Jeremiah - యిర్మియా 32 | View All

1. యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

1. The word that came to Jeremiah from the LORD in the tenth year of King Zedekiah of Judah, which was the eighteenth year of Nebuchadrezzar.

2. ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,

2. At that time the army of the king of Babylon was besieging Jerusalem, and the prophet Jeremiah was confined in the court of the guard that was in the palace of the king of Judah,

3. యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతనిచూచును,

3. where King Zedekiah of Judah had confined him. Zedekiah had said, Why do you prophesy and say: Thus says the LORD: I am going to give this city into the hand of the king of Babylon, and he shall take it;

4. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు;

4. King Zedekiah of Judah shall not escape out of the hands of the Chaldeans, but shall surely be given into the hands of the king of Babylon, and shall speak with him face to face and see him eye to eye;

5. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను.

5. and he shall take Zedekiah to Babylon, and there he shall remain until I attend to him, says the LORD; though you fight against the Chaldeans, you shall not succeed?

6. అంతట యిర్మీయా ఇట్లనెను యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
మత్తయి 27:9-10

6. Jeremiah said, The word of the LORD came to me:

7. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.

7. Hanamel son of your uncle Shallum is going to come to you and say, Buy my field that is at Anathoth, for the right of redemption by purchase is yours.

8. కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని

8. Then my cousin Hanamel came to me in the court of the guard, in accordance with the word of the LORD, and said to me, Buy my field that is at Anathoth in the land of Benjamin, for the right of possession and redemption is yours; buy it for yourself. Then I knew that this was the word of the LORD.

9. నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి ఆతనికిచ్చితిని.

9. And I bought the field at Anathoth from my cousin Hanamel, and weighed out the money to him, seventeen shekels of silver.

10. నేను క్రయ పత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి

10. I signed the deed, sealed it, got witnesses, and weighed the money on scales.

11. క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.

11. Then I took the sealed deed of purchase, containing the terms and conditions, and the open copy;

12. అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహ సేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించి తిని.

12. and I gave the deed of purchase to Baruch son of Neriah son of Mahseiah, in the presence of my cousin Hanamel, in the presence of the witnesses who signed the deed of purchase, and in the presence of all the Judeans who were sitting in the court of the guard.

13. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా

13. In their presence I charged Baruch, saying,

14. ఈ పత్రములను, అనగా ముద్రగల యీ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును, నీవు తీసికొని అవి బహుదినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టుము.

14. Thus says the LORD of hosts, the God of Israel: Take these deeds, both this sealed deed of purchase and this open deed, and put them in an earthenware jar, in order that they may last for a long time.

15. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును.

15. For thus says the LORD of hosts, the God of Israel: Houses and fields and vineyards shall again be bought in this land.

16. నేరీయా కుమారుడైన బారూకుచేతికి ఆ క్రయ పత్రమును నేనప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని

16. After I had given the deed of purchase to Baruch son of Neriah, I prayed to the LORD, saying:

17. యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.

17. Ah Lord GOD! It is you who made the heavens and the earth by your great power and by your outstretched arm! Nothing is too hard for you.

18. నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.

18. You show steadfast love to the thousandth generation, but repay the guilt of parents into the laps of their children after them, O great and mighty God whose name is the LORD of hosts,

19. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.

19. great in counsel and mighty in deed; whose eyes are open to all the ways of mortals, rewarding all according to their ways and according to the fruit of their doings.

20. నీవు ఐగుప్తుదేశములో చేసినట్టు నేటివరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు.

20. You showed signs and wonders in the land of Egypt, and to this day in Israel and among all humankind, and have made yourself a name that continues to this very day.

21. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహా బలముకలిగి, చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి, ఐగుప్తు దేశములోనుండి నీ ప్రజలను రప్పించి

21. You brought your people Israel out of the land of Egypt with signs and wonders, with a strong hand and outstretched arm, and with great terror;

22. మీ కిచ్చెదనని వారి పితరులకు ప్రమాణముచేసి, పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారి కిచ్చితివి.

22. and you gave them this land, which you swore to their ancestors to give them, a land flowing with milk and honey;

23. వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి. వారు చేయవలె నని నీవాజ్ఞాపించినవాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నావు.

23. and they entered and took possession of it. But they did not obey your voice or follow your law; of all you commanded them to do, they did nothing. Therefore you have made all these disasters come upon them.

24. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా?

24. See, the siege ramps have been cast up against the city to take it, and the city, faced with sword, famine, and pestilence, has been given into the hands of the Chaldeans who are fighting against it. What you spoke has happened, as you yourself can see.

25. యెహోవా ప్రభువాధనమిచ్చి యీ పొలమును కొను క్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెల విచ్చితివి, అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింప బడుచున్నది.

25. Yet you, O Lord GOD, have said to me, Buy the field for money and get witnesses-- though the city has been given into the hands of the Chaldeans.

26. అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

26. The word of the LORD came to Jeremiah:

27. నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?

27. See, I am the LORD, the God of all flesh; is anything too hard for me?

28. కావున యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవు చున్నాను; అతడు దాని పట్టుకొనగా

28. Therefore, thus says the LORD: I am going to give this city into the hands of the Chaldeans and into the hand of King Nebuchadrezzar of Babylon, and he shall take it.

29. ఈ పట్టణము మీద యుద్ధముచేయు కల్దీయులు వచ్చి, యీ పట్టణమునకు అగ్ని ముట్టించి, యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసె దరు.

29. The Chaldeans who are fighting against this city shall come, set it on fire, and burn it, with the houses on whose roofs offerings have been made to Baal and libations have been poured out to other gods, to provoke me to anger.

30. ఏలయనగా ఇశ్రాయేలువారును యూదావారును తమ బాల్యము మొదలుకొని నాయెదుట చెడుతనమే చేయుచు వచ్చుచున్నారు, తమ చేతుల క్రియవలన వారు నాకు కోపమే పుట్టించువారు; ఇదే యెహోవా వాక్కు.

30. For the people of Israel and the people of Judah have done nothing but evil in my sight from their youth; the people of Israel have done nothing but provoke me to anger by the work of their hands, says the LORD.

31. నా కోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదా వారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంతటినిబట్టి,

31. This city has aroused my anger and wrath, from the day it was built until this day, so that I will remove it from my sight

32. నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను.

32. because of all the evil of the people of Israel and the people of Judah that they did to provoke me to anger-- they, their kings and their officials, their priests and their prophets, the citizens of Judah and the inhabitants of Jerusalem.

33. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపక పోయిరి, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి.

33. They have turned their backs to me, not their faces; though I have taught them persistently, they would not listen and accept correction.

34. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైనవాటిని పెట్టిరి.

34. They set up their abominations in the house that bears my name, and defiled it.

35. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్టింపవలెనని బెన్‌ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠము లను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.

35. They built the high places of Baal in the valley of the son of Hinnom, to offer up their sons and daughters to Molech, though I did not command them, nor did it enter my mind that they should do this abomination, causing Judah to sin.

36. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణ మునుగూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడు అది ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను పీడింపబడినదై బబులోనురాజు చేతికి అప్పగింపబడునని మీరీ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు గదా.

36. Now therefore thus says the LORD, the God of Israel, concerning this city of which you say, It is being given into the hand of the king of Babylon by the sword, by famine, and by pestilence:

37. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను.

37. See, I am going to gather them from all the lands to which I drove them in my anger and my wrath and in great indignation; I will bring them back to this place, and I will settle them in safety.

38. వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
2 కోరింథీయులకు 6:16

38. They shall be my people, and I will be their God.

39. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును.

39. I will give them one heart and one way, that they may fear me for all time, for their own good and the good of their children after them.

40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
లూకా 22:20, 1 కోరింథీయులకు 11:25, 2 కోరింథీయులకు 3:6, హెబ్రీయులకు 13:20

40. I will make an everlasting covenant with them, never to draw back from doing good to them; and I will put the fear of me in their hearts, so that they may not turn from me.

41. వారికి మేలుచేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను.

41. I will rejoice in doing good to them, and I will plant them in this land in faithfulness, with all my heart and all my soul.

42. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేెెను ఈ ప్రజలమీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారినిగూర్చి చెప్పిన మేలంత టిని వారిమీదికి రప్పింపబోవుచున్నాను.

42. For thus says the LORD: Just as I have brought all this great disaster upon this people, so I will bring upon them all the good fortune that I now promise them.

43. ఇది పాడై పోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయులచేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును.

43. Fields shall be bought in this land of which you are saying, It is a desolation, without human beings or animals; it has been given into the hands of the Chaldeans.

44. నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.

44. Fields shall be bought for money, and deeds shall be signed and sealed and witnessed, in the land of Benjamin, in the places around Jerusalem, and in the cities of Judah, of the hill country, of the Shephelah, and of the Negeb; for I will restore their fortunes, says the LORD.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 32 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యిర్మీయా ఒక పొలాన్ని కొంటాడు. (1-15) 
యిర్మీయా తన ప్రవచనాత్మక చర్యల కోసం జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు, జెరూసలేం ముట్టడి కొనసాగుతున్నప్పటికీ మరియు భూమిని నాశనం చేస్తున్నప్పటికీ, ప్రజలు మళ్లీ ఇళ్లలో నివసించే, పొలాలను పండించే సమయం వస్తుందని అతని నమ్మకానికి ప్రతీకగా ఒక భూమిని సంపాదించాడు. ద్రాక్షతోటలు మేపు. మంత్రులకు వారు ఇతరులకు అందించే సందేశాలపై వారి అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలలో కూడా దేవుని ప్రావిడెన్స్ మరియు వాగ్దానాలపై నమ్మకంతో మన చర్యలను సమలేఖనం చేస్తూ, మన రోజువారీ వ్యవహారాలను విశ్వాసంతో నిర్వహించడం కూడా అభినందనీయం.

ప్రవక్త ప్రార్థన. (16-25) 
లార్డ్ మరియు అతని అపరిమితమైన పరిపూర్ణత పట్ల యిర్మీయా యొక్క ప్రగాఢమైన గౌరవం స్పష్టంగా కనిపిస్తుంది. దైవిక ప్రావిడెన్స్ యొక్క మార్గాల ద్వారా మనం కలవరపడినప్పుడల్లా, ప్రాథమిక సత్యాలకు తిరిగి రావడం ప్రయోజనకరం. అస్తిత్వానికి, శక్తికి, ప్రాణశక్తికి దేవుడే మూలమని, ఆయనకు ఏ సవాలు అధిగమించలేనిదని మనం గుర్తుంచుకోవాలి. అతను అపరిమితమైన దయ మరియు అచంచలమైన న్యాయంతో పొంగిపొర్లుతున్న దేవుడు, అంతిమ మంచి కోసం ఉనికిలోని ప్రతి అంశాన్ని నిర్దేశిస్తాడు. యిర్మీయా తమకు కష్టాలు రాకుండా చేయడంలో దేవుని నీతిని అంగీకరించాడు. మనకు ఎదురయ్యే వ్యక్తిగత లేదా సామాజిక సమస్యలతో సంబంధం లేకుండా, వాటిని సరిదిద్దే మార్గాలను ప్రభువు గమనిస్తాడు మరియు కలిగి ఉన్నాడని తెలుసుకోవడం ద్వారా మనం ఓదార్పు పొందవచ్చు. మనం దేవుని చిత్తాన్ని సవాలు చేయనప్పటికీ, దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రోత్సహించబడతాము.

దేవుడు తన ప్రజలను వదులుకుంటానని ప్రకటించాడు, కానీ వారిని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేశాడు. (26-44)
దేవుని ప్రతిస్పందన సమకాలీన తరం యూదుల పట్ల ఆయన కోపానికి గల కారణాలను మరియు భవిష్యత్ తరాల పట్ల ఆయన దయగల ఉద్దేశాలను వెల్లడిస్తుంది. ఇది పాపం, మరియు మరేమీ వారి పతనానికి దారితీయదు. ప్రజలు నిరాశాజనక స్థితికి చేరుకున్నప్పటికీ, యూదా మరియు జెరూసలేం పునరుద్ధరణ హామీ ఇవ్వబడింది. దేవుడు భవిష్యత్తులో వారి కోసం రిజర్వు చేసిన దయ గురించి వారికి నిరీక్షణను అందజేస్తాడు. నిస్సందేహంగా, ఈ వాగ్దానాలు విశ్వాసులందరికీ తిరుగులేనివి. దేవుడు వారిని తన వారిగా గుర్తిస్తాడు మరియు వారి పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తాడు. వారిలో ఆయన పట్ల భక్తిభావాన్ని కలుగజేస్తాడు. నిజమైన క్రైస్తవులు చిన్న విషయాలపై విభిన్న దృక్కోణాలను కలిగి ఉన్నప్పటికీ, పరస్పర ప్రేమను కలిగి ఉంటారు. పాపం యొక్క గురుత్వాకర్షణ, మానవత్వం యొక్క పడిపోయిన స్థితి, రక్షకుని ద్వారా మోక్షానికి మార్గం, నిజమైన పవిత్రత యొక్క సారాంశం, ప్రాపంచిక అన్వేషణల యొక్క శూన్యత మరియు శాశ్వతమైన విషయాల యొక్క ప్రాముఖ్యత గురించి వారి అవగాహనలో వారు ఐక్యంగా ఉంటారు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో, ఆయన బేషరతుగా ప్రేమిస్తాడు. దేవుని విశ్వసనీయత మరియు దృఢత్వాన్ని అనుమానించడానికి మనకు ఎటువంటి కారణం లేదు; బదులుగా, మన విశ్వసనీయతను మనం ప్రశ్నించుకోవాలి. అతను వాటిని కనానులో పునఃస్థాపిస్తాడు మరియు ఈ వాగ్దానాలు నిస్సందేహంగా ఫలిస్తాయి. జెరెమియా కొనుగోలు అనేది నిర్బంధ కాలం తర్వాత జరిగే అనేక సముపార్జనలకు హామీగా పనిచేస్తుంది. ఈ భూసంబంధమైన వారసత్వాలు తమ హృదయాలలో దేవుని గౌరవాన్ని కలిగి ఉండి, ఆయనకు అంకితభావంతో ఉన్నవారి కోసం కేటాయించబడిన స్వర్గపు ఆస్తులతో పోల్చితే లేతగా ఉంటాయి. కాబట్టి, ఆయన మనకు వాగ్దానం చేసిన మేలు అంతా మనకు లభిస్తుందని తెలుసుకుని, మన పరీక్షలను విశ్వాసంతో సహిద్దాం.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |