Isaiah - యెషయా 17 | View All

1. దమస్కును గూర్చిన దేవోక్తి

దమస్కు గురించి ఇతర భవిష్యద్వాక్కులకు యిర్మియా 49:23-27; ఆమోసు 1:3-5 చూడండి. దమస్కు సిరియా రాజధాని. సిరియా తరుచుగా ఇస్రాయేల్‌తో యుద్ధాలు చేసిన రాజ్యం (2 సమూయేలు 8:5; 1 రాజులు 20:1-3; 2 రాజులు 6:24). ఈ వచనంలోని ప్రవచనమింకా నెరవేరవలసి ఉంది.

2. దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను అది పాడై దిబ్బగానగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱెల మందలు మేయు తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.

3. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు.

యెషయా ఇవి రాసినప్పుడు ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్ (ఎఫ్రాయిం), సిరియాలు యూదాకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకొన్నాయి (యెషయా 7:1-2). అష్షూరువారు వచ్చి ఇస్రాయేల్‌ను జయించి దాని ప్రజలను బందీలుగా తీసుకు పోయినప్పుడు ఇస్రాయేల్ ఘనత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

4. ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించి పోవును వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును

5. చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును

“రెఫాయిం”– 1 దినవృత్తాంతములు 11:15. ఇది జెరుసలంకు పశ్చిమాన ఉంది.

6. అయినను ఒలీవచెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లుదానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ఇస్రాయేల్‌లో కొంతమంది మిగిలి ఉంటారు.

7. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు.

ఇలా చెయ్యడానికి మనుషులను పురిగొల్పేది (అది దేశవ్యాప్తంగా దాపురించిన సంకటం అయినా ఫర్వా లేదు) నిజంగా మంచిది.

8. మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును
ప్రకటన గ్రంథం 9:20

“బలిపీఠం”– ఇతర దేవుళ్ళకు. “ఆషేరా”– న్యాయాధిపతులు 3:7 దగ్గర నోట్స్.

9. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండ శిఖరముమీదను జనులు విడిచిపోయిన స్థలముల వలెనగును. ఆ దేశము పాడగును

యెహోషువ కాలంలో ఇస్రాయేల్‌వారు కనానువారిని వారి పట్టణాలనుంచి వెళ్ళగొట్టి తాము ఆక్రమించుకున్నారు. అయితే ఇస్రాయేల్‌వారంతా అష్షూరు దేశానికి ప్రవాసం వెళ్ళిపోతారు. గనుక వారు అలా ఆక్రమించుకున్న పట్టణాలే నిర్జనమౌతాయి.

10. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసికొన లేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి

“మరచిపోయావు”– ఇది ఇస్రాయేల్‌వారి నీచ పాపాల్లో ఒకటి (యిర్మియా 13:24-25; యిర్మియా 18:15-16).

11. నీవు నాటిన దినమున దాని చుట్టు కంచె వేసితివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసితివి గొప్ప గాయములును మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును.

12. ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటమువలె ఆర్భటించును.జనములు ప్రవాహజలముల ఘోషవలె ఘోషించును

యెషయా 10:28-34. ఇది బహుశా అష్షూరు సైన్యం యూదాను ముట్టడించి జెరుసలం దగ్గర హఠాత్తుగా పతనం అయిన సందర్భం గురించిన వర్ణన.

13. జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.

“ఆయన”– అంటే దేవుడు.

14. సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయము కాకమునుపు లేకపోవుదురు ఇదే మమ్మును దోచుకొనువారి భాగము, మా సొమ్ము దొంగిలువారికి పట్టు గతి యిదే.

తన ప్రజలు తన పై నమ్మకం పెట్టుకుంటే దేవుడు వారి శత్రువులను కనురెప్పపాటులో మట్టుపెట్టగలడు!



Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |