“సేద”– విశ్వాసులు ఈ లోకంలో ఉన్నంత కాలం అలసట, విషమ పరీక్షలు తప్పవు. కొన్ని సార్లు వారు క్రుంగిపోయి నిరాశ చెందాలనే దుష్ప్రేరేపణకు గురి అవుతారు. అలాంటి సమయాల్లో కాపరి వారి దరిచేరి వారి ఆత్మలకు సేదదీర్చి ఊరడిస్తాడు. ఆయన మనలను నీతిన్యాయాల మార్గంలోనే నడిపిస్తాడు. ఎన్నడూ వక్రమార్గాల్లో గానీ మోసకరమైన విశాల వీధుల్లో గానీ భ్రష్టత్వం, పాపం ఉన్న దారుల్లో గానీ నడిపించడు. ఈ మంచి కాపరి నిన్ను అబద్ధాల్లో ఇరికించే చెడ్డ దారుల్లో గానీ మంచి చట్టాన్ని మీరే విధానంలో న్యాయం తప్పి ప్రవర్తించవలసి వచ్చిన మార్గాల్లో గానీ నడిపించాడని ఎన్నడూ నీవు అనకూడదు. ఆయన ఎన్నడూ అలా చేయడు. ఆయన నామం, ఆయన తండ్రి మహిమ తన గొర్రెలతో ముడిపడి ఉన్నాయి. ఆయన వారినెప్పుడూ సత్యం, న్యాయం, యథార్థతతో కూడిన దారుల్లోనే నడిపిస్తాడు.