Esther - ఎస్తేరు 9 | View All

1. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినము ననే యూదులు తమ పగవారిమీద అధికారము నొందినట్లు అగుపడెను.

2. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడు చేయవలెనని చూచినవారిని హతముచేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి.

3. మొర్దెకైని గూర్చిన భయముతమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధి కారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి.

4. మొర్దెకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానము లన్నిటియందు వ్యాపించెను.

5. యూదులు తమ శత్రువుల నందరిని కత్తివాత హతముచేసి వారిని నాశనముచేసి మనస్సు తీర తమ విరోధులకు చేసిరి.

6. షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.

7. హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క పదిమంది కుమారులైన పర్షందాతా

9. అదల్యా అరీదాతా పర్మష్తా

10. అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు.

11. ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా

12. రాజు రాణియైన ఎస్తేరుతోయూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయ బడునని సెలవియ్యగా

13. ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడు నట్లుగాను సెలవియ్యుడనెను.

14. ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామాను యొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.

15. షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.

16. రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దిన మందు తమ విరోధులలో డెబ్బది యయిదువేల మందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితేవారును కొల్లసొమ్ముపట్టుకొనలేదు.

17. పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.

18. షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దిన మందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.

19. కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి అది విందుచేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.

20. మొర్దెకై యీ సంగతులను గూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూర ముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి

21. యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు

22. విందుచేసికొనుచు సంతోషముగా నుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను.

23. అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదు మని యొప్పుకొనిరి.

24. యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని, పూరు, అనగా చీటి వేయించియుండగా

25. ఎస్తేరు, విాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి, వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయ బడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.

26. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటినిబట్టియు, ఈ సంగతినిబట్టియు, తాము చూచినదానినంతటినిబట్టియు తమమీదికి వచ్చిన దానిని బట్టియు

27. యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు,

28. పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచి పోకుండునట్లు, తమమీదను, తమ సంతతివారిమీదను, తమతో కలిసికొనిన వారిమీదను ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి.

29. అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీ హాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితముగా వ్రాయించిరి.

30. మరియు యూదుడైన మొర్దెకైయును రాణియైన ఎస్తేరును యూదు లకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యత యని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా

31. ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థ్వములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను.

32. ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Esther - ఎస్తేరు 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదుల విజయం. (1-19) 
యూదు ప్రజల విరోధులు ముందస్తు డిక్రీ ద్వారా వారిపై నియంత్రణ సాధించాలని ప్రయత్నించారు. వారు ఎన్నుకున్న వ్యక్తులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మానేసి ఉంటే, వారు స్వయంగా పరిణామాలను అనుభవించేవారు కాదు. యూదులు, వారి ప్రయత్నాలలో ఐక్యంగా, పరస్పరం ఒకరినొకరు బలపరిచారు. మన విశ్వాసాన్ని, ప్రాణం కంటే విలువైన నిధిని తొలగించడానికి కృషి చేసే మన ఆత్మల శత్రువులకు వ్యతిరేకంగా ఐక్యమైన ఆత్మ మరియు ఆలోచనతో దృఢ నిశ్చయంతో నిలబడే పాఠాన్ని మనం గ్రహిద్దాం. యూదులు, వారి విశ్వాసానికి నిదర్శనంగా, ప్రాపంచిక సంపదలను విస్మరించారు, కేవలం స్వీయ-సంరక్షణ కోసం వారి కోరికను ప్రదర్శించారు. అన్ని సందర్భాల్లో, దేవుని అనుచరులు కనికరం మరియు నిస్వార్థతను ప్రదర్శించాలి, న్యాయబద్ధంగా పొందగలిగే ప్రయోజనాలు తరచుగా తగ్గుతాయి. తమ పనులు పూర్తయిన మరుసటి రోజు యూదుల పండుగను జరుపుకుంటారు. దేవుని నుండి గొప్ప దయతో మనం ఆశీర్వదించబడినప్పుడు, ప్రతిగా మన కృతజ్ఞతను వెంటనే తెలియజేయాలి.

దీని జ్ఞాపకార్థం పూరీం విందు. (20-32)
యూదుల పండుగలను పాటించడం పాత నిబంధన గ్రంథాల ప్రామాణికతను బహిరంగంగా ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది. పాత నిబంధన గ్రంధాలు నిజం అయినందున, యూదు సంప్రదాయానికి చెందిన మెస్సీయా సుదూర కాలంలో వచ్చాడు మరియు నజరేయుడైన యేసు మాత్రమే ఆ పాత్రను నెరవేర్చగలడు. పండుగ అధికారంతో స్థాపించబడింది, అయినప్పటికీ దేవుని ఆత్మచే మార్గనిర్దేశం చేయబడింది. "చాలా" అనే పర్షియన్ పదం నుండి ఉద్భవించిన పూరీమ్ విందు అని పేరు పెట్టారు, ఈ శీర్షిక ఇజ్రాయెల్ యొక్క దేవుని సర్వశక్తిమంతమైన శక్తిని నిరంతరం గుర్తు చేస్తుంది, అతను తన స్వంత ప్రయోజనాలను సాధించడానికి అన్యమతస్థుల మూఢనమ్మకాలను అద్భుతంగా ఉపయోగించాడు.
మన ఆశీర్వాదాల గురించి ఆలోచించడంలో, గత చింతలు మరియు ఇబ్బందులను గుర్తుకు తెచ్చుకోవడం చాలా అవసరం. మనము వ్యక్తిగత ఆశీర్వాదాలను పొందినప్పుడు, మతిమరుపు వారి సౌలభ్యాన్ని దోచుకోవడానికి లేదా ప్రభువును స్తుతించే హక్కును కోల్పోకుండా ఉండకూడదు. స్వర్గపు ఆనందాల కోసం మనల్ని ఊహించి, సిద్ధం చేసే పవిత్రమైన ఆనందంతో సంతోషించమని ప్రభువు మనకు ఆదేశిస్తాడు. మన పట్ల దైవిక దయ యొక్క ప్రతి సందర్భం దయను అందించడానికి కొత్త బాధ్యతను ఏర్పరుస్తుంది, ప్రత్యేకించి మన దాతృత్వం చాలా అవసరం ఉన్నవారికి. అన్నింటికంటే మించి, 2 కోరింథీయులకు 8:9లో నొక్కిచెప్పబడినట్లుగా, క్రీస్తు ద్వారా పొందబడిన విమోచన మనలను కనికరం చూపమని బలవంతం చేస్తుంది.



Shortcut Links
ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |