యోబు 28:28; సామెతలు 1:7; సామెతలు 9:10. దేవుని పట్ల భయభక్తుల గురించి నోట్స్ కీర్తనల గ్రంథము 34:11-14; ఆదికాండము 20:11 చూడండి. దేవుని యందు భయభక్తులు లేకపోతే జ్ఞానం ఆరంభ దశలో కూడా ఉండదు. ఒక మనిషికి చురుకైన తెలివితేటలు, అపారమైన విజ్ఞానం, గొప్ప నిపుణతలు ఉండవచ్చు. అయితే దేవుని పట్ల భయభక్తులు లేకుంటే అతనికి నిజ జ్ఞానం ఉండదు. దేవుని పై భయభక్తులంటే ఏమిటో అవి ఒక మనిషిచేత ఏమి చేయిస్తాయో చూడండి. నిజమైన జ్ఞానమంటే విషయాలను తెలిసి ఉండడం కాదు. యోగ్యంగా ప్రవర్తించడంలోనే అది ఉంటుంది. బైబిల్లో వెల్లడి అయిన దేవునికి, విశ్వమంతటికీ ఉన్న ఈ దేవునికి లోబడేందుకు సిద్ధపడని వ్యక్తి ఏ మాత్రం జ్ఞానవంతుడని అనిపించుకోడు.