Ezra - ఎజ్రా 9 | View All

1. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చిఇశ్రాయేలీయులును యాజకులును లేవీయు లును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూ సీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు,
యోహాను 4:9

1. Once this was done, the officials approached me to say, 'The people of Israel, the priests and the Levites, have not renounced the disgusting practices of the people of the country -- the Canaanites, the Hittites, the Perizzites, the Jebusites, the Moabites, the Egyptians and the Amorites-

2. వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి.

2. since they and their sons have married some of their women, as a result of which the holy race has been contaminated by the people of the country. The officials and leaders have been the worst offenders in this act of infidelity.'

3. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.
మత్తయి 26:65

3. On hearing this, I tore my clothes and my cloak; I pulled hair from my head and beard and sat down in horror.

4. చెరపట్ట బడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని.

4. All who trembled at the words of the God of Israel gathered round me, when faced with the infidelity of the exiles, while I went on sitting there in horror until the evening sacrifice.

5. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టు చేతులెతి ్త

5. At the evening sacrifice I came out of my stupor and, falling on my knees in my torn clothes and cloak, stretched out my hands to Yahweh my God,

6. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.
లూకా 21:24

6. and said: 'My God, I am ashamed, I blush to lift my face to you, my God. For our iniquities have increased, until they are higher than our heads, and our guilt has risen as high as heaven.

7. మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజు లును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమున కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతివిు.

7. From the days of our ancestors until now we have been deeply guilty and, because of our iniquities, we, our kings and our priests, have been handed over to the kings of other countries, to the sword, to captivity, to pillage, to shame, as is the case today.

8. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు.

8. And now, for a brief moment, the favour of Yahweh our God has allowed a remnant of us to escape and given us a stable home in his holy place, so that our God can raise our spirits and revive us a little in our slavery.

9. నిజముగా మేము దాసులమైతివిు; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుట కును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి.

9. For we are slaves; but God has not forgotten us in our slavery; he has extended his faithful love to us even under the kings of Persia and revived us to rebuild the Temple of our God, restore its ruins and provide us with a refuge in Judah and in Jerusalem.

10. మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతివిు గదా.

10. But now, our God, what can we say after this? For we have abandoned your commandments,

11. వారుమీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రతచేతను వారు చేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను.

11. which you gave through your servants the prophets in these terms, 'The country which you are about to possess is a polluted country, polluted by the people of the country and their disgusting practices, which have filled it with their filth from end to end.

12. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుల కియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారులకొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినయెడల, మీరు బలముగానుండి, ఆ దేశముయొక్క సుఖమును అనుభవించి, మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి.

12. Hence you are not to give your daughters in marriage to their sons, or let their daughters marry your sons, or ever concern yourselves about peace or good relations with them, if you want to grow stronger, to live off the fat of the land and bequeath it to your sons for ever.'

13. అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి

13. 'After all that has befallen us because of our evil deeds and our deep guilt -- though you, our God, have punished us less than our iniquities deserved and have allowed us to escape like this-

14. ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనిన యెడల, మేము నాశనమగువరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండు నట్లును, నీవు కోపపడుదువు గదా.

14. are we to break your commandments again and intermarry with people with these disgusting practices? Would you not be enraged with us to the point of destroying us, leaving neither remnant nor survivor?

15. యెహోవా ఇశ్రా యేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.

15. Yahweh, God of Israel, you are upright. We survive only as the remnant we are today. We come before you in our guilt; because of it we cannot stand in your presence.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezra - ఎజ్రా 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదుల ప్రవర్తనకు ఎజ్రా దుఃఖించాడు. (1-4) 
చాలా అప్రమత్తంగా ఉన్న నాయకులకు కూడా అనేక అవినీతి దాగి ఉంది. కొంతమంది వ్యక్తులు ద్వితీయోపదేశకాండము 7లోని దేవుని ప్రత్యక్ష ఆజ్ఞను విస్మరించారు, ఇది అన్యమత విశ్వాసాలతో వివాహాలను స్పష్టంగా నిషేధించింది. దేవుని అపరిమితమైన సమృద్ధిపై మనకు విశ్వాసం లేకపోవడం తరచుగా స్వీయ-సంరక్షణ కోసం దురదృష్టకర చర్యలను ఆశ్రయించేలా చేస్తుంది. ఈ చర్యలు వారిని మరియు వారి వారసులను విగ్రహారాధన ప్రమాదాల బారిన పడేలా చేశాయి, ఇది గతంలో వారి మత సమాజాన్ని మరియు దేశాన్ని నాశనం చేసింది.
మిడిమిడి అనుచరులు అలాంటి సంఘాలను తక్కువ చేసి, విభజన కోసం చేసిన పిలుపులను హేతుబద్ధం చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే, దేవుని బోధలతో లోతుగా తెలిసిన వారు ఈ విషయాన్ని భిన్నంగా సంప్రదిస్తారు. అటువంటి యూనియన్ల నుండి ఉత్పన్నమయ్యే భయంకరమైన పరిణామాలను వారు అంచనా వేస్తారు. అనేక మంది అనుచరులు చేసిన సమర్థనలు మరియు రక్షణలు నిజమైన విశ్వాసులను ఆశ్చర్యపరుస్తాయి మరియు విచారాన్ని కలిగిస్తాయి. దేవునికి విధేయత చూపే ఎవరైనా అనైతికత మరియు అగౌరవానికి వ్యతిరేకంగా నిలబడే వారికి మద్దతు ఇవ్వాలి.

ఎజ్రా యొక్క పాప ఒప్పుకోలు. (5-15)
సమర్పణ, ముఖ్యంగా సాయంత్రం బలి, దేవుని దీవించబడిన గొర్రెపిల్లను సూచిస్తుంది, అతను ప్రపంచంలోని సంధ్యా సమయంలో, తన స్వంత త్యాగం ద్వారా పాపాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించబడ్డాడు. ఎజ్రా యొక్క ఉపన్యాసం పాపం యొక్క పశ్చాత్తాపాన్ని, అతని ప్రజల అతిక్రమణలను ప్రతిబింబిస్తుంది. అయినప్పటికీ, సాంత్వన పొందండి, ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపపరులు తమ పాపాలు పరలోకానికి ఎక్కినప్పటికీ, దేవుని దయ కూడా అక్కడ నివసిస్తుందనే జ్ఞానంలో ఓదార్పును పొందుతారు.
పాపం గురించి చర్చిస్తున్నప్పుడు, ఎజ్రా మాటలు తీవ్ర అవమానంతో ప్రతిధ్వనించాయి. నిష్కపటమైన పశ్చాత్తాపంలో, ఈ పవిత్రమైన అవమానం కూడా పవిత్రమైన దుఃఖం వలె అవసరం. ఎజ్రా ప్రసంగం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపరాధం యొక్క వెల్లడి విస్మయం యొక్క భావాన్ని రేకెత్తిస్తుంది; మనం పాపం గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నామో, అది అంత తీవ్రంగా కనిపిస్తుంది. దేవుడా, పాపాత్ముడైన నన్ను కరుణించు” అని కేకలు వేయడం సముచితం.
ఎజ్రా మాటలు తీవ్ర భయాందోళనలను తెలియజేస్తున్నాయి. ముఖ్యమైన తీర్పులు మరియు విమోచనలను అనుభవించిన తర్వాత పాపం వైపు తిరగడం కంటే కొన్ని సంకేతాలు మరింత నిశ్చయంగా లేదా దిగులుగా ఉంటాయి. దేవుని సంఘంలోని ప్రతి సభ్యుడు వారు ప్రభువు యొక్క సహనాన్ని పోగొట్టుకోలేదని మరియు తద్వారా తమ స్వంత నాశనాన్ని తెచ్చుకోలేదని ఆశ్చర్యపడాలి. అలాంటప్పుడు అధర్మపరుల గతి ఏమిటి? అయితే, వ్యక్తిగత సమర్థనలు లేకపోయినా, స్వర్గపు న్యాయవాది నిజమైన పశ్చాత్తాపానికి గురైన వ్యక్తి తరపున తీవ్రంగా మధ్యవర్తిత్వం వహించాడు.



Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |