Exodus - నిర్గమకాండము 39 | View All

1. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోను చేయు సేవనిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములుగల సేవావస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి.

1. All the gold that was employed for the works according to all the fabrication of the holy things, was from the gold of the offerings, twenty-nine talents, and seven hundred and twenty shekels according to the holy shekel.

2. మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను.

2. And the offering of silver from the men that were numbered of the congregation [was] a hundred talents, and a thousand seven hundred and seventy-five shekels, one drachma apiece, even the half shekel, according to the holy shekel.

3. నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి.

3. Everyone that passed the survey from twenty years old and upwards to the [number of] six hundred thousand, and three thousand five hundred and fifty.

4. దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.

4. And the hundred talents of silver went to the casting of the hundred chapiters of the tabernacle, and to the chapiters of the veil;

5. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

5. a hundred chapiters to the hundred talents, a talent to a chapiter.

6. మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధ పరచిరి. ముద్రలు చెక్కబడునట్లు ఇశ్రాయేలీయుల పేళ్లు వాటిమీద చెక్కబడెను.

6. And the thousand seven hundred and seventy-five shekels he formed into hooks for the pillars, and he overlaid their chapiters and adorned them.

7. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజములమీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

7. And the brass of the offering [was] seventy talents, and a thousand five hundred shekels;

8. మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారునిపనిగా పతకమును చేసెను.

8. and they made of it the bases of the door of the tabernacle of witness,

9. అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలది.

9. and the bases of the court round about, and the bases of the gate of the court, and the pins of the tabernacle, and the pins of the court

10. వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది;

10. round about; and the bronze appendage of the altar, and all the vessels of the altar, and all the instruments of the tabernacle of witness.

11. పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది;

11. And the children of Israel did as the Lord commanded Moses, so they did.

12. గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమునుగల పంక్తి మూడవది;

12. And of the gold that remained of the offering they made vessels to minister with before the Lord.

13. రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది; వాటివాటి పంక్తులలో అవి బంగారుజవలలో పొదిగింపబడెను.

13. And the blue that was left, and the purple, and the scarlet they made [into] garments of ministry for Aaron, so that he should minister with them in the sanctuary;

14. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేళ్ల చొప్పున, పండ్రెండు ముద్రలవలె చెక్కబడిన వారి పేళ్ల చొప్పున, పండ్రెండు గోత్రముల పేళ్ళు ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పేరు చెక్కబడెను.

14. and they brought the garments to Moses, and the tabernacle, and its furniture, its bases and its bars and the posts;

15. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి.

15. and the ark of the Covenant, and its bearers, and the altar and all its furniture.

16. వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి

16. And they made the anointing oil, and the incense of composition, and the pure lampstand,

17. అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలోవేసి

17. and its lamps, lamps for burning, and oil for the light,

18. అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండుజవలకు తగిలించి ఏఫోదు భుజ ఖండములమీద దాని యెదుట ఉంచిరి.

18. and the table of showbread, and all its furniture, and the showbread upon it,

19. మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసిరి.

19. and the garments of the sanctuary which belong to Aaron, and the garments of his sons, for the priestly ministry;

20. మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి.

20. and the curtains of the court, and the posts, and the veil of the door of the tabernacle, and the gate of the court,

21. ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

21. and all the vessels of the tabernacle and all its instruments: and the skins, even rams' skins dyed red, and the blue coverings, and the coverings of the other things, and the ins, and all the instruments for the works of the tabernacle of witness.

22. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచ రంధ్రమువలె ఉండెను.

22. Whatsoever things the Lord commanded Moses, so did the children of Israel make all the furniture.

23. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.

23. And Moses saw all the works; and they had done them all as the Lord commanded Moses, so had they made them; and Moses blessed them.

24. మరియు వారు చొక్కాయి అంచులమీద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి.

24. [This translation omits this verse.]

25. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్ల మధ్యను, అనగా ఆ చొక్కాయి అంచులమీద చుట్టునున్న దానిమ్మపండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి.

25. [This translation omits this verse.]

26. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచులమీద చుట్టు ఉంచిరి.

26. [This translation omits this verse.]

27. మరియయెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేతపనియైన సన్న నార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన

27. [This translation omits this verse.]

28. సన్ననార కుళ్లాయిలను పేనిన సన్ననార లాగులను

28. [This translation omits this verse.]

29. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటాపనియైన నడికట్టును చేసిరి.

29. [This translation omits this verse.]

30. మరియయెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధకిరీట భూషణము చేసిచెక్కిన ముద్రవలె దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి.

30. [This translation omits this verse.]

31. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.

31. [This translation omits this verse.]

32. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి.

32. [This translation omits this verse.]

33. అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటిని దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను,

33. [This translation omits this verse.]

34. ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను,

34. [This translation omits this verse.]

35. సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును,

35. [This translation omits this verse.]

36. బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,

36. [This translation omits this verse.]

37. పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటిని దీపముకొరకు తైలమును

37. [This translation omits this verse.]

38. బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలా ద్వారమునకు తెరను

38. [This translation omits this verse.]

39. ఇత్తడి బలిపీఠమును దానికుండు ఇత్తడి జల్లెడను దాని మోతకఱ్ఱలను దాని ఉపకరణములన్నిటిని, గంగాళమును దాని పీటను

39. [This translation omits this verse.]

40. ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవకొరకైన ఉపకరణములన్నిటిని, పరిశుద్ధస్థలములోని

40. [This translation omits this verse.]

41. యాజక సేవార్థమైన వస్త్రములను, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసికొని వచ్చిరి.

41. [This translation omits this verse.]

42. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి.

42. [This translation omits this verse.]

43. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.

43. [This translation omits this verse.]



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Exodus - నిర్గమకాండము 39 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
పూజారుల వస్త్రాలు. (1-31) 
గతంలో పూజారులు చర్చిలో నిజంగా ఫాన్సీ దుస్తులను ధరించేవారు. ఇది రాబోయే మంచి విషయాలకు చిహ్నంగా ఉంది, కానీ ఇప్పుడు మనకు గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ఉన్నాడు. యేసు మనలను రక్షించడానికి వచ్చినప్పుడు, మనకు సహాయం చేయడానికి సరైన వస్తువులను ధరించాడు. అతనికి ప్రత్యేక బహుమతులు ఉన్నాయి మరియు ఉద్యోగంలో చేరడానికి తగినంత ధైర్యం ఉంది. దేవుణ్ణి అనుసరించే వారందరినీ తన హృదయానికి దగ్గరగా ఉంచుకున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మరియు పవిత్రంగా చేయడానికి అతను ప్రతిదీ చేసాడు. యేసును విశ్వసించే వారు కూడా పూజారుల వంటివారే. వారు ఎల్లప్పుడూ సరైన పని చేయాలి మరియు వారి బట్టలు మంచి వస్తువులతో తయారు చేయాలి. మంచి విషయాలు దేవుడిని అనుసరించే వ్యక్తుల నుండి వచ్చే మంచితనం లాంటివి. ప్రకటన గ్రంథం 19:8 

గుడారం పూర్తయింది. (32-43)
గుడారం యేసుకు ప్రత్యేక చిహ్నంలా ఉంది. ప్రజలు దేవుని సన్నిధిని చూడగలిగే మరియు అనుభూతి చెందే ప్రదేశం. దేవుడు గుడారంలో ఎలా ఉన్నాడో అలాగే యేసు శరీరంలో కూడా జీవించాడు. యేసు ప్రత్యేకమైనవాడు ఎందుకంటే అతను మానవుడు మరియు దైవికుడు.  ప్రకటన గ్రంథం 21:3 మేఘాలు కనుమరుగై, దేవుణ్ణి మనం సరిగ్గా చూడగలిగినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి! అతని అనుచరులందరికీ ఇది అద్భుతమైన దృశ్యం. 



Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |