Exodus - నిర్గమకాండము 26 | View All

1. మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేయవలెను.
హెబ్రీయులకు 9:2

1. mariyu neevu padhi teralathoo oka mandiramunu cheyavalenu. neela dhoomra rakthavarnamulugala penina sannapu naarathoo vaatini chitrakaaruni paniyaina keroobulu galavaatinigaa cheyavalenu.

2. ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.

2. prathi tera podugu iruvadhi yenimidi mooralu; prathi tera vedalpu naalugu mooralu. aa teralannitiki okate kolatha.

3. అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.

3. ayidu teralanu oka daanithoo okati koorpavalenu. Migilina ayidu teralanu okadaanithoo okati koorpavalenu.

4. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.

4. terala koorpu chivaranu modati tera anchuna neelinooluthoo kolukulanu cheyavalenu. Rendava koorpunandali velupali tera chivaranu atlu cheyavalenu.

5. ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.

5. oka teralo ebadhi kolukulanu chesi, aa kolukulu okadaani nokati thagulukonunatlu aa rendava koorpunandali tera anchuna ebadhi kolukulanu cheyavalenu.

6. మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.

6. mariyu ebadhi bangaaru gundeelanu chesi aa gundeelachetha aa teralanu okadaanithoo okati koorpavalenu; adhi okate mandiramagunu.

7. మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.

7. mariyu mandiramupaini gudaaramugaa mekavendrukalathoo teralu cheyavalenu; padakondu teralanu cheyavalenu.

8. ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.

8. prathi tera podugu muppadhi mooralu, vedalpu naalugu mooralu, padakondu terala kolatha okkate.

9. అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.

9. ayidu teralanu okatigaanu aaru teralanu okatigaanu oka daanikokati koorpavalenu. aarava teranu gudaarapu edutibhaagamuna madavavalenu.

10. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.

10. terala koorpunaku velupalanunna tera anchuna ebadhi kolukulanu rendava koorpunandali tera anchuna ebadhi kolukulanu cheyavalenu.

11. మరియు ఏబది యిత్తడి గుండీలను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను.

11. mariyu ebadhi yitthadi gundee lanu chesi yokate gudaaramagunatlu aa gundeelanu aa kolu kulaku thagilinchi daani koorpavalenu.

12. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.

12. aa gudaarapu teralalo migili vrelaadubhaagamu, anagaa migilina sagamu tera, mandiramu venuka prakkameeda vrelaadavalenu.

13. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.

13. mariyu gudaarapu terala podugulo migilinadhi ee prakkanu oka moorayu, aa prakkanu oka moorayu, mandiramunu kapputaku ee prakkanu aa prakkanu daani prakkalameeda vrelaadavalenu.

14. మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్రవత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.

14. mariyu erraranguvesina pottella thoollathoo pai kappunu daanikimeedugaa samudra vatsala thoollathoo pai kappunu cheyavalenu.

15. మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.

15. mariyu mandiramunaku thummakarrathoo niluvu palakalu cheyavalenu.

16. పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.

16. palaka podugu padhi mooralu palaka vedalpu mooredunara yundavalenu.

17. ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.

17. prathi palakalo okadaani kokati sariyaina rendu kusulundavalenu. Atlu mandirapu palakalannitiki chesipettavalenu.

18. ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.

18. iruvadhi palakalu kudivaipuna, anagaa dakshina dikkuna mandiramunaku palakalanu cheyavalenu.

19. మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.

19. mariyu nokkokka palakakrinda daani daani rendu kusulaku rendu dimmalanu aa yiruvadhi palakala krinda naluvadhi vendi dimmalanu cheyavalenu.

20. మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున,

20. mandirapu rendava prakkanu, anagaa uttharadhikkuna,

21. ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను.

21. okkokka palakakrinda rendu dimmalu iruvadhi palakalunu vaati nalu vadhi vendi dimmalu undavalenu.

22. పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.

22. padamatithattu mandiramu yokka venuka prakkaku aaru palakalanu cheyavalenu.

23. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.

23. mariyu aa venuka prakkanu mandiramu yokka moolalaku rendu palakalanu cheyavalenu.

24. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.

24. avi aduguna koorchabadi shikharamuna modati ungaramu danuka okadaanithoo okati athikimpabadavalenu. Atlu aa rentiki undavalenu, avi rendu moolalakundunu.

25. పలకలు ఎనిమిది; వాటి వెండిదిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను.

25. palakalu enimidi; vaati vendidimmalu padunaaru; okkokka palakakrinda rendu dimma lundavalenu.

26. తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును

26. thummakarrathoo adda karralanu cheyavalenu. Mandiramu yokka oka prakka palakalaku ayidu adda karralunu

27. మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;

27. mandiramuyokka rendava prakka palakalaku ayidu adda karralunu padamati vaipuna mandiramuyokka prakka palakalaku ayidu adda karralunu undavalenu;

28. ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.

28. aa palakala madhyanundu nadimi adda karra ee kosanundi aa kosavaraku cheri yundavalenu.

29. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.

29. aa palakalaku bangaaru rekunu podiginchi vaati adda karralundu vaati ungara mulanu bangaaruthoo chesi adda karralakunu bangaarurekunu podigimpavalenu.

30. అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.

30. appudu konda meeda neeku kanuparacha badinadaani polikachoppuna mandiramunu niluvabettavalenu.

31. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.
లూకా 23:45, హెబ్రీయులకు 9:3, మత్తయి 27:51

31. mariyu neevu neela dhoomra rakthavarnamulugala oka adda teranu penina sanna naarathoo cheyavalenu. adhi chitra kaaruni paniyaina keroobulu galadhigaa cheyavalenu.

32. తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి.

32. thummakarrathoo cheyabadi bangaarureku podigina naalugu sthambhamulameeda daani veyavalenu; daani vankulu bangaaruvi vaati dimmalu vendivi.

33. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.

33. aa addateranu aa kolukula krinda thagilinchi saakshyapu mandasamu addateralopaliki thevalenu. aa addatera parishuddhasthalamunu athiparishuddhasthalamunu verucheyunu.

34. అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను.

34. athiparishuddhasthalamulo saakshyapu mandasamu meeda karunaapeethamu nunchavalenu.

35. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.

35. addatera velupala ballanu aa ballayeduta dakshinapu vaipunanunna mandiramuyokka yuttharadhikkuna deepavrukshamunu unchavalenu.

36. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.

36. mariyu neela dhoomra rakthavarnamulugala penina sanna naarathoo chitrakaarunipaniyaina teranu gudaarapu dvaaramunaku cheyavalenu.

37. ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింప వలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.

37. aa teraku ayidu sthambhamulanu thummakarrathoo chesi vaatiki bangaarureku podigimpa valenu. Vaati vampulu bangaaruvi vaatiki ayidu itthadi dimmalu pothapoyavalenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 26 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
గుడారపు తెరలు. (1-6) 
దేవుడు ఇశ్రాయేలీయులకు గుడారం అని పిలువబడే ఒక ప్రత్యేక గుడారంలో తనను తాను చూపించాడు ఎందుకంటే వారు అరణ్యంలో ప్రయాణిస్తున్నారు మరియు తనను ఆరాధించడానికి ఒక స్థలం అవసరం. గుడారం అందమైన తెరలతో అలంకరించబడింది, వాటిపై దేవదూతల చిత్రాలు ఉన్నాయి, అంటే అక్కడ పూజించే ప్రజలను దేవుని దేవదూతలు రక్షిస్తున్నారని అర్థం. దేవుడు ఎల్లప్పుడూ ప్రజలకు అవసరమైన వాటిని ఇస్తాడు మరియు వారి పరిస్థితిని బట్టి వారికి వివిధ మార్గాల్లో సహాయం చేస్తాడు. కీర్తనల గ్రంథము 34:7 

మేక వెంట్రుకల తెరలు. (7-14) 
కొన్ని కర్టెన్‌లు ఇతరుల వలె ఫాన్సీగా లేవు, కానీ అవి పెద్దవిగా మరియు మంచి వాటిని కప్పి ఉంచాయి. వాటిపై రక్షణ కోసం జంతువుల చర్మాలు కూడా ఉన్నాయి. ఇది యేసు మరియు అతని బోధలు మరియు అతనిని అనుసరించే వ్యక్తుల సమూహం (చర్చి) ఎలా ఉంటుందో బయటికి ముఖ్యమైనవిగా కనిపించకపోవచ్చు, కానీ అవి నిజంగా దేవుని దృష్టిలో ప్రత్యేకమైనవి మరియు విలువైనవి. 

బోర్డులు, సాకెట్లు మరియు బార్లు. (15-30) 
పెద్దవారి బరువున్న పెద్ద వెండి వస్తువులు ఉన్నాయి. వాటిని నేలపై వరుసలో ఉంచారు. ఈ వెండి వస్తువులలో రెండు మెరిసే బంగారు కవర్‌తో ప్రత్యేక చెక్కతో చేసిన బోర్డును కలిగి ఉన్నాయి. ఈ బోర్డులు భుజాలు మరియు వెనుక భాగాన్ని ప్రత్యేకంగా చేయడానికి కలిసి ఉంచబడ్డాయి. గోడలు కడ్డీలు మరియు బంగారు ఉంగరాలతో కలిసి ఉంచబడ్డాయి. వారు అన్నింటికీ అందమైన తెరలు వేశారు. అది కదలగలిగినప్పటికీ, అది నిజంగా బలంగా ఉంది. వారు దానిని నిర్మించడానికి ఉపయోగించిన వస్తువులు చాలా ఖరీదైనవి. ఇది దేవుడు నిర్మించిన ఒక ప్రత్యేక చర్చి లాంటిది, మరియు దీన్ని ప్రారంభించిన నిజంగా ముఖ్యమైన వ్యక్తులపై నిర్మించడం వంటిది మరియు యేసు అన్నింటిలో చాలా ముఖ్యమైన భాగం. ఎఫెసీయులకు 2:20-21 

హోలీ ఆఫ్ హోలీ యొక్క తెర మరియు ప్రవేశ ద్వారం కోసం. (31-37)
ఒక ప్రత్యేక స్థలంలో, రెండు గదులు పెద్ద తెరతో వేరు చేయబడ్డాయి. కర్టెన్ గోడలా ఉండడంతో దాన్ని దాటి ఎవరినీ వెళ్లనివ్వలేదు. దాని గుండా చూసేందుకు కూడా అనుమతించలేదు. ఈ తెర ఎందుకు ఉందో అపొస్తలుడు వివరించాడు. మత్తయి 27:51 యేసు మన కోసం చేసిన దాని వల్ల మనం ఇప్పుడు నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. గుడారంలోని అతి పవిత్రమైన స్థలాన్ని వేరుచేసే తెర ఉంది, అది దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేక గదిలా ఉంది. ఈ తెర గుడారానికి ఉన్న ఏకైక రక్షణ, కానీ దేవుడు తన చర్చిని చూసుకుంటాడు. అతను ద్వారాలు మరియు బార్లు వంటి బలమైన తెర చేయవచ్చు. యేసు మరియు అతని చర్చి ఎంత ప్రత్యేకమైనవో అర్థం చేసుకోవడానికి ఈ కథ సహాయపడుతుంది. యేసు అద్భుతమని, ఆయన బోధలు ముఖ్యమైనవని మనం భావిస్తున్నామా? మనం దేవుని కోసం మంచి వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నామా, ఇతరులకు మాత్రమే చూడడానికి కాదు? 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |