Exodus - నిర్గమకాండము 14 | View All

1. మరియయెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను

1. అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు:

2. ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను.

2. “ప్రజలు వెనక్కు తిరిగి పీహ హీరోతుకు ప్రయాణం కట్టమని చెప్పు. మిగ్దోలుకు, సముద్రానికి మధ్య ప్రదేశంలో రాత్రికి బసచేయాలని వారితో చెప్పు. ఇది బయల్సెఫోను దగ్గర్లో ఉంది.

3. ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చి - వారు ఈ దేశములో చిక్కుబడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అనుకొనును.

3. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తప్పిపోయి ఉంటారని ఫరో తలుస్తాడు. పైగా ప్రజలు వెళ్ల గలిగినచోటు ఇంకేమీ ఉండదు అనుకొంటాడు.

4. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయుల
రోమీయులకు 9:18

4. ఫరోను నేను ధైర్యశాలిగా చేస్తాను. అతడేమో మిమ్మల్ని తరుముతాడు. అయితే ఫరోను, అతని సైన్యాన్ని నేను ఓడిస్తాను. ఇది నాకు కీర్తి తెచ్చి పెడుతుంది. నేనే యెహోవానని ఈజిప్టు వాళ్లు అప్పుడు తెల్సుకొంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయులై ఆయన చెప్పినట్టు చేసారు.

5. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్ప బడి మనమెందుకీలాగు చేసితివిు? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితివిు అని చెప్పుకొనిరి.

5. ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక సమాచారం అందింది. ఎప్పుడైతే ఈ సంగతి విన్నారో అప్పుడు వెంటనే ఫరో, అతని అధికారులు తాము చేసిన దాన్ని గూర్చి తమ మనసు మార్చుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్లనిచ్చాం? వాళ్లను మనం ఎందుకు పారిపోనిచ్చాం? ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకొన్నాం” అన్నాడు ఫరో.

6. అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను.

6. కనుక ఫరో తన యుద్ధరథాన్ని సిద్ధం చేసుకొని, తన మనుష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్లాడు.

7. మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడు కొనిపోయెను.

7. తన మనుష్యుల్లో బలవంతులయిన వాళ్లు 600 మందిని, రథాలు అన్నింటిని తనతో తీసుకొని వెళ్లాడు. ఒక్కోరథానికి ఒక్కో అధికారి ఉన్నాడు.

8. యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి.

8. ఇశ్రాయేలీయులు విజయ సంకేతంగా చేతులు పైకెత్తి వెళ్లి పోతున్నారు. కానీ ఈజిప్టురాజైన ఫరో ఇంకా ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేసాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు.

9. ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.

9. ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గర్లో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు.

10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.

10. ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు.

11. అంతట వారు మోషేతో - ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?

11. మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి.

12. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటెె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.

12. ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.”

13. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.

13. కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు!

14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

14. మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”

15. అంతలో యెహోవా మోషేతో - నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.

15. అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు

16. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.

16. నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు.

17. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చుకొందును.
రోమీయులకు 9:18

17. ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను.

18. నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.

18. నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.”

19. అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను

19. ఆ సమయంలో యెహోవా దూత ప్రజల వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది

20. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులకు సమీపింపలేదు.

20. ఈ విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత ఆరాత్రి ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి రాలేకపోయారు.

21. మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
అపో. కార్యములు 7:36, హెబ్రీయులకు 11:29

21. మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది.

22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
1 కోరింథీయులకు 10:1

22. ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క నీళ్లు గోడలా నిలిచాయి.

23. ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.

23. అప్పుడు ఫరో రథాలు, అశ్వదళాలు అన్నీ వాళ్ల వెంట సముద్రంలో ప్రవేశించాయి.

24. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి

24. ఆ ఉదయం ఎత్తయిన మేఘం నుండి అగ్ని స్తంభం నుండి యెహోవా ఈజిప్టు సైన్నాన్ని చూచాడు. యెహోవా వాళ్లను ఎదుర్కొని ఓడించాడు.

25. వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

25. రథచక్రాలు బిగిసిపోయి కదలడం లేదు. రథాలను అదుపుచెయ్యడం చాలా కష్టతరంగా ఉంది. “మనం ఇక్కడ్నుంచి పారిపోదాం రండి! యెహోవా మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకోసం యుద్ధం చేస్తున్నాడు.” అంటూ ఈజిప్టు వాళ్లు కేకలు వేసారు.

26. అంతలో యెహోవా మోషేతో - ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.

26. అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి సముద్రం మీదికి ఎత్తు, నీళ్లు పడిపోయి ఈజిప్టు రథాలను, అశ్వదళాలను ముంచేస్తాయి.” అని చెప్పాడు.

27. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.

27. కనుక తెల్లవారు ఝామున మోషే తన చేతిని సముద్రం మీదికి ఎత్తాడు. నీళ్లు యధాస్థానానికి వచ్చి పడ్డాయి. ఈజిప్టు వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈజిప్టు వాళ్లు సముద్రంలో కొట్టుకుపోయేటట్టు యెహోవా చేసాడు.

28. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

28. నీళ్లు యధాస్థానానికి మళ్లీ రావడం చేత రథాలను, అశ్వదళాలను కప్పేశాయి. ఇశ్రాయేలు ప్రజలను తరుముకొచ్చిన ఫరో సైన్యాలన్నీ నాశనం చేయబడ్డాయి. వాళ్లలో ఒక్కడూ బతకలేదు.

29. అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.

29. అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం పొడినేల మీద సముద్రాన్ని దాటిపోయారు. వారి కుడి ఎడమ ప్రక్కల్లో నీళ్లు ఒక గోడలా నిలిచిపోయాయి.

30. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి.

30. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టువాళ్లు చేతినుండి యెహోవాయే రక్షించాడు. ఎర్రసముద్ర తీరాన ఈజిప్టువాళ్ల శవాలను ఇశ్రాయేలు ప్రజలు చూచారు.

31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.

31. యెహోవా ఈజిప్టు వాళ్లను ఓడించినప్పుడు ఆయన మహత్తర శక్తిని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అందుచేత ప్రజలు యెహోవాకు భయపడి ఆయనను ఘనపర్చారు. యెహోవాను, ఆయన సేవకుడైన మోషేను నమ్మారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
దేవుడు ఇశ్రాయేలీయులను పిహహీరోత్‌కు నడిపిస్తాడు, ఫరో వారిని వెంబడిస్తాడు. (1-9) 
ఇశ్రాయేలీయులు అరణ్యంలో చిక్కుకున్నందున వారిని సులభంగా పట్టుకోవచ్చని ఫరో అనుకున్నాడు. కానీ దేవుడు తన శక్తిని చూపించడానికి ఫరో చర్యలను ఉపయోగిస్తాడని చెప్పాడు. ప్రజలు దేవుణ్ణి గౌరవించనప్పుడు, అతను తన బలాన్ని చూపించడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. చర్చికి చెడు విషయాలు జరుగుతున్నట్లు అనిపించినప్పుడు కూడా, వారి శత్రువులను ఓడించడానికి దేవుడు దానిని ఉపయోగించగలడు. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వడం సరైన పని అయినప్పటికీ, ఫరో తన మీద కోపం తెచ్చుకున్నాడు. దేవుడు తన అనుచరుల పట్ల ప్రజల అసూయ మరియు కోపాన్ని తిప్పికొట్టగలడు మరియు వారిని బాధపెట్టగలడు. దేవుణ్ణి ప్రేమించి మంచి జీవితాన్ని గడిపే వ్యక్తులు సాతాను నుండి సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ వారు తమ విశ్వాసాన్ని వదులుకోకుండా బలంగా ఉండాలి.

ఇశ్రాయేలీయులు గొణుగుతున్నారు, మోషే వారిని ఓదార్చాడు. (10-14) 
ఇశ్రాయేలు ప్రజలు చిక్కుకున్నారు మరియు పైకి తప్ప ఎక్కడికీ వెళ్ళలేదు. వారు దేవుణ్ణి అనుసరించారు మరియు స్వర్గానికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వారు ఇప్పటికీ భయపడి, అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కొందరు దేవుణ్ణి సహాయం కోసం అడిగారు, అది మంచిది. అయితే మరికొందరు ఫిర్యాదు చేశారు మరియు వారి నాయకుడు మోషే వారికి సహాయం చేస్తున్నప్పటికీ అతనిపై కోపంగా ఉన్నారు. కష్టంగా ఉన్నా భయపడవద్దని, విశ్వాసం కలిగి ఉండాలని మోషే వారికి చెప్పాడు. మనం భయపడుతున్నప్పుడు కూడా ప్రయత్నించడం మరియు ప్రార్థించడం చాలా ముఖ్యం, తద్వారా మన సవాళ్లను అధిగమించవచ్చు. ఒకే స్థలంలో ఉండండి, పారిపోవడానికి లేదా పోరాడటానికి ప్రయత్నించవద్దు. దేవుని సూచనల కోసం వేచి ఉండండి మరియు వాటిని అనుసరించండి. దేవుడు మీకు సహాయం చేస్తాడని నమ్మండి మరియు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని తెలిసి ప్రశాంతంగా ఉండండి. పరిస్థితులు కష్టమైనప్పటికీ, దేవుడు మీకు సహాయం చేసే మార్గాన్ని కనుగొంటాడు. 

దేవుడు మోషేకు బోధించాడు, ఇశ్రాయేలీయులు మరియు ఈజిప్షియన్ల మధ్య మేఘం. (15-20) 
మోషే నిశ్శబ్దంగా ప్రార్థించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు భయంతో అరుస్తున్నప్పుడు కంటే దేవుడు ఎక్కువగా విన్నాడు. దేవుడు ఒక పెద్ద మేఘం మరియు అగ్నితో వారిని రక్షించాడు, అది వారికి మరియు వారి శత్రువుల మధ్య గోడలా పనిచేసింది. మంచి చేసే వ్యక్తులతో మరియు చెడు పనులు చేసే వ్యక్తులతో దేవునికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. అతను చెడ్డ వ్యక్తులతో కఠినంగా ఉంటాడు, కానీ మంచి వ్యక్తులతో మంచిగా ఉంటాడు. వెలుగును చీకటిని వేరు చేసేవాడు ఆయనే. ఆదికాండము 1:4 దేవుడు ఐగుప్తీయులకు చీకటిని, ఇశ్రాయేలీయులకు వెలుగును ఇచ్చాడు. స్వర్గంలో, దేవుణ్ణి అనుసరించే మంచి వ్యక్తులు చాలా కాంతిని కలిగి ఉంటారని ఇది చూపిస్తుంది, అయితే దేవుణ్ణి అనుసరిస్తున్నట్లు నటించే చెడ్డ వ్యక్తులు ఎప్పటికీ చీకటి ప్రదేశాలలో ఉంటారు. 

ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా వెళతారు, ఇది ఈజిప్షియన్లను మునిగిపోతుంది. (21-31)
ప్రజలు తమ శత్రువుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, వారు దాటలేని ఒక పెద్ద సముద్రాన్ని ఎదుర్కొన్నారు. కానీ అప్పుడు, ఏదో అద్భుతం జరిగింది మరియు సముద్రం రెండుగా చీలి, వారు సురక్షితంగా నడవడానికి ఒక మార్గాన్ని సృష్టించింది. ఇది అందరికీ నిజంగా భయానక మరియు ఉత్తేజకరమైన క్షణం. యెషయా 11:15 ఇశ్రాయేలీయులు ఎండిపోయిన నేల మీద నడవడానికి వీలుగా సముద్ర జలాలను విభజించడం ద్వారా దేవుడు తన గొప్ప శక్తిని చూపించాడు. ఇది తన ప్రజలకు తన అనుగ్రహాన్ని చూపించడానికి మరియు కష్ట సమయాల్లో కూడా ఆయనను విశ్వసించేలా వారిని ప్రోత్సహించడానికి. వారిని అనుసరించడానికి ప్రయత్నించిన ఈజిప్షియన్లు తమ పాపాలకు పశ్చాత్తాపపడనందున మునిగిపోయారు. పాపానికి తిరుగులేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దేవుడు తనను ప్రేమించేవారి కోసం, భయభక్తుల కోసం అద్భుతమైన పనులు చేయగలడు. కానీ ఈజిప్షియన్ల వలె కోపం మరియు గర్వంతో ప్రవర్తించే వారు వారి చర్యల యొక్క పరిణామాలను ఎదుర్కొంటారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్షియన్లచే బాధించబడ్డారు, కానీ ఈజిప్షియన్లు ఆపలేదు. ఇప్పుడు, ఈజిప్షియన్లు పారిపోవాలనుకుంటున్నారు, కానీ వారు పారిపోలేరు. ప్రజలు దేవుని ప్రజలకు హాని చేయడానికి ప్రయత్నించినప్పుడు, వారు తమను తాము గాయపరచుకుంటారని గుర్తుంచుకోవడం ముఖ్యం. మోషే తన చేయి చాచమని చెప్పగా, సముద్రం ఈజిప్షియన్లను కప్పివేసింది, కాబట్టి వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఇలా జరగడం చూశారు మరియు అది వారికి దేవుని పట్ల చాలా కృతజ్ఞత కలిగింది. మనం ఎల్లప్పుడూ ఇలాంటి మంచి వైఖరిని కొనసాగించడానికి ప్రయత్నించాలి మరియు క్రైస్తవులకు మంచి ముగింపు ఉందని గుర్తుంచుకోవాలి. ఎవరైనా అతనికి నిజంగా అసభ్యంగా ఉన్నప్పుడు, వారు నిజంగా శక్తివంతంగా మరియు భయానకంగా అనిపించవచ్చు. కానీ అతను దేవునికి దగ్గరగా ఉంటే, నీచమైన వ్యక్తి తనను బాధపెట్టడానికి ప్రయత్నించినా అతను సురక్షితంగా ఉంటాడు. అతనికి బాధ కలిగించడానికి లేదా భయపెట్టడానికి ప్రయత్నించే ఏవైనా చెడు భావాలు లేదా ఆలోచనలతో పోరాడటానికి దేవుడు అతనికి సహాయం చేస్తాడు. దేవుడు అతన్ని రక్షిస్తాడు కాబట్టి అతను ఇకపై ఆ నీచమైన వ్యక్తులతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |