Isaiah - యెషయా 32 - గ్రంథ విశ్లేషణ

1. ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.
యోహాను 1:49, యోహాను 18:37, 1 కోరింథీయులకు 15:25

ఉన్నట్టుండి మరోసారి భూమిపై క్రీస్తు రాజ్యం కనిపిస్తూవుంది (యెషయా 2:1-4; యెషయా 4:2-6; యెషయా 9:7; యెషయా 11:1-16; యెషయా 24:23).

2. మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.

ఈ వచనంలోని “మనిషి” బహుశా 1వ వచనంలోని రాజే. ఈ రెండు పదాలూ దైవ మానవుడైన క్రీస్తు యేసును ఉద్దేశించి రాసినవి. ఇక్కడ “మనిషి” అనే పదం ఆయన మానవావతారాన్ని సూచిస్తున్నది (యెషయా 7:14; యెషయా 9:6-7; యోహాను 1:1, యోహాను 1:14). “ఆశ్రయం”– యెషయా 25:4. క్రీస్తు తప్ప మరెవరైనా తన ప్రజలకు ఆశ్రయంగా, నీడగా ఉండగలరా? (Psa 2:12; Psa 91:2; హెబ్రీయులకు 6:18). లేక నీళ్ళ కాలువలాగా ఆయన గాక మరెవరుంటారు? (యోహాను 4:13-14; యోహాను 7:37, యోహాను 7:39).

3. చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.

4. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

ఆ రోజున మానవుల శరీరాల్లోనూ, మనసుల్లోనూ గొప్ప మార్పు కనిపిస్తుంది. “అర్థం అవుతుంది”– యెషయా 11:9; యెషయా 29:24; యెషయా 41:20; యెషయా 60:16; Jer 31:33-34.

5. మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.

బైబిల్లో మూర్ఖుడు అనే పదం ఆత్మ, నీతి విషయాల్లో ఆధ్యాత్మికమైన గ్రహింపు లేని వ్యక్తిని సూచించేందుకు వాడారు. Psa 14:1; సామెతలు 1:7 నోట్. ఆ రోజుల్లో ఇలాంటి మూర్ఖులు, వంచకులు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలతో చెలామణీ అవుతుండేవారు. ఇప్పటికీ ఇదేమీ మారలేదు. రాబోయే క్రీస్తు రాజ్యంలోనైతే ఇలాంటి అవివేకులకు, మూర్ఖులకు గౌరవ మర్యాదలు లభించడం ఉండవు.

6. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.

బైబిల్లో “మూర్ఖుడి”కి ఉన్న మిగతా వర్ణనల లాంటిదే ఇది కూడా. వాడు తెలివి లేకుండా మాట్లాడతాడు (యెషయా 29:15-16; Psa 14:1). తెలివి లేకుండా ఆలోచిస్తాడు. తెలివి లేకుండా పనులు చేస్తాడు. తాను చేయకుండా మానుకునేదాన్లోకూడా తన మూర్ఖతను బయట పెట్టుకుంటాడు (మత్తయి 25:31-33, మత్తయి 25:41-46).

7. మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.

వంచకులు మూర్ఖుల కంటే పెద్ద మూర్ఖులు. దేవుని ప్రపంచంలో తమ ఇష్టం వచ్చినట్టుగా జీవించి కూడా దేవుని తీర్పునుండి తప్పించుకోవచ్చులే అని ఊహాగానం చేస్తారు.

8. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.

మూర్ఖుడులాగానే, వంచకుడులాగానే ఘనబుద్ధి గలవాణ్ణి కూడా అతని ఆలోచనలు, చర్యలవల్లనే తెలుసుకోవచ్చు (మత్తయి 7:16-20; మొ।।). “నిలిచి”– Psa 15:5; Psa 16:8; Psa 55:22.

9. సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.

10. నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.

బహుశా క్రీ.పూ. 701లో అష్షూరు సైన్యాలు దాడి చేసిన సందర్భం కావచ్చు. కొంత కాలం పాటు ఆ సైన్యాలు జెరుసలం పరిసరాల్లోని భూభాగాన్ని స్వాధీనం చేసుకొని తమ ఇష్టం వచ్చినట్టు కావలసినవాటిని తీసుకొన్నారు లేక నాశనం చేశారు.

11. సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.

ఏడ్చి మొత్తుకొనేందుకు తగిన గొప్ప కారణం ఉంటుందని హెచ్చరిక.

12. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు.

13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు

14. నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును

అష్షూరు దాడి సమయంలో జరిగినదేదీ దీనితో సరిపోవడం లేదు. కాబట్టి ఈ వచనాలు భవిష్యత్తులో నెరవేరవలసి ఉంది. ఇక్కడ రాసిన సంభవాలేవీ అప్పుడు జరగలేదు. రాబోయే కాలంలో జరగబోయే దానికి అష్షూరువారి ముట్టడి ఒక హెచ్చరిక మాత్రమే.

15. అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.

16. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును

17. నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
యాకోబు 3:18

Psa 85:10; Psa 119:165; రోమీయులకు 5:1 మొ।।. లోకంలో సమాధానం, మనస్సులో శాంతి, హృదయంలో నెమ్మది, దేవుని పట్ల నిశ్చల విశ్వాసం ఇవి మానవ ప్రయత్నాలవల్ల రావు, రాలేవు.

18. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును

ఆనాటినుండి నేటివరకు ఇది ఇస్రాయేల్ విషయంలో నిజం కాలేదు. అయితే తప్పక నెరవేరుతుంది (వ 1,2).

19. పట్టణము నిశ్చయముగా కూలిపోవును.

Psa 46:1-3 పోల్చి చూడండి. “పట్టణం”– యెషయా 24:10, యెషయా 24:12; యెషయా 25:2; యెషయా 26:5.

20. సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.

“ధన్యజీవులు”– Psa 1:1-3; Psa 119:1 నోట్స్ చూడండి. ఇక్కడ సమృద్ధి, భద్రత, ఆనందానుభవం కనిపిస్తున్నాయి.