తన సందేశాన్ని యోబుకు అందజేయడానికి, అతని దుఃఖాన్ని మరింత పెంచడానికీ సైతాను ఇప్పుడు అతని భార్యను సాధనంగా చేసుకున్నాడు. యోబుకు ప్రాప్తించిన భయంకరమైన నష్టాలనూ బాధలనూ అతని యథార్థతా, భక్తీ అడ్డుకోలేక పోయినప్పుడు ఇక వాటివల్ల లాభమేముంది అంటూ ఉంది యోబు భార్య.
“దేవుణ్ణి తిట్టిపోసి చచ్చిపో”– అనడంలో ఆమె సైతాను ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. ఆత్మహత్య చేసుకొమ్మని కాదు. యోబు దేవుణ్ణి దూషిస్తే ఆయన అతన్ని చంపేస్తాడనీ, అలానైనా అతని దైన్య స్థితినుంచి విడుదల కలుగుతుందనీ బహుశా ఆమె అభిప్రాయం కావచ్చు.