Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bible in Basic English (1964)
Bishop's Bible
Brenton's English Septuagint
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Commentary
1. యూదారాజైన సిద్కియా యేలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చిదాని ముట్టడివేయగా
1. yoodhaaraajaina sidkiyaa yēlubaḍiyandu tommidava samvatsaramu padhiyava nelalō babulōnu raajaina nebukadrejaru thana samastha sainyamuthoo yerooshalēmu meediki vachidaani muṭṭaḍivēyagaa
2. సిద్కియా యేలు బడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.
2. sidkiyaa yēlu baḍiyandu padakoṇḍava samvatsaramu naalugava nela tommidava dinamuna paṭṭaṇa praakaaramulu paḍagoṭṭabaḍenu.
3. యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.
3. yerooshalēmu paṭṭabaḍagaa adhipathulandaru, nērgalsharējaru savgurnebō shaṇḍula kadhipathiyagu sharsekeemu, gnaanulakadhipathiyagu nērgalsharējaru modalaina babulōnuraaju adhipathulandaru lōpaliki vachi madhyagummamulō koorchuṇḍiri.
4. యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.
4. yoodularaajaina sidkiyaayu athani yōdhulandarunu vaarinichuchi paaripōyi, raaju thooṭamaargamuna reṇḍu gōḍala madhyanunna gummapumaargamuna pōyiri gaani raaju maidaanapu maargamuna veḷlipōyenu.
5. అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోనురాజైన నెబుకద్రెజరు నొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి
5. ayithē kaldeeyula sēna vaarini tharimi yerikō daggaranunna maidaanamulalō sidkiyaanu kalisikoni paṭṭukoni, raaju athaniki shiksha vidhimpavalenani hamaathu dheshamulō riblaa paṭṭaṇamu daggara nunna babulōnuraajaina nebukadrejaru noddhaku vaaru sidkiyaanu theesikonipōyiri
6. బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను.
6. babulōnuraaju riblaa paṭṭaṇamulō sidkiyaa kumaarulanu athani kannulayeduṭa champin̄chenu, mariyu babulōnuraaju yoodhaa pradhaanulandarini champin̄chenu.
7. అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.
7. anthaṭa athaḍu sidkiyaa kannulu ooḍadeeyin̄chi athani babulōnunaku theesikonipōvuṭakai saṅkeḷlathoo bandhin̄chenu.
8. కల్దీయులు రాజనగరును ప్రజల యిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.
8. kaldeeyulu raajanagarunu prajala yiṇḍlanu agnichetha kaalchivēsi yerooshalēmu praakaaramulanu paḍagoṭṭiri.
9. అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచి యున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.
9. appuḍu raajadheha sanrakshakula kadhipathiyagu neboojaradaanu shēshin̄chi paṭṭaṇamulō nilichi yunna prajalanu, drōhulai thama raajunu viḍichi thanathoo cherinavaarini, shēshin̄china prajalanandarini babulōnunaku konipōyenu.
10. అయితే రాజదేహసంరక్షకుల కధిపతి యైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను.
10. ayithē raajadhehasanrakshakula kadhipathi yaina neboojaradaanu lēmigala daridrulanu yoodhaadheshamulō nuṇḍanichi, vaariki draakshathooṭalanu polamulanu niyamin̄chenu.
11. మరియు యిర్మీయాను గూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు
11. mariyu yirmeeyaanu goorchi babulōnu raajaina nebukadrejaru raajadheha sanrakshakulaku adhipathiyagu neboojaradaanunaku
12. ఈ ఆజ్ఞ ఇచ్చెను నీవు ఇతనికి హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి, ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను.
12. ee aagna icchenu neevu ithaniki haani cheyaka daggaranun̄chukoni paraamarshin̄chi, ithaḍu neethoo cheppunaṭlu cheyavalenu.
13. కావున రాజదేహసంరక్షకులకు అధిపతియైన నెబూజరదానును షండులకు అధిపతియగు నెబూషజ్బానును జ్ఞానులకు అధిపతియగు నేర్గల్‌షరేజరును బబులోనురాజు ప్రధానులందరును దూతలను పంపి
13. kaavuna raajadhehasanrakshakulaku adhipathiyaina neboojaradaanunu shaṇḍulaku adhipathiyagu nebooshajbaanunu gnaanulaku adhipathiyagu nērgalsharējarunu babulōnuraaju pradhaanulandarunu doothalanu pampi
14. బందీగృహశాలలోనుండి యిర్మీయాను తెప్పించి, అతనిని యింటికి తోడుకొనిపోవుటకు షాఫాను కుమారు డైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి, అప్పుడతడు ప్రజలమధ్య నివాసముచేసెను.
14. bandeegruhashaalalōnuṇḍi yirmeeyaanu teppin̄chi, athanini yiṇṭiki thooḍukonipōvuṭaku shaaphaanu kumaaru ḍaina aheekaamu kumaaruḍagu gedalyaaku athani nappagin̄chiri, appuḍathaḍu prajalamadhya nivaasamuchesenu.
15. యిర్మీయా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
15. yirmeeyaa bandeegruhashaalalō nuṇḍagaa yehōvaa maaṭa athaniki pratyakshamai yeelaagu selavicchenu
16. నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మేలు చేయుటకైకాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెర వేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దిన మున నెరవేరును.
16. neevu veḷli koosheeyuḍagu ebedmelekuthoo iṭlanumu ishraayēlu dhevuḍunu sainyamula kadhipathiyunagu yehōvaa eelaagu selavichuchunnaaḍu mēlu cheyuṭakaikaaka keeḍucheyuṭakai nēnu ee paṭṭaṇamunugoorchi cheppina maaṭalu nera vērchuchunnaanu; neevu choochuchuṇḍagaa aa maaṭalu aa dina muna neravērunu.
17. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
17. aa dinamuna nēnu ninnu viḍipin̄chedanu, neevu bhayapaḍu manushyulachethiki neevu appagimpabaḍavani yehōvaa selavichuchunnaaḍu.
18. నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొను నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు; ఇదేయెహోవా వాక్కు.
18. neevu nannu nammu koṇṭivi ganuka nishchayamugaa nēnu ninnu thappin̄chedanu, neevu khaḍgamuchetha paḍavu, dōpuḍusommu dakkin̄chukonu naṭlu nee praaṇamunu neevu dakkin̄chukonduvu; idheyehōvaa vaakku.