Isaiah - యెషయా 60 | View All

1. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
ఎఫెసీయులకు 5:14, లూకా 1:78-79, యోహాను 1:14, ప్రకటన గ్రంథం 21:11-23

1. “నా వెలుగైన యెరూషలేమా లెమ్ము! నీ వెలుగు (దేవుడు) వస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది.

2. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
ప్రకటన గ్రంథం 21:24, లూకా 1:78-79, యోహాను 1:14, ప్రకటన గ్రంథం 21:11-23

2. ఇప్పుడు భూమిని, దాని ప్రజలను చీకటి ఆవరించి ఉంది. కానీ యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు. నీ చుట్టూరా ఆయన మహిమను ప్రజలు చూస్తారు.

3. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.
ప్రకటన గ్రంథం 21:24

3. ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి. ప్రకాశవంతమైన నీ వెలుగు దగ్గరకు రాజులు వస్తారు.

4. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.

4. నీ చుట్టూ చూడు, చూడు ప్రజలు చూట్టూ చేరి, నీ దగ్గరకు వస్తున్నారు. ఆ ప్రజలు దూరం నుండి వస్తున్న నీ కుమారులు. మరియు వారితో నీ కుమార్తెలు వస్తున్నారు.

5. నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.
ప్రకటన గ్రంథం 21:24

5. భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నీ ప్రజలను నీవు చూస్తావు. ఆనందంతో మీ ముఖాలు ప్రకాశిస్తాయి. మొదట, మీరు భయపడతారు, కానీ తర్వాత మీరు సంబరపడతారు. సముద్రాల ఆవలి రాజ్యాల ఐశ్వర్యాలన్నీ నీ ముందు ఉంచబడతాయి. రాజ్యాల ఐశ్వర్యాలు నీకు సంక్రమిస్తాయి.

6. ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె లును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.
మత్తయి 2:11

6. “మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు నీ దేశంలో నిండిపోతాయి. షేబనుండి ఒంటెలు బారులు తీరి వస్తాయి. బంగారం, బోళం అవి తెస్తాయి. ప్రజలు యెహోవాకు స్తుతులు పాడతారు.

7. నీ కొరకు కేదారు గొఱ్ఱమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
మత్తయి 21:13

7. కేదారు గొర్రెలు అన్నీ నీకు ఇవ్వబడుతాయి. నెబాయోతు పొట్టేళ్లు నీకోసం తీసుకొని రాబ డతాయి. అవి నా బలిపీఠం మీద స్వీక రించదగిన బలి అర్పణలవుతాయి. ఆశ్చర్యకరమైన నా ఆలయాన్ని నేను ఇంకా అందంగా తీర్చిదిద్దుతాను.

8. మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?

8. “ప్రజలను చూడు! ఆకాశాన్ని వేగంగా దాటిపోయే మేఘాల్లా వారు త్వరపడుతున్నారు. వాటి గూళ్లకు ఎగిరిపోతున్న పావురాల్లా ఉన్నారు వారు

9. నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.

9. దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి. తర్షీషు మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి. మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు తీసుకొని వస్తాయి. నీ దేవుడు యెహోవాను గౌరవించుటకు ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఇది జరుగుతుంది.

10. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
ప్రకటన గ్రంథం 21:24-25

10. ఇతర దేశాలనుండి వచ్చిన పిల్లలు నీ గోడలను తిరిగి నిర్మిస్తారు. వారి రాజులు నిన్ను సేవిస్తారు. “నేను కోపగించినప్పుడు, నేను నిన్ను బాధించాను. కానీ ఇప్పుడు, నేను నీకు దయచూపించ గోరుతున్నాను. కనుక నేను నిన్ను ఆదరిస్తాను.

11. నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
ప్రకటన గ్రంథం 21:24-25

11. నీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయి. రాత్రిగాని పగలుగాని అవి మూయబడవు. రాజులు, రాజ్యాలు వారి ఐశ్వర్యాలను నీకు తీసుకొని వస్తారు.

12. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.

12. కొన్ని దేశాలు, రాజ్యాలు నిన్ను సేవించవు. కానీ ఆ దేశాలు, రాజ్యాలు పాడైపోయి, నాశనం అవుతాయి.

13. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.

13. “లెబానోనులోని గొప్పవన్నియు నీకు ఇవ్వబడుతాయి. దేవదారు, సరళ, గొంజి వృక్షాలను ప్రజలు నీ వద్దకు తీసుకొని వస్తారు. నా పరిశుద్ధ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నీవు ఈ వృక్షాలను ఉపయోగిస్తావు. (ఈతావు నా సింహాసనం ఎదుట పాదపీఠంలా ఉంటుంది. నేను దానికి చాలా ఘనత ఇస్తాను.)

14. నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.
ప్రకటన గ్రంథం 3:9

14. గతంలో ప్రజలు నిన్ను బాధించారు. ఆ ప్రజలు నీ ఎదుట సాష్టాంగపడతారు. గతంలో ప్రజలు నిన్ను ద్వేషించారు. ఆ ప్రజలు నీ పాదాల దగ్గర సాగిలపడతారు. ‘యెహోవా పట్టణం’ అని ‘ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను’ అనీ ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు.”

15. నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.

15. “నీవు మళ్లీ ఎన్నటికీ ఒంటరిగా విడువబడవు. నీవు మరల ఎన్నడు ద్వేషించబడవు. నీవు మరల ఎన్నడూ ఖాళీగా ఉండవు. నిన్ను నేను శాశ్వతంగా గొప్ప చేస్తాను. నీవు ఎప్పటికి, శాశ్వతంగా సంతోషిస్తావు.

16. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.

16. నీకు అవసరమైన వస్తువులను రాజ్యాలు నీకు ఇస్తాయి. అది ఒక బిడ్డ తన తల్లి దగ్గర పాలు తాగినట్టుగా ఉంటుంది. నీవైతే రాజులనుండి ఐశ్వర్యాలను తాగుతావు. అప్పుడు, నిన్ను రక్షించు యెహోవాను నేనే అని నీవు తెలుసు కొంటావు. యాకోబు యొక్క మహా గొప్పవాడు నిన్ను కాపాడును అని నీవు తెలుసుకొంటావు.

17. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగానునీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.

17. “ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది. నేను నీకు బంగారం తెస్తాను. ఇప్పుడు నీకు ఇనుము ఉంది, నేను నీకు వెండి తెస్తాను. నీ చెక్కను నేను ఇత్తడిగా మార్చేస్తాను. నీ బండలను ఇనుముగా నేను మార్చేస్తాను. నీ శిక్షను నేను శాంతిగా మార్చేస్తాను. ఇప్పుతు ప్రజలు నిన్ను బాధిస్తున్నారు. కానీ ప్రజలు నీకు మంచి కార్యాలు చేస్తారు.

18. ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.

18. ప్రజలు మరల ఎన్నడూ నీ ఎడల నీచంగా ఉండరు. నీ దేశంలో నీ దగ్గర్నుండి ప్రజలు మరల ఎన్నడూ దొంగిలించరు. ‘రక్షణ’ అని నీ గోడలకు నీవు పేరుపెడతావు. ‘స్తుతి’ అని నీ ద్వారాలకు నీవు పేరుపెడతావు.

19. ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.
ప్రకటన గ్రంథం 21:11-23, ప్రకటన గ్రంథం 22:5

19. ఇంకెంత మాత్రం పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు. చంద్రకాంతి ఇంకెంత మాత్రం నీకు వెలుగుగా ఉండదు. ఎందుకు? ఎందుకంటే యెహోవాయే నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు. నీ దేవుడే నీ మహిమ.

20. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.

20. నీ ‘సూర్యుడు’ ఇక ఎన్నటికీ అస్తమించడు. నీ ‘చంద్రుడు’ ఇక ఎన్నటికీ చీకటిగా ఉండడు. ఎందుకు? ఎందుకంటే యెహోవా నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు. మరియు నీ దుఃఖకాలం అంతం అవుతుంది.

21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.
2 పేతురు 3:13

21. నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు. ఆ ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు. నేనే ఆ ప్రజలను చేశాను. నా స్వహస్తాలతో నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు.

22. వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.

22. అతి చిన్న కుటుంబం ఒక పెద్ద వంశం అవుతుంది. కడసారపు వ్యక్తి ఒక బలమైన రాజ్యం అవుతాడు. సమయం సరిగ్గా ఉన్నప్పుడు, యెహోవాను, నేను త్వరగా వస్తాను. నేను ఈ సంగతులను జరిగిస్తాను.’Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |