Jeremiah - యిర్మియా 11 | View All

1. యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

1. The word that came to Jeremiah from the LORD, saying,

2. మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను

2. 'Hear ye the words of this covenant, and speak unto the men of Judah and to the inhabitants of Jerusalem;

3. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లనివాడు శాపగ్రస్తుడగును.

3. and say thou unto them, `Thus saith the LORD God of Israel: Cursed be the man that obeyeth not the words of this covenant,

4. ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తినినేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.

4. which I commanded your fathers in the day that I brought them forth out of the land of Egypt from the iron furnace, saying, 'Obey My voice, and do them, according to all which I command you; so shall ye be My people and I will be your God,'

5. అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని.

5. that I may perform the oath which I have sworn unto your fathers to give them a land flowing with milk and honey, as it is this day.'' Then answered I, and said, 'So be it, O LORD.'

6. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా - నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుముమీరు ఈ నిబంధన వాక్యములను విని వాటి ననుసరించి నడుచుకొనుడి.

6. Then the LORD said unto me, 'Proclaim all these words in the cities of Judah and in the streets of Jerusalem, saying, `Hear ye the words of this covenant and do them.

7. ఐగుప్తులోనుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని

7. For I earnestly protested unto your fathers in the day that I brought them up out of the land of Egypt, even unto this day, rising early and protesting, saying, 'Obey My voice.'

8. అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారి కాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటిననుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటి నన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.

8. Yet they obeyed not, nor inclined their ear, but walked every one in the imagination of their evil heart. Therefore I will bring upon them all the words of this covenant, which I commanded them to do, but they did them not.''

9. మరియయెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది.

9. And the LORD said unto me, 'A conspiracy is found among the men of Judah and among the inhabitants of Jerusalem.

10. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.

10. They have turned back to the iniquities of their forefathers, who refused to hear My words, and they went after other gods to serve them. The house of Israel and the house of Judah have broken My covenant which I made with their fathers.

11. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవు చున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును.

11. Therefore thus saith the LORD: `Behold, I will bring evil upon them, which they shall not be able to escape; and though they shall cry unto Me, I will not hearken unto them.

12. యూదాపట్టణస్థులును యెరూష లేము నివాసులును పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు.

12. Then shall the cities of Judah and inhabitants of Jerusalem go and cry unto the gods unto whom they offer incense; but they shall not save them at all in the time of their trouble.

13. యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి.

13. For according to the number of thy cities were thy gods, O Judah; and according to the number of the streets of Jerusalem have ye set up altars to that shameful thing, even altars to burn incense unto Baal.'

14. కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.

14. 'Therefore pray not thou for this people, neither lift up a cry or prayer for them; for I will not hear them in the time that they cry unto Me for their trouble.

15. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.
ప్రకటన గ్రంథం 20:9

15. What hath My beloved to do in Mine house, seeing she hath wrought lewdness with many, and the holy flesh is passed from thee? When thou doest evil, then thou rejoicest.

16. అది చక్కని ఫలముగల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను; గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి.

16. The LORD called thy name, `A Green Olive Tree,' fair and of goodly fruit. With the noise of a great tumult He hath kindled fire upon it, and the branches of it are broken.

17. ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమంతట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొని యున్నాడు.

17. For the LORD of hosts, who planted thee, hath pronounced evil against thee for the evil of the house of Israel and of the house of Judah, which they have done against themselves to provoke Me to anger in offering incense unto Baal.'

18. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన వారి క్రియలను నాకు కనుపరచెను.

18. And the LORD hath given me knowledge of it, and I know it; then Thou showed me their doings.

19. అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱెపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.

19. But I was like a lamb or an ox that is brought to the slaughter; and I knew not that they had devised devices against me, saying, 'Let us destroy the tree with the fruit thereof, and let us cut him off from the land of the living, that his name may be no more remembered.'

20. నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము.
1 థెస్సలొనీకయులకు 2:4, ప్రకటన గ్రంథం 2:23

20. But, O LORD of hosts, who judgest righteously, who triest the reins and the heart, let me see Thy vengeance on them, for unto Thee have I revealed my cause.

21. కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు

21. 'Therefore thus saith the LORD of the men of Anathoth, who seek thy life, saying, `Prophesy not in the name of the LORD, that thou die not by our hand'--

22. సైన్యముల కధిపతియగు యెహోవా వారినిగూర్చి సెలవిచ్చునదేమనగానేను వారిని శిక్షింపబోవుచున్నాను, వారి ¸యౌవనులు ఖడ్గముచేత చంపబడెదరు, వారి కుమారులును కూమార్తెలును క్షామమువలన చచ్చెదరు;

22. therefore thus saith the LORD of hosts: `Behold, I will punish them: the young men shall die by the sword, their sons and their daughters shall die by famine.

23. వారికి శేషమేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సర మున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.

23. And there shall be no remnant of them; for I will bring evil upon the men of Anathoth, even the year of their visitation.''



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అవిధేయులైన యూదులు మందలించారు. (1-10) 
తన హేతుబద్ధమైన జీవులు ఉద్దేశపూర్వకంగా అవిధేయతను కొనసాగించినంత కాలం వారిపై ఆశీర్వాదాలను కురిపిస్తానని దేవుడు ఎప్పుడూ హామీ ఇవ్వలేదు. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ క్షమాపణ మరియు అంగీకారం ఖర్చు లేకుండా అందించబడుతుంది, అయితే పశ్చాత్తాపపడమని, క్రీస్తును విశ్వసించమని, పాపం మరియు ప్రాపంచిక ప్రలోభాలకు దూరంగా ఉండమని, స్వీయ-తిరస్కరణను స్వీకరించి, ఆలింగనం చేసుకోవాలనే దేవుని ఆజ్ఞను పట్టించుకోని వారికి మోక్షం అందుబాటులో ఉండదు. పునరుద్ధరించిన జీవితం. సాధారణంగా, ప్రజలు సిద్ధాంతాలు, వాగ్దానాలు మరియు అధికారాల గురించి చర్చించే వారి మాట వినడానికి ఇష్టపడతారు, కానీ విధుల విషయానికి వస్తే, వారు చెవిటి చెవికి మొగ్గు చూపుతారు.

వారి పూర్తి వినాశనం. (11-17) 
చెడు అనేది పాపులను కనికరం లేకుండా వెంబడిస్తూ, తప్పించుకోవడం అసాధ్యం అనిపించే ఉచ్చులలో వారిని బంధిస్తుంది. వారి కష్టాల సమయంలో, వారి దేవతలు మరియు బలిపీఠాలు వారికి ఎటువంటి సహాయం అందించవు. ఎవరి ప్రార్థనలకు సమాధానం దొరకని వారు కూడా ఇతరుల ప్రార్థనల నుండి ప్రయోజనం పొందాలని ఆశించలేరు. మతం యొక్క వారి బాహ్య వృత్తి వ్యర్థమని రుజువు చేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, వారు ఈ తప్పుడు విశ్వాసంపై నమ్మకం ఉంచారు, కానీ దేవుడు దానిని తిరస్కరించాడు. అతని బలిపీఠం వారికి ఎలాంటి సంతృప్తిని ఇవ్వదు. దేవుని గత ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవడం కష్ట సమయాల్లో ఓదార్పునివ్వదు మరియు వాటిని ఆయన స్మరించుకోవడం ఉపశమనానికి ఒక విన్నపంగా ఉపయోగపడదు. ప్రభువుకు వ్యతిరేకంగా చేసే ప్రతి అతిక్రమణ చివరికి తనకు తాను చేసిన అతిక్రమమే, ఇది త్వరలోనే లేదా తరువాత స్పష్టంగా తెలుస్తుంది.

ప్రవక్త ప్రాణాలను కోరిన ప్రజలు నాశనం చేయబడతారు. (18-23)
ప్రవక్త యిర్మీయా తన సొంత జీవితం గురించి చాలా పంచుకున్నాడు, ఇది అల్లకల్లోలమైన సమయాల్లో గుర్తించబడింది. అతని స్వగ్రామంలో, అతని జీవితాన్ని తీయడానికి కుట్ర పన్నిన వారు ఉన్నారు, అతని రోజులను ముందుగానే ముగించాలని ప్రయత్నించారు. అయినప్పటికీ, అతను తన ప్రత్యర్థులలో చాలా మందిని మించిపోయాడు. అతని జ్ఞాపకశక్తిని దెబ్బతీయడానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, ఎందుకంటే అది ఈనాటికీ కొనసాగుతుంది మరియు కాలం కొనసాగినంత కాలం గౌరవించబడుతుంది.
యిర్మీయా శత్రువులు మరియు అతని ప్రజల శత్రువులు దాచిన పన్నాగాల గురించి దేవునికి పూర్తిగా తెలుసు. అతను ఎంచుకున్నప్పుడు, ఈ ప్రణాళికలను వెలుగులోకి తీసుకురాగలడు. దేవుని న్యాయం దుష్టులకు భయాన్ని కలిగిస్తుంది కానీ నీతిమంతులకు ఓదార్పునిస్తుంది. మనకు అన్యాయం జరిగినప్పుడు, మన కారణాన్ని మనం అప్పగించగల దేవుడు మనకు ఉంటాడు మరియు అలా చేయడం మన కర్తవ్యం. ఇంకా, మనం చెడుకు లొంగిపోకుండా చూసుకుంటూ, మన స్వంత ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. బదులుగా, మన శత్రువుల కోసం ప్రార్థించడంలో మరియు వారి పట్ల దయ చూపడంలో ఓపిక పట్టుదల ద్వారా, మనం మంచితనంతో చెడును జయించగలము.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |