“ఆధారశిల”– ద్వితీయోపదేశకాండము 32:4 నోట్. దీనికి 18వ కీర్తనకు చాలా పోలికలున్నాయి. దేవుని ప్రజలు తమ శత్రువులతో కత్తి పట్టి యుద్ధాలు చేసిన కాలంలో దావీదు జీవించాడు. యుద్ధరంగంలో ప్రవీణత చాలా కోరదగిన లక్షణం. దావీదుకు నిస్సందేహంగా స్వతహాగా సామర్థ్యం ఉంది, అంతేగాక ఖడ్గంతోను, విల్లుతోను అతడు బాగా సాధన చేసి ఉంటాడు. అయితే తన నైపుణ్యం, సామర్థ్యం తన స్వంతం కాదనీ, దేవుడు ఇచ్చినదేననీ అతడు ఒప్పుకుంటున్నాడు. ఈ కొత్త ఒడంబడిక కాలంలో దేవుని ప్రజల మహా యుద్ధాలు ఆధ్యాత్మికం (ఎఫెసీయులకు 6:10-18). దావీదుకు నేర్పించిన దేవుడే ఆయనకు మనం కూడా లోబడి సిద్ధపడితే ఈ యుద్ధాలెలా చేయాలో నేర్పిస్తాడు. మనకు కొంత విజయం చేకూరితే అది దేవుని మూలంగానే అనుకోవాలి గాని మన స్వంత సామర్థ్యం గానీ మంచితనం గానీ మనకు విజయం సాధించిపెట్టిందని వ్యర్థంగా అనుకోకూడదు (1 కోరింథీయులకు 4:7).