క్రమశిక్షణ, దిద్దుబాటు, సవరణ లేకపోతే పిల్లలు ఎదిగేకొద్దీ మూర్ఖులుగా, స్వార్థపరులుగా సానుభూతి లేనివారుగా తయారౌతారు, దేవుడు మనుషులపట్ల వ్యవహరించే తీరులు గ్రహించలేనివారౌతారు. క్రమశిక్షణలో పెట్టకపోవడం తమ స్వంత పిల్లలను ద్వేషించి వారిని చేజేతులా పాడు చెయ్యడంతో సమానం. ఈ విషయంలో అలక్ష్యం చేసేవారు తమ పిల్లలను కాదు, తమ్మును తామే ప్రేమించుకొంటున్నారు. నిజమైన ప్రేమ ఎప్పుడూ క్రమశిక్షణలో పెడుతుంది (సామెతలు 3:11-12; సామెతలు 19:18; సామెతలు 22:15; సామెతలు 23:13-14; సామెతలు 29:15, సామెతలు 29:17; హెబ్రీయులకు 12:6).