కొన్ని సార్లు కష్టాలు, దుఃఖాలు భరించరానివిగా అనిపిస్తాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు తహతహ లాడతాం. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి అలాంటి విషమ పరీక్షలను దేవుడు మంచి ఉద్దేశంతో రానిస్తాడని గ్రహిస్తాడు. మనం వాటినుంచి తప్పించుకోవాలని చూడక, దేవుని మహిమార్థం, మన మేలుకోసం వాటిని సహించాలి (లూకా 22:41-42; యాకోబు 1:2-4; 1 పేతురు 1:6-7; 1 పేతురు 4:12-13). కష్టాల నుంచి పారిపోవాలని ప్రయత్నించడం సహజమే గాని అందువల్ల ఉపయోగం లేదు. అది మన విషయంలో దేవుడు నియమించిన మార్గం కాదు. మన విశ్రాంతికి పనికి వచ్చే ఏ అరణ్యమూ లేదు. అయితే పారిపోవడం కంటే మరింత ఉత్తమమైన మార్గం, విశ్రాంతికి మరింత శ్రేష్ఠమైన ప్రదేశం ఉన్నాయి. అవేమంటే క్రీస్తు సంకల్పంలో శాంతిని కనుక్కొవడం, దేవుని జాలిగల వక్షస్థలాన విశ్రాంతి తీసుకోవడం (మత్తయి 11:29; యోహాను 14:1; యోహాను 16:33; 2 కోరింథీయులకు 1:3-5; ఫిలిప్పీయులకు 4:6-7).