Ezra - ఎజ్రా 3 | View All

1. ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణము లకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి,

1. And thanne the seuenthe monethe was comun, and the sones of Israel weren in her citees.

2. యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పిం చుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.
మత్తయి 1:12, లూకా 3:27

2. Therfor the puple was gaderid as o man in to Jerusalem. And Josue, the sone of Josedech, roos, and hise britheren, prestis, and Zorobabel, the sone of Salatiel, and hise britheren, and thei bildiden the auter of God of Israel for to offre therynne brent sacrifices, as it is writun in the lawe of Moises, the man of God.

3. వారు దేశమందు కాపురస్థులైనవారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి

3. Forsothe thei settiden the auter on his foundementis, while the puplis of londis bi cumpas maden hem aferd, and thei offriden on that auter brent sacrifice to the Lord in the morewtid and euentid.

4. మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, ఏ దినమునకు నియ మింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.

4. And thei maden solempnytee of tabernaclis, as it is writun, and brent sacrifice ech dai bi ordre, `bi the werk of the dai comaundid in his dai.

5. తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవాయొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.

5. And after this thei offriden contynuel brent sacrifice, bothe in calendis and in alle solempnytees of the Lord, that weren halewid, and in alle solempnytees, in which yifte was offrid to the Lord bi fre wille.

6. ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.

6. In the firste dai of the seuenthe monethe thei bigunnen to offre brent sacrifice to the Lord; certis the temple of God was not foundid yit.

7. మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోనునుండి సముద్రముమీద యొప్పేపట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి.

7. But thei yauen monei to heweris of stoon, and to liggeris of stoon, and thei yauen mete, and drynke, and oile, to men of Sidon, and `to men of Tire, that thei schulden brynge cedre trees fro the Liban to the see of Joppe, bi that that Cirus, kyng of Persis, hadde comaundid to hem.

8. యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారు డైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూష లేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.

8. Forsothe in the secounde yeer of her comyng to the temple of God in Jerusalem, in the secounde monethe, Zorobabel, the sone of Salatiel, and Josue,

9. యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయు లైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.

9. the sone of Josedech, and othere of her britheren, preestis and dekenes, and alle that camen fro the caitifte in to Jerusalem, bigunnen; and thei ordeyneden dekenes, fro twenti yeer and aboue, for to haste the werk of the Lord; and Josue stood, and hise sones, and hise britheren, Cedynyel and hise sones, and the sones of Juda, as o man, to be bisi ouer hem that maden the werk in the temple of God; the sones of Benadab, her sones and her britheren, dekenes, `weren bisy.

10. శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి

10. Therfor whanne the temple `of the Lord was foundid of stoon leggeris, prestis stoden in her ournement with trumpis, and dekenes, the sones of Asaph, in cymbalis, for to herie God bi the hond of Dauid, kyng of Israel.

11. వీరు వంతు చొప్పున కూడియెహోవా దయాళుడు, ఇశ్రాయేలీ యుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియయెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులంద రును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.

11. And thei sungen togidere in ympnes and knoulechyng to the Lord, For he is good, for his merci is with outen ende on Israel. And al the puple criede with greet cry, in preisynge the Lord, for the temple of the Lord was foundid.

12. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయుల లోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి.

12. Also ful manye of the preestis, and of the dekenes, and the princes of fadris, and the eldre men, that hadden seyn the formere temple, whanne it was foundid, and this temple bifor her iyen, wepten with greet vois, and many men criynge in gladnesse reisiden the vois;

13. ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.

13. and no man myyte knowe the vois of cry of men beynge glad, and the vois of wepyng of the puple; for the puple criede togidere with greet cry, and the vois was herd afer.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezra - ఎజ్రా 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

బలిపీఠం మరియు పండుగలు. (1-7) 
యూదుల రాకతో వారి అనుభవాల నుండి మనం పాఠం నేర్చుకుందాం. మనం కోరుకున్నవన్నీ సాధించకుండా పరిస్థితులు అడ్డుకున్నప్పటికీ, దేవునిపై దృష్టి పెట్టి మన ప్రయత్నాలను ప్రారంభించడం మరియు ఆరాధనలో పాల్గొనడం యొక్క ప్రాముఖ్యతను ఇది మనకు బోధిస్తుంది. వారు వెంటనే ఆలయాన్ని స్థాపించలేకపోయినప్పటికీ, వారు బలిపీఠాన్ని కలిగి ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ప్రమాదం యొక్క ఉనికి మన బాధ్యతలను నెరవేర్చడానికి మనల్ని ప్రేరేపించాలి. మనం అనేకమంది విరోధులను ఎదుర్కొంటామా? అప్పుడు, మన మిత్రుడైన దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోవడం అమూల్యమైనది మరియు అతనితో మన సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ప్రార్థనలో సాంత్వన పొందేందుకు మన భయాలు మనకు మార్గనిర్దేశం చేయాలి.
ఆర్థికంగా వెనుకబడిన సంఘం అయినప్పటికీ, వివిధ ఆచారాలు మరియు వేడుకల కోసం చేసిన ఖర్చులు గణనీయంగా ఉన్నాయి. అయినప్పటికీ, నిర్దేశించిన అర్పణలతో పాటు, చాలా మంది వ్యక్తులు ఉదారంగా ప్రభువుకు స్వచ్ఛంద కానుకలను అందించారు. వారు వెంటనే ఆలయ నిర్మాణం కోసం తమను తాము ఏర్పాటు చేసుకున్నారు, చర్య తీసుకోవడానికి సంసిద్ధతను ప్రదర్శిస్తారు. దేవుడు మనల్ని ఒక పనికి పిలిచినప్పుడల్లా, అవసరమైన వనరులను అందించడానికి మనం అతని ప్రొవిడెన్స్‌పై ఆధారపడవచ్చు.

ఆలయ పునాదులు వేయబడ్డాయి. (8-13)
ఆలయ శంకుస్థాపన సమయంలో భావోద్వేగాల అద్భుతమైన సమ్మేళనం స్పష్టంగా కనిపించింది. దేవాలయం లేని కష్టాలను అనుభవించిన వారు ఆనందోత్సాహాలతో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి, ఈ పునాది అడుగు కూడా అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. కనికరం యొక్క ప్రారంభ వ్యక్తీకరణలు వాటి పూర్తి ఫలాన్ని ఇంకా చేరుకోనప్పటికీ మనం వాటి పట్ల కృతజ్ఞతను పెంపొందించుకోవాలి. మరోవైపు, అసలు ఆలయ వైభవాన్ని గుర్తుచేసుకున్న వారు మరియు కొత్తది యొక్క సంభావ్య న్యూనతను గుర్తించిన వారు తీవ్రమైన రోదనలతో కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి దుఃఖం సమర్థించబడింది మరియు ఈ గంభీరమైన మార్పుకు దారితీసిన పాపాల గురించి వారు విలపిస్తే, వారి ప్రతిస్పందన తగినది. అయితే, సామూహిక ఆనందాన్ని తగ్గించడానికి ఇది తప్పుదారి పట్టించింది. నిరాడంబరమైన ప్రారంభాలను తక్కువగా అంచనా వేయడం ద్వారా, వారు అనుభవిస్తున్న మంచితనాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. గత బాధల జ్ఞాపకం ప్రస్తుత ఆశీర్వాదాల అవగాహనను కప్పివేయకూడదు.



Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |