of Egypt advanced to give battle at Carchemish on the Euphrates and Josiah went to intercept him.

21. అయితే రాజైన నెకో అతనియొద్దకు రాయ బారులను పంపి - యూదారాజా నీతో నాకేమి? పూర్వమునుండి నాకు శత్రువులగువారిమీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతోకూడ ఉండి నిన్ను నశింపజేయ కుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నాజ్ఞాపించెను.

21. Necho however sent him messengers to say, 'Why be concerned about me, king of Judah? I have not come today to attack you; my quarrel is with another dynasty. God has commanded me to move quickly, so keep well clear of the god who is with me!'

22. అయినను యోషీయా అతనితో యుద్ధము చేయగోరి, అతనియొద్దనుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని, యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయ వచ్చెను.

22. But Josiah was not to be deflected from his determination to fight him, and would not listen to Necho's words, which came from the mouth of God. He gave battle in the plain of Megiddo.

23. విలుకాండ్రురాజైన యోషీయామీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి - నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్నుకొని పోవుడని చెప్పెను.

23. The archers shot King Josiah. The king then said to his retainers, 'Take me away; I am badly wounded.'

24. కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.

24. So his retainers lifted him out of his own chariot, transferred him to one which he had in reserve and brought him to Jerusalem, where he died and was buried in the tombs of his ancestors. All Judah and Jerusalem held mourning for Josiah.

25. యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.

25. Jeremiah composed a lament for Josiah and all the male and female singers to this day lament Josiah in their dirges; they have made it a rule in Israel; they are recorded in the Lamentations.

26. యోషీయా చేసిన యితర కార్యములన్నిటిని గూర్చియు, యెహోవా ధర్మ శాస్త్రవిధుల ననుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు

26. The rest of the history of Josiah, his deeds of faithful love conforming to what is prescribed in the Law of Yahweh,

27. అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

27. his history from first to last, are recorded in the Book of the Kings of Israel and Judah.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 35 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యోషీయా ఆచరించిన పస్కా. (1-19) 
యోషీయా విగ్రహారాధన నిర్మూలనకు సంబంధించిన విస్తృతమైన కథనం బుక్ ఆఫ్ కింగ్స్‌లో మరింత సమగ్రంగా నమోదు చేయబడింది. అతను పస్కాను పాటించడం ఈ కథనంలో వివరించబడింది. వివిధ యూదుల పండుగలలో, ప్రభువు భోజనం పస్కాకు అత్యంత దగ్గరి పోలికను కలిగి ఉంటుంది. ఈ మతకర్మను చిత్తశుద్ధితో మరియు సక్రమంగా పాటించడం ఒకరి లోతైన భక్తి మరియు భక్తికి నిదర్శనంగా ఉపయోగపడుతుంది. అంతిమంగా మన హృదయాలను పవిత్రం చేసేవాడు మరియు పవిత్రమైన విధుల కోసం వాటిని సిద్ధం చేసేవాడు దేవుడు అయితే, మనపై బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలను నెరవేర్చడం ద్వారా, ప్రభువు ఆశీర్వాదం మరియు మన హృదయాల పరివర్తనకు మనల్ని మనం తెరుస్తాము.

యోషీయా యుద్ధంలో చంపబడ్డాడు. (20-27)
ఫరోను వ్యతిరేకించడంలో జోషీయా చర్యలను లేఖనాలు స్పష్టంగా ఖండించలేదు. ఏది ఏమైనప్పటికీ, హెచ్చరికను స్వీకరించిన తర్వాత ప్రభువు నుండి మార్గనిర్దేశం చేయనందుకు జోషియకు కొంత బాధ్యత ఉందని వాదించవచ్చు. అతని మరణం అతని తొందరపాటు నిర్ణయం యొక్క పర్యవసానంగా చూడవచ్చు, ఇది మోసపూరిత మరియు దుర్మార్గపు ప్రజలపై తీర్పుగా కూడా పనిచేస్తుంది. పశ్చాత్తాపం, విశ్వాసం మరియు విధేయతతో జీవితాన్ని గడుపుతున్న వారు తమ నిష్క్రమణ యొక్క ఆకస్మికతను చూసి చలించరు. సంఘం అతని మరణానికి సంతాపం వ్యక్తం చేసింది, అయినప్పటికీ దేవుని జోక్యానికి దారితీసిన పాపాలను త్యజించడానికి నిరాకరిస్తూ చాలా మంది కష్టాల గురించి దుఃఖిస్తున్నారు. అటువంటి త్యజించడం ద్వారా మాత్రమే తీర్పులను నివారించవచ్చు. జోషీయా చర్యలలో మనం తప్పును కనుగొంటే, మన స్వంత వృత్తులలో కూడా అదే విధంగా అవమానించబడకుండా ఉండేందుకు మనం అప్రమత్తంగా ఉండాలి.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |