Ezra - ఎజ్రా 5 | View All

1. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ మున ప్రకటింపగా

1. The prophetes, Aggeus and Zachary ye sonne of Iddo, prophecied vnto ye Iewes that were in Iuda and Ierusale, in the name of the God of Israel.

2. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేము లోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.

2. Then gat vp Zorobabel the sonne of Salathiel, and Iesua the sonne of Iosedec, and beganne to buylde the house of God at Ierusalem, and with them the prophetes of God which strengthed the.

3. అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్న వారును యూదులయొద్దకు వచ్చిఈ మందిర మును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా

3. At the same tyme came to the Thathnai the debite on this syde the water, and Sethar of Bosen, and their councelers, and sayde thus vnto them: Who hath commaunded you to buylde this house, and to make vp the walles therof?

4. ఈ కట్టడమును చేయిం చినవారి పేరులు మొదలౖౖెన సంగతులను మేము వారితో చెప్పితివిు.

4. Then tolde we them the names of the men, that made this buyldinge.

5. యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టియుంచినందున ఆ సంతినిగూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు.

5. But the eye of their God came vpon the Elders of the Iewes, that they were not inhibyte, tyll the matter was brought before Darius, and tyll there came a wrytinge therof agayne.

6. నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బో జ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరమునకలు

6. This is the summe of the letter yt Thathnai the Debyte on this syde the water, and Sethar of Bosen, and their councellers of Apharsach (which were on this syde the water) sent vnto kynge Darius.

7. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక.

7. And these are the wordes that they sent vnto him: Vnto Darius the kynge, all peace.

8. రాజవైన తమకు తెలియవలసిన దేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితివిు, అక్కడ మహాదేవునియొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.

8. Be it knowne vnto the kynge, that we came in to Iewry to the house of ye greate God, which is buylded with all maner of stone, and balckes are layed in the walles, and ye worke goeth fast forth, and prospereth in their handes.

9. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితివిు.

9. Neuertheles we axed the Elders and sayde vnto them: Who hath comaunded you to buylde this house, and to make vp the walles therof?

10. వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా

10. We axed their names also, that we might certifye the, and haue wrytten the names of the men that were their rulers.

11. వారు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చిరిమేము భూమ్యాకాశముల దేవునియొక్క సేవ కులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.

11. But they answered vs wt these wordes, and sayde: We are the seruautes of the God of heauen and earth, and buylde the house yt was buylded many yeares agoo, which a greate kynge of Israel buylded and set vp.

12. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయు డైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.

12. Howbeit whan oure fathers prouoked the God of heauen vnto wrath, he gaue them ouer in the hande of Nabuchodonosor the kynge of Babilon the Caldee, which brake downe this house, & caried ye people awaye vnto Babilon.

13. అయితే బబులోనురాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సర మందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.

13. Neuertheles in the first yeare of Cyrus the kynge of Babilon, ye same kynge Cyrus commaunded to buylde this house of God:

14. మరియనెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములోనుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములోనుండి తెప్పించి

14. for the vessels of golde and siluer in the house of God, which Nabuchodonosor toke out of the temple at Ierusale, and broughte the in to ye temple at Babilon, those dyd Cyrus the kynge take out of ye temple at Babilon, and delyuered them vnto Se?bazer by name, whom he made Debyte,

15. తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను నతనికి అప్పగించినీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణ మందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

15. and sayde vnto him: Take these vessels, go thy waye and brynge them vnto the temple at Ierusalem, and let the house of God be buylded in his place.

16. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోనుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.

16. Then came the same Se?bazar, and layed ye foundacion of the house of God at Ierusalem. Sence that tyme hath it bene in buyldinge, and yet is it not fynished.

17. కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుయొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయముచేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయ గోరుచున్నాము.

17. Yf it please ye kynge now, let there be search made in ye kynges treasure house which is at Babilon, whether it haue bene kynge Cyrus commaundement, that the house of God at Ierusalem shulde be buylded: & sende vs ye kynges mynde concernynge the same.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezra - ఎజ్రా 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నాయకులు ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. (1,2) 
దాదాపు పదిహేనేళ్ల పాటు ఆలయ నిర్మాణం ఆగిపోయింది. ఏది ఏమైనప్పటికీ, ఇద్దరు సమర్థులైన మంత్రులు నాయకత్వ బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఆలయంలో వారి పనిని తిరిగి ప్రారంభించమని ప్రజలను ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం ద్వారా పరిస్థితి మారిపోయింది. ఈ సంఘటన దైవిక దయను సూచిస్తుంది, ప్రజలకు వారి ఆధ్యాత్మిక ప్రయత్నాలలో సహాయపడే మరియు మార్గనిర్దేశం చేసే ప్రవక్తల ఆవిర్భావం, వారి చర్యలను పర్యవేక్షించడం మరియు పరిపాలించడం ద్వారా రుజువు చేస్తుంది. హగ్గాయి పుస్తకం, దేవుని వాక్యం యొక్క ప్రగాఢమైన ప్రభావాన్ని, ఆయన పేరు కంటే కూడా ఉన్నతమైనది మరియు విశేషమైన విజయాలను తీసుకురావడంలో అతని ఆత్మ యొక్క సమ్మేళనాన్ని ఉదహరిస్తుంది.

యూదులకు వ్యతిరేకంగా లేఖ. (3-17)
దైవిక కార్యాలలో నిమగ్నమై, దేవుని యొక్క అసాధారణమైన సంరక్షకత్వంలో మనం ఆవరించి ఉంటాము, ఎందుకంటే ఆయన దయతో కూడిన చూపు మనపై స్థిరంగా ఉంటుంది. ఈ అవగాహన నిరుత్సాహపరిచే సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, మన బాధ్యతలకు కట్టుబడి, ఒక ఉద్ధరించే శక్తిగా ఉపయోగపడుతుంది. యూదు సమాజంలోని పెద్దలు తమ చర్యలను సమరయులకు తెలియజేసారు, మన నమ్మకాలను వినయం మరియు భక్తితో పంచుకోవడంలోని విలువను వివరిస్తారు. దేవుని సేవలో మన చర్యల వెనుక గల కారణాలను మనం గ్రహించి, వెంటనే స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం.
మన భూసంబంధమైన ప్రయాణంలో, మన అతిక్రమణలు దేవుని అసంతృప్తిని రేకెత్తించాయని మేము నిరంతరం అంగీకరిస్తాము. మన పరీక్షలు ఈ మూలం నుండి ఉద్భవించాయి, అయితే మన ఓదార్పు అతని అనంతమైన కరుణ నుండి ఉద్భవించింది. ఎలాంటి ఆటంకాలు కనిపించినప్పటికీ, ప్రభువైన యేసుక్రీస్తు తన లక్ష్యాన్ని స్థిరంగా ముందుకు తీసుకువెళతాడు. అతని అనుచరులు ప్రభువులో పవిత్ర నివాసంగా, ఆత్మ ద్వారా దేవుని నివాసం కోసం ఒక పాత్రగా మార్చబడ్డారు.



Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |