Ezra - ఎజ్రా 2 | View All

1. బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి

1. వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమతమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు.

2. యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.

2. జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది:

3. పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,

3. పరోషు వంశస్థులు2,172

4. షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,

4. షెపట్యా వంశస్థులు372

5. ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,

5. అరహు వంశస్థులు775

6. పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,

6. యెషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు2,812

7. ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

7. ఏలాము వంశస్థులు1,254

8. జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు,

8. జత్తూ వంశస్థులు945

9. జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,

9. జక్కయి వంశస్థులు760

10. బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు,

10. బానీ వంశస్థులు642

11. బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,

11. బేబై వంశస్థులు623

12. అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,

12. అజ్గాదు వంశస్థులు1,222

13. అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,

13. అదొనీము వంశస్థలు666

14. బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు;

14. బిగ్వయి వంశస్థులు2,056

15. ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,

15. అదీను వంశస్థులు454

16. అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు,

16. అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం)98

17. బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,

17. బెజయి వంశస్థలు323

18. యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,

18. యోరా వంశస్థలు112

19. హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,

19. హాషుము వంశస్థులు223

20. గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,

20. గిబ్బారు వంశస్థులు95

21. బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

21. బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు123

22. నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,

22. నెటోపా పట్టణం వాళ్లు56

23. అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,

23. అనాతోతు పట్టణంవాళ్లు128

24. అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు,

24. అజ్మావెతు పట్టణంవాళ్లు42

25. కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,

25. కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు పట్టణాల వాళ్లు743

26. రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు,

26. రమా, గెబా పట్టణాలవాళ్లు621

27. మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

27. మిక్మషు పట్టణం వాళ్లు123

28. బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,

28. బేతేలు, హాయి పట్టణంవాళ్లు222

29. నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,

29. నెబో పట్టణంవాళ్లు52

30. మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు,

30. మగ్బీషు పట్టణంవాళ్లు156

31. ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,

31. ఏలాము అనే మరో పట్టణంవాళ్లు1,254

32. హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,

32. హారీము పట్టణంవాళ్లు320

33. లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు,

33. లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు725

34. యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,

34. యెరికో పట్టణంవాళ్లు345

35. సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది,

35. సెనాయా పట్టణంవాళ్లు3,630

36. యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు

36. యాజకులు: యెషూవ కుటుంబానికి చెందిన యెదాయ వంశస్థులు973

37. ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,

37. ఇమ్మేరు వంశస్థులు1,052

38. పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,

38. పషూరు వంశస్థులు1,247

39. హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు,

39. హారీము వంశస్థులు1,017

40. లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,

40. ఇప్పుడిక లేవీయులలో హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు74

41. గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,

41. గాయకుల జాబితా: అసాపు వంశస్థులు128

42. ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,

42. దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు షల్లూము, ఆటేరు, టల్నోను, అక్కూబు, హటీటా, షోబయి వంశస్థులు139

43. నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,

43. దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు జీహా, హశూపా, టబ్బాయోతు,

44. కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు,

44. కేరోసు, సీయహా, పాదోను,

45. లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,

45. లెబానా, హగాబా, అక్కూబు,

46. హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు,

46. హాగాబు, షల్మయి, హానాను,

47. గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,

47. గిద్దేలు, గహరు, రెవాయా,

48. రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,

48. రెజీను, నెకోదా, గజ్జాము,

49. ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,

49. ఉజ్జా, పాసెయ, బేసాయి,

50. అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,

50. అస్నా, మెహూనీము, నెపూసీము,

51. బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,

51. బక్బూకు, హకూపా, హర్హూరు

52. బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,

52. బజ్లీతు, మెహీదా, హర్షా

53. బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు,

53. బర్కోసు, సీసెరా, తెమహు

54. నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,

54. నెజీయాహు, హటీపా,

55. సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,

55. సొలొమోను సేవకుల వంశస్థులు: సొటయి, సోపెరెతు, పెరూదా,

56. యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,

56. యహలా, దర్కోను, గిద్దేలు,

57. షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,

57. షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి

58. నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.

58. దేవాలయసేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తుం392

59. మరియతేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.

59. తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే,

60. వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.

60. దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం652

61. మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు.

61. యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.)

62. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి.

62. వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులగా సేవ చేయలేకపోయారు.

63. మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.

63. వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు.

64. సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.

64.

65. వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.

65.

66. వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,

66.

67. వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.

67.

68. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.

68. ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు సమకట్టారు.

69. పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.

69. వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగార ం, 3టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు.

70. యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.

70. ఈ విధంగా యాజకులు, లేవీ గొత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమతమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezra - ఎజ్రా 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

తిరిగి వచ్చిన సంఖ్యలు. (1-35) 
బందిఖానా నుండి బయటపడిన కుటుంబాల కోసం రికార్డులు నిర్వహించబడ్డాయి. పాపం ఒక దేశాన్ని ఎలా దిగజార్చుతుందో గమనించండి, అయితే ధర్మానికి దానిని ఉద్ధరించే శక్తి ఉంది!

యాజకులు మరియు లేవీయుల సంఖ్య. (36-63) 
విమర్శలు, కష్టాలు లేదా కష్టాల సమయంలో దైవంతో తమకున్న అనుబంధం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమైన వ్యక్తులు, అది గౌరవం లేదా లాభంగా మారినప్పుడు దాని ప్రతిఫలాన్ని పొందలేరు. పునర్జన్మ ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆధ్యాత్మిక పూజారులుగా తమ స్థితిని ధృవీకరించలేని వారు క్రైస్తవులకు కల్పించే సాంత్వనలు మరియు ప్రయోజనాలకు అర్హత కలిగి ఉండరు.

ఆలయానికి నైవేద్యాలు. (64-70)
తమ విశ్వాసానికి అవసరమైన ఖర్చుల గురించి ఎవరూ గొణుగుకోవద్దు. దేవుని రాజ్యాన్ని, ఆయన అనుగ్రహాన్ని మరియు ఆయన మహిమను వెతకడానికి ప్రాధాన్యత ఇవ్వండి, ఆపై మిగతావన్నీ అనుసరించబడతాయి. వారి సమర్పణలు డేవిడ్ కాలంలోని నాయకుల ఉదారమైన విరాళాలకు అనుగుణంగా ఉండకపోయినప్పటికీ, ఒకరి సామర్థ్యం ప్రకారం ఇచ్చినప్పుడు అవి దేవునికి నచ్చుతాయి. ఆయనను మహిమపరచాలనే ఉద్దేశ్యంతో మరియు ఆయన సహాయంపై ఆధారపడుతూ ఆయన చిత్తానికి అనుగుణంగా చేపట్టే అన్ని ప్రయత్నాలలో ప్రభువు మనకు మద్దతు ఇస్తాడు.
పాపాన్ని విడిచిపెట్టి, ప్రభువు వద్దకు తిరిగి వెళ్లడం ద్వారా సువార్త పిలుపులకు ప్రతిస్పందించే వారు కవచం చేయబడతారు మరియు ప్రయాణం యొక్క అన్ని ప్రమాదాల ద్వారా నడిపించబడతారు, చివరికి దేవుని పవిత్ర నగరంలో సిద్ధం చేయబడిన సురక్షితమైన నివాసాలకు చేరుకుంటారు.



Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |