Chronicles II - 2 దినవృత్తాంతములు 6 | View All

1. అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.

1. appuḍu solomōnu eelaagu prakaṭana chesenu gaaḍhaandhakaaramandu nēnu nivaasamu cheyudunani yehōvaa selavichiyunnaaḍu.

2. నీవు నిత్యము కాపుర ముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మంది రమును నీకు కట్టించియున్నాను అని చెప్పి
అపో. కార్యములు 7:47

2. neevu nityamu kaapura muṇḍuṭakai nityanivaasasthalamugaa nēnoka ghanamaina mandi ramunu neeku kaṭṭin̄chiyunnaanu ani cheppi

3. రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.

3. raaju thana mukhamu prajalathaṭṭu trippukoni ishraayēleeyula samaajakulandarunu niluchuchuṇḍagaa vaarini deevin̄chenu.

4. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెనునా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.

4. mariyu raaju iṭlu prakaṭana chesenunaa thaṇḍriyaina daaveedunaku maaṭa yichi, thaanē svayamugaa neravērchina ishraayēleeyula dhevuḍaina yehōvaaku sthootramu kalugunugaaka.

5. ఆయన సెలవిచ్చినదేమనగానేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలు కొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై యేమనుష్యునియైనను నేను నియమింపలేదు.

5. aayana selavichinadhemanagaanēnu naa janulanu aigupthudheshamulōnuṇḍi rappin̄china dinamu modalu koni naa naamamuṇḍuṭakai yoka mandiramunu kaṭṭimpavalenani nēnu ishraayēleeyula gōtrasthaanamulalō ē paṭṭaṇamunainanu kōrukonalēdu, naa janulaina ishraayēlee yulameeda adhipathigaa nuṇḍuṭakai yēmanushyuniyainanu nēnu niyamimpalēdu.

6. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.

6. ippuḍu naa naamamuṇḍuṭakai yerooshalēmunu kōrukoṇṭini, naa janulaina ishraayēlee yulameeda adhipathigaa nuṇḍuṭakai daaveedunu kōrukoṇṭini.

7. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి యైన దావీదు మనోభిలాష గలవాడాయెను.
అపో. కార్యములు 7:45-46

7. ishraayēleeyula dhevuḍaina yehōvaa naamaghanatha koraku oka mandiramunu kaṭṭimpavalenani naa thaṇḍri yaina daaveedu manōbhilaasha galavaaḍaayenu.

8. అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగానా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదే గాని
అపో. కార్యములు 7:45-46

8. ayithē yehōvaa naa thaṇḍriyaina daaveeduthoo selavichina dhemanagaanaa naamaghanathakoraku mandiramunu kaṭṭimpavalenani neevu uddheshin̄china yuddheshamu man̄chidhe gaani

9. నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.

9. neevu aa mandiramunu kaṭṭaraadu, neeku puṭṭabōvu nee kumaaruḍē naa naamamunaku aa mandiramunu kaṭṭunu.

10. అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు మందిరమును కట్టించి
అపో. కార్యములు 7:47

10. appuḍu thaanu aṭlu cheppiyunna maaṭanu yehōvaa ippuḍu neravērchiyunnaaḍu, yehōvaa selavuprakaaramu nēnu naa thaṇḍriyaina daaveedunaku prathigaa raajunai ishraayēleeyula raajaasanamandu koorchuṇḍi ishraayēleeyula dhevu ḍaina yehōvaaku mandiramunu kaṭṭin̄chi

11. యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందస మును దానియందు ఉంచితినని చెప్పి

11. yehōvaa ishraayēleeyulathoo chesina nibandhanaku guruthaina mandasa munu daaniyandu un̄chithinani cheppi

12. ఇశ్రాయేలీయు లందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.

12. ishraayēleeyu landaru samaajamugaa kooḍi choochuchuṇḍagaa yehōvaa balipeeṭhamu eduṭa nilichi thana chethulu chaapi praarthana chesenu.

13. తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయు లందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.

13. thaanu cheyin̄china ayidu moorala poḍavunu ayidu moorala veḍalpunu mooḍu moorala yetthunugala yitthaḍi chapparamunu muṅgiṭi aavaraṇamunandun̄chi, daanimeeda nilichiyuṇḍi, samaajamugaa kooḍiyunna ishraayēleeyu landari yeduṭanu mōkaaḷlooni, chethulu aakaashamuvaipu chaapi solomōnu iṭlani praarthanachesenu.

14. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు.

14. yehōvaa ishraayēleeyula dhevaa, hrudayapoorvakamugaa ninnu anusarin̄chu nee bhakthulaku nibandhananu neravērchuchu krupanu choopuchu nuṇḍu neevaṇṭi dhevuḍu aakaashamandainanu bhoomi yandainanu lēḍu.

15. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు.

15. nee sēvakuḍaina daaveedu anu naa thaṇḍrithoo neevu selavichinamaaṭa neravērchiyunnaavu; neevu vaagdaanamuchesi yee dinamuna kanabaḍuchunnaṭṭugaa daanini neravērchiyunnaavu.

16. నీవు నాముందర నడచి నట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీ యుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము.

16. neevu naamundhara naḍachi naṭlugaa nee kumaarulunu thama pravarthana kaapaaḍukoni, naa dharmashaastramuchoppuna naḍachinayeḍala ishraayēlee yula sinhaasanamumeeda koorchuṇḍuvaaḍu naa yeduṭa neekuṇḍakapōḍani neevu nee sēvakuḍaina daaveedu anu naa thaṇḍrithoo selavichinamaaṭa, ishraayēleeyula dhevaa yehōvaa, dayachesi neravērchumu.

17. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక.

17. ishraayēleeyula dhevaa yehōvaa, neevu nee sēvakuḍaina daaveeduthoo selavichina maaṭa ippuḍu sthiramavunu gaaka.

18. మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశ మును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?
అపో. కార్యములు 17:24, ప్రకటన గ్రంథం 21:3

18. manushyulathoo kalisi dhevuḍu bhoomiyandu nivaasamu cheyunaa? aakaasha munu mahaakaashamunu ninnu paṭṭachaalavē; nēnu kaṭṭina yee mandiramu ninnu paṭṭunaa?

19. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.

19. dhevaa yehōvaa, nee sēvakuḍu nee sannidhini cheyu praarthanayandunu vinna pamunandunu lakshyamun̄chi, nee sēvakuḍanaina nēnu cheyu praarthananu peṭṭu morranu aalakin̄chumu.

20. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక.

20. nee sēvakulu ee sthalamu thaṭṭu thirigi cheyu vinnapamulanu vinuṭakainaa naamamunu acchaṭa un̄chedhanani neevu selavichina sthalamunanunna yee mandiramumeeda nee kanudrushṭi raatriṁ bagaḷlu niluchunugaaka.

21. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రా యేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.

21. nee sēvakuḍunu nee janulaina ishraayēleeyulunu ee sthalamuthaṭṭu thirigi cheyabōvu praarthanalanu neevu aalakin̄chumu, aakaashamunanunna nee nivaasasthalamandu aalakin̄chumu, aalakin̄chunappuḍu kshamin̄chumu.

22. ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు

22. evaḍainanu thana poruguvaaniyeḍala thappuchesinappuḍu athani chetha pramaaṇamu cheyin̄chuṭakai athanimeeda oṭṭu peṭṭabaḍi aa oṭṭu ee mandiramanduṇḍu nee balipeeṭhamu eduṭiki vachinappuḍu

23. నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.

23. neevu aakaashamandu vini, nee daasulaku nyaayamutheerchi, haani chesinavaani thalameediki shiksha rappin̄chi, neethiparuni neethichoppuna vaanikichi vaani neethini nirdhaaraṇa cheyumu.

24. నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టియెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు,వారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పు కొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల

24. neejanulaina ishraayēleeyulu nee drushṭiyeduṭa paapamu chesinavaarai thama shatruvula balamunaku niluvalēka paḍipōyinappuḍu,vaaru neeyoddhaku thirigi vachi nee naamamunu oppu koni, yee mandiramunandu nee sannidhini praarthin̄chi vinnapamu chesinayeḍala

25. ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక.

25. aakaashamandu neevu vini, nee janulaina ishraayēleeyulu chesina paapamunu kshamin̄chi, vaarikini vaari pitharulakunu neevichina dheshamunaku vaarini marala rappin̄chuduvugaaka.

26. వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచి పెట్టి తిరిగినయెడల

26. vaaru nee drushṭiyeduṭa paapamu chesinanduna aakaashamu mooyabaḍi vaana kuriya kunnappuḍu, vaaru ee sthalamuthaṭṭu thirigi praarthanachesi nee naamamunu oppukoni, neevu vaarini shramapeṭṭinappuḍu vaaru thama paapamulanu viḍichi peṭṭi thiriginayeḍala

27. ఆకాశ మందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి,నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయ చేయుదువుగాక.

27. aakaasha mandunna neevu aalakin̄chi, nee sēvakulunu nee janulunagu ishraayēleeyulu chesina paapamunu kshamin̄chi, vaaru naḍuvavalasina man̄chimaargamu vaariki bōdhin̄chi,neevu nee janulaku svaasthyamugaa ichina nee dheshamunaku vaana daya cheyuduvugaaka.

28. దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను

28. dheshamunandu karavugaani tegulugaani kanabaḍinappuḍainanu, gaaḍpu debbagaani chitthapaṭṭuṭagaani thagilinappuḍainanu, miḍathalugaani chiḍapurugulugaani daṇḍu diginappuḍainanu, vaari shatruvulu vaari dheshapu paṭṭaṇamulalō vaarini muṭṭaḍi vēsinappuḍainanu, ē baadhagaani yē rōgamugaani vachinappuḍainanu

29. ఎవడైనను ఇశ్రా యేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి

29. evaḍainanu ishraayēleeyulagu nee janulandaru kalisiyainanu, noppigaani kashṭamugaani anubhavin̄chuchu, ee mandiramuthaṭṭu chethulu chaapi cheyu vinnapamulanniyu praarthanalanniyu nee nivaasasthalamaina aakaashamunuṇḍi neevu aalakin̄chi kshamin̄chi

30. నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులు కలిగి

30. neevu maa pitharulakichina dheshamandu vaaru thama jeevithakaala manthayu neeyandu bhayabhakthulu kaligi

31. నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయ చేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.

31. nee maargamulalō naḍuchunaṭlugaa vaari vaari hrudayamulanu erigiyunna neevu vaari sakala pravarthanaku thaginaṭlu prathiphalamunu daya cheyuduvu gaaka. neevu okkaḍavē maanavula hrudayamu nerigina vaaḍavu gadaa.

32. మరియు నీ జనులైన ఇశ్రా యేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, చాచిన చేతులను గూర్చియు వినినవారై, దూరదేశమునుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినపుడు

32. mariyu nee janulaina ishraayēleeyula sambandhulu kaani anyulu nee ghanamaina naamamunu goorchiyu, nee baahubalamunu goorchiyu, chaachina chethulanu goorchiyu vininavaarai, dooradheshamunuṇḍi vachi ee mandiramuthaṭṭu thirigi vinnapamu chesinapuḍu

33. నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందుభయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.

33. nee nivaasasthalamagu aakaashamunuṇḍi neevu vaari praarthana naṅgeekarin̄chi, nee janulagu ishraayēleeyulu telisikoninaṭlu bhoojanulandarunu nee naamamunu telisikoni, neeyandubhayabhakthulu kaligi, nēnu kaṭṭina yee mandiramunaku nee pēru peṭṭabaḍenani grahin̄chunaṭlugaa aa yanyulu neeku morrapeṭṭina daanini neevu dayacheyuduvu gaaka.

34. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరుకొనిన యీ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసిన యెడల

34. nee janulu neevu pampina maargamandu thama shatruvulathoo yuddhamu cheyuṭakai bayaludhera nuddheshin̄chi, neevu kōrukonina yee paṭṭaṇamu thaṭṭunu nee naamamunaku nēnu kaṭṭin̄china yee mandiramuthaṭṭu thirigi vinnapamu chesina yeḍala

35. ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక.

35. aakaashamunuṇḍi neevu vaari vinnapamunu praarthananu aalakin̄chi vaari kaaryamunu nirvahin̄chuduvugaaka.

36. పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొనిపోగా

36. paapamu cheyanivaaḍevaḍunu lēḍu ganuka vaaru nee drushṭi yeduṭa paapamu chesinappuḍu neevu vaarimeeda aagra hin̄chi, shatruvula chethiki vaarini appagimpagaa, cherapaṭṭu vaaru vaarini dooramainaṭṭi gaani sameepamainaṭṭi gaani thama dheshamulaku paṭṭukonipōgaa

37. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పు కొనిమేము పాపముచేసితివిు, దోషులమైతివిు, భక్తిహీనముగా నడచితివిు అని ఒప్పుకొని

37. vaaru cherakupōyina dheshamandu buddhi techukoni manassu trippu konimēmu paapamuchesithivi, dōshulamaithivi, bhakthiheenamugaa naḍachithivi ani oppukoni

38. తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని,తమ పితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల

38. thaamu cheralōnunna dheshamandu poorṇahrudayamuthoonu poorṇaatmathoonu neeyoddhaku maḷlukoni,thama pitharulaku neevichina thama dheshamumeedikini, neevu kōrukonina yee paṭṭaṇamumeedikini, nee naamaghanathakoraku nēnu kaṭṭin̄china yee mandiramumeedikini manassu trippi vinnapamu chesinayeḍala

39. నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక.

39. nee nivaasasthalamaina aakaashamu nuṇḍi neevu vaari vinnapamunu praarthananu aalakin̄chi vaari kaaryamunu nirvahin̄chi, nee drushṭiyeduṭa paapamuchesina nee janulanu kshamin̄chuduvugaaka.

40. నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.

40. naa dhevaa, yee sthalamandu cheyabaḍu vinnapamu meeda nee kanudrushṭi yun̄chu duvugaaka, nee chevulu daanini aalakin̄chunugaaka.

41. నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.

41. naa dhevaa, yehōvaa, balamuna kaadhaaramagu nee mandasamunu drushṭin̄chi lemmu; nee vishraanthi sthalamandu pravēshin̄chumu; dhevaa yehōvaa, nee yaajakulu rakshaṇa dharin̄chu kondurugaaka; nee bhakthulu nee mēlunubaṭṭi santhooshinthuru gaaka.

42. దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము,నీవు నీ భక్తు డైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.

42. dhevaa yehōvaa, neevu neechetha abhishēkamu nondina vaaniki paraajmukhuḍavai yuṇḍakumu,neevu nee bhakthu ḍaina daaveedunaku vaagdaanamuchesina krupalanu gnaapakamu chesikonumu.Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |