Exodus - నిర్గమకాండము 27 | View All

1. మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.

1. mariyu ayidu moorala podugu ayidu moorala vedalpugala balipeetamunu thummakarrathoo neevu cheya valenu. aa balipeethamu chacchaukamugaa nundavalenu; daani yetthu moodu mooralu.

2. దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను.

2. daani naalugu moolalanu daaniki kommulanu cheyavalenu; daani kommulu daanithoo ekaandamugaa undavalenu; daaniki itthadi reku podigimpa valenu.

3. దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను.

3. daani boodide etthutaku kundalanu garitelanu ginnelanu mundlanu agnipaatralanu cheyavalenu. ee upa karanamulanniyu itthadithoo cheyavalenu.

4. మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.

4. mariyu valavanti itthadi jalleda daaniki cheyavalenu.

5. ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.

5. aa valameeda daani naalugu moolalanu naalugu itthadi ungaramulanu chesi aa vala balipeethamu nadimivaraku cherunatlu diguvanu balipeethamu gattu krinda daani nunchavalenu.

6. మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.

6. mariyu balipeethamukoraku mothakarralanu cheyavalenu. aa mothakarralanu thummakarrathoo chesi vaatiki itthadi reku podigimpavalenu.

7. ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను.

7. aa mothakarralanu aa ungaramulalo conapavalenu. balipeetamunu moyutaku aa mothakarralu daani renduprakkala nunda valenu.

8. పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.

8. palakalathoo gullagaa daani cheyavalenu; kondameeda neeku choopabadina polikagaane vaaru daani cheyavalenu.

9. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యౌవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

9. mariyu neevu mandiramunaku aavaranamu erparachavalenu. Kudivaipuna, anagaa dakshinadhikkuna aavaranamugaa nooru moorala podugugaladai penina sanna naara yauvanikalu oka prakkaku undavalenu.

10. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

10. daani yiruvadhi sthambhamulunu vaati yiruvadhi dimmalunu itthadivi; aa sthambhamula vankulunu vaati pendebaddalunu vendivi.

11. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యౌవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.

11. atle podugulo utthara dikkuna nooru moorala podugugala yauvanikalunda valenu. daani yiruvadhi sthambhamulunu vaati yiruvadhi dimmalunu itthadivi. aa sthambhamula vankulunu vaati pende baddalunu vendivi.

12. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది.

12. padamati dikkuna aavaranapu vedalpu koraku ebadhi moorala yauvanikalundavalenu; vaati sthambha mulu padhi vaati dimmalu padhi.

13. తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.

13. thoorpuvaipuna, anagaa udayadhikkuna aavaranapu vedalpu ebadhi mooralu.

14. ఒక ప్రక్కను పదునైదు మూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

14. oka prakkanu padunaidu moorala yauvanikalundavalenu; vaati sthambhamulu moodu vaati dimmalu moodu.

15. రెండవ ప్రక్కను పరునైదుమూరల యౌవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.

15. rendava prakkanu parunaidumoorala yauvanikalundavalenu; vaati sthambhamulu moodu vaati dimmalunu moodu.

16. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.

16. aavaranapu dvaaramunaku neela dhoomra rakthavarnamulugala yiruvadhi moorala tera yundavalenu. Avi penina sannanaarathoo chitrakaaruni panigaa undavalenu; vaati sthambhamulu naalugu vaati dimmalu naalugu.

17. ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.

17. aavaranamuchuttunna sthambhamulanniyu vendi pendebaddalu kalavi; vaati vankulu vendivi vaati dimmalu itthadivi.

18. ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.

18. aavaranapu podugu nooru mooralu; daani vedalpu ebadhimooralu daani yetthu ayidu mooralu; avi penina sannanaaravi vaati dimmalu itthadivi.

19. మందిరసంబంధమైన సేవోపకర ణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.

19. mandirasambandhamaina sevopakara namulanniyu mekulanniyu aavaranapu mekulanniyu itthadivai yundavalenu.

20. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము.

20. mariyu deepamu nityamu veliginchunatlu pradeepamunaku danchi theesina acchamu oleevala noone thevalenani ishraayelee yula kaagnaapinchumu.

21. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.
అపో. కార్యములు 7:44

21. saakshyapu mandasamu edutanunna teraku velupala pratyakshapu gudaaramulo aharonunu athani kumaarulunu saayankaalamu modalukoni udayamuvaraku yehovaa sannidhini daani savarimpavalenu. adhi ishraayeleeyulaku vaari tharatharamulavaraku nityamaina kattada.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
దహనబలుల బలిపీఠం. (1-8) 
ప్రజలు దేవుడిని ఆరాధించడానికి వెళ్ళే ప్రత్యేక గుడారం ముందు, వారు దేవునికి నైవేద్యాలు తెచ్చే ప్రత్యేక టేబుల్ ఉంది. ఇత్తడితో కప్పబడిన చెక్కతో టేబుల్ తయారు చేయబడింది. బల్ల మధ్యలో ఒక మెటల్ కిటికీలకు అమర్చే ఇనుప చట్రం ఉంది, అక్కడ వారు మంటలు వేసి నైవేద్యాలను కాల్చేవారు. కిటికీలకు అమర్చే ఇనుప చట్రం జల్లెడలా ఉంది, కాబట్టి బూడిద పడిపోతుంది. ఈ పట్టిక మన పాపాలను తీసివేయడానికి మరణించిన యేసును సూచిస్తుంది. ఇత్తడి కవచం లేకుండా, కలప కాలిపోయేది మరియు మన పాపాలకు శిక్షను భరించడానికి యేసుకు దేవుని సహాయం కావాలి. 

గుడారపు ఆస్థానం. (9-19) 
గుడారం చుట్టూ ఒక పెద్ద ప్రదేశం ఉంది, దానికి స్తంభాలకు తెరలు వేలాడుతూ ఉన్నాయి. ఇక్కడే యాజకులు మరియు లేవీయులు ప్రత్యేక వేడుకలు చేస్తారు మరియు యూదు ప్రజలు కూడా రావచ్చు. వివిధ రకాల చర్చిలు ఎలా ఉన్నాయో అదే విధంగా ఉంది, కానీ తమ హృదయాలతో దేవుణ్ణి విశ్వసించే వారు మాత్రమే అతనితో నిజంగా మాట్లాడగలరు. 

దీపాలకు నూనె. (20,21)
స్వచ్ఛమైన నూనె యేసు ద్వారా విశ్వాసులందరికీ దేవుడు ఇచ్చే ప్రత్యేక బహుమతి లాంటిది. ఇది మన వెలుగును ప్రకాశింపజేయడానికి మరియు ఇతరులకు మంచి ఉదాహరణగా ఉండటానికి సహాయపడుతుంది. దీపాలను చూసుకునే పూజారుల వలె, మనకు అర్థం చేసుకోవడానికి మరియు జ్ఞానోదయం కావడానికి బైబిల్‌ను బోధించడం మరియు వివరించడం పరిచారకుల పని. ఈ లైట్ ఇప్పుడు కేవలం ఒక సమూహ వ్యక్తుల కోసం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరినీ చేరుకోగలదు మరియు వారిని రక్షించడంలో సహాయపడటం మా అదృష్టం.



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |