Esther - ఎస్తేరు 2 | View All

1. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమెచేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని తలంచగా

1. After these things, when the wrath of King Ahasuerus had calmed down, he remembered Vashti and what she had done, and what was decreed against her.

2. ¸యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,

2. And the king's servants who served him said, Let beautiful young virgins be sought for the king.

3. అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరిని సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజుయొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యముయొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధికొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత

3. And let the king choose officers in all the provinces of his kingdom, so that they may gather together all the beautiful young virgins to Shushan the palace, to the house of the women, to the hand of Hegai the king's eunuch, keeper of the women. And let their ointments be given.

4. రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను.

4. And let the young woman who pleases the king be queen instead of Vashti. And the thing pleased the king, and he did so.

5. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను.

5. In Shushan the palace there was a certain Jew whose name was Mordecai, the son of Jair, the son of Shimei, the son of Kish, a Benjamite

6. బబులోను రాజైన నెబు కద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు.

6. who had been carried away from Jerusalem with the captivity which had been carried away with Jeconiah king of Judah, whom Nebuchadnezzar king of Babylon had carried away.

7. తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలితండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను.

7. And he brought up Hadassah, that is, Esther, his uncle's daughter. For she had neither father nor mother, and the young woman was fair and beautiful, whom Mordecai, when her father and mother were dead, took for his own daughter.

8. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్ప గింప బడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను.

8. And it happened when the king's command and his order was heard, and when many young women had been gathered to Shushan the palace, into the hand of Hegai, Esther was also brought to the king's house, into the hand of Hegai, keeper of the women.

9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళ క్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్ల లను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను.

9. And the young woman pleased him, and she received kindness from him. And he quickly gave to her purifiers and her portion. And seven young women who were fit to be given her, out of the king's house. And he moved her and her servant women to the best place in the house of the women.

10. మొర్దెకై - నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.

10. Esther had not revealed her people nor her kindred, for Mordecai had commanded her that she should not show it.

11. ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడు చుండెను.

11. And Mordecai walked every day in front of the court of the women's house in order to know how Esther did and what was to become of her.

12. ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళ క్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయుకాలము సంపూర్ణమగు చుండెను.

12. And when the turn of each young woman had come to go in to King Ahasuerus, after she had been purified twelve months, according to the law of the women (for so the days of their anointing were done, six months with oil of myrrh, and six months with sweet odors, and with the perfumes of the women).

13. మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుటకద్దు.

13. And in this way the young woman came to the king. Whatever she desired was given her to go with her out of the house of the women to the king's house.

14. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతః పురమునకు తిరిగివచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరల వెళ్లకుండెను.

14. She went in the evening, and on the next day she returned to the second house of the women, into the hand of Shaashgaz, the king's officer who kept the concubines. She did not come in to the king any more, unless the king delighted in her, and she was called by name.

15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రియైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను.

15. And when the turn of Esther, the daughter of Abihail the uncle of Mordecai who had taken her for his daughter, had come to go in to the king, she asked nothing but what was chosen by Hegai the king's officer, the keeper of the women. And Esther had favor in the sight of all who looked on her.

16. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా

16. And Esther was taken to King Ahasuerus into his royal house in the tenth month, which is the month Tebeth, in the seventh year of his reign.

17. స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను.

17. And the king loved Esther above all the women, and she rose in grace and favor in his sight more than all the virgins. And he set the royal crown on her head, and made her queen instead of Vashti.

18. అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై యొక గొప్పవిందు చేయించి, సంస్థానములలో సెలవుదినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను.

18. And the king made a great feast to all his princes and his servants, Esther's feast. And he ordered a release for the provinces, and gave gifts, according to the state of the king.

19. రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.

19. And when the virgins were gathered the second time, then Mordecai sat in the king's gate.

20. ఎస్తేరు మొర్దెకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశము నైనను తెలియజేయకయుండెను.

20. Esther had not yet revealed her kindred nor her people, as Mordecai had commanded her. For Esther obeyed the command of Mordecai as she did when she was brought up with him.

21. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని యుండిరి.

21. In those days, while Mordecai sat in the king's gate, two of the king's eunuchs, Bigthan and Teresh, of those who kept the door, were angry and tried to lay a hand on King Ahasuerus.

22. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడి నందున అతడు దానిని రాణియైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకైయొక్క పేరట రాజునకు దాని తెలియ జేసెను.

22. And the thing was known to Mordecai, who told Esther the queen. And Esther told the king in Mordecai's name.

23. ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను.

23. And when the matter was searched into, it was found out, and the two of them were hanged on a tree. And it was written in the Book of the Matters of the Days before the king.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Esther - ఎస్తేరు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఎస్తేర్ రాణిని ఎన్నుకుంది. (1-20) 
దైవిక ద్యోతకం లేని వారి మధ్య తలెత్తిన అసంబద్ధమైన ప్రవర్తనలను మేము చూస్తున్నాము, వ్యక్తులను వారి శరీరసంబంధమైన కోరికల నుండి శుభ్రపరచడానికి మరియు వివాహం యొక్క అసలు సూత్రాలకు వారిని తిరిగి నడిపించడానికి క్రీస్తు సువార్త యొక్క ఆవశ్యకతను హైలైట్ చేస్తుంది. ఎస్తేర్ రాణిగా ఎదగడం ఒక ఉదాహరణ. ఈ పదవిని పొందేందుకు ఎస్తేర్ పాపం చేసిందని సూచించే వారు ఆ కాలంలో మరియు ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న ఆచారాలను లెక్కించడంలో విఫలమవుతారు. ఆ యుగంలో, రాజుచే ఎన్నుకోబడిన ఎవరైనా అతని భార్య అయ్యారు, తక్కువ హోదాలో ఉన్నా.
అటువంటి కోరికలు మరియు భూసంబంధమైన ఆనందం ప్రజల ఆకాంక్షలపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు మానవ స్వభావం యొక్క విచారకరమైన స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అనివార్యంగా నిరాశ మరియు నిరాశకు దారితీస్తుంది. దైవిక నియమానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ప్రస్తుత జీవితంలో కూడా వారి శ్రేయస్సును అత్యంత తెలివిగా నిర్ధారిస్తాడు. వీటన్నింటి మధ్య, మనం దేవుని ప్రావిడెన్స్ - తెలివైన మరియు దయగల - లోతైన ఇంకా పవిత్రమైన ఉద్దేశాలను కూడా ప్రతిబింబించాలి.
మన పరిస్థితులు ఎలా మారినప్పటికీ, మన తల్లిదండ్రుల పట్ల లేదా వారి పాత్రలను స్వీకరించిన వ్యక్తుల పట్ల మన బాధ్యతలను విస్మరించడానికి వాటిని ఒక సాకుగా ఉపయోగించకూడదు.

మొర్దెకై రాజుకు వ్యతిరేకంగా ఒక కుట్రను కనుగొన్నాడు. (21-23)
విధేయులైన పౌరులు పాలకుని లేదా సాధారణ శాంతిని లక్ష్యంగా చేసుకున్నట్లు తమకు తెలిసిన హానికరమైన పథకాలను దాచకూడదు. మొర్దెకై తక్షణ బహుమతిని పొందనప్పటికీ, అతని పనులు భవిష్యత్తులో గుర్తింపు కోసం తగిన విధంగా గుర్తించబడ్డాయి. అదేవిధంగా, క్రీస్తును సేవించే వారికి, నీతిమంతుల పునరుత్థానం కోసం వారి అంతిమ ప్రతిఫలం వేచి ఉన్నప్పటికీ, వారి విశ్వాసం మరియు ప్రేమ యొక్క చర్యలు నమోదు చేయబడ్డాయి మరియు దేవుడు న్యాయవంతుడు మరియు వారిని విస్మరించడు. దేవుని సేవకుడు ప్రతి బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాలి మరియు వారు సేవ చేసే వారి కోసం వారి పనులలో అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం వారు పట్టించుకోనట్లు కనిపించినా, వారి కృషికి తగిన సమయంలో గుర్తింపు లభిస్తుంది. మన యొక్క ఏ చర్య విస్మరించబడదు; ప్రకటన గ్రంథం 20:12 లో పేర్కొన్నట్లుగా, మన అత్యంత రహస్యమైన ఆలోచనలు కూడా శాశ్వతమైన రికార్డులలో చోటు దక్కించుకుంటాయి.



Shortcut Links
ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |