Jeremiah - యిర్మియా 48 | View All

1. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.

1. The LORD All-Powerful, the God of Israel, told me to say to the nation of Moab: The town of Nebo is doomed; Kiriathaim will be captured and disgraced, and even its fortress will be left in ruins.

2. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది.

2. No one honors you, Moab. In Heshbon, enemies make plans to end your life. My sword will leave only silence in your town named 'Quiet.'

3. ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది.

3. The people of Horonaim will cry for help, as their town is attacked and destroyed.

4. మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.

4. Moab will be shattered! Your children will sob

5. హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు.

5. and cry on their way up to the town of Luhith; on the road to Horonaim they will tell of disasters.

6. పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.

6. Run for your lives! Head into the desert like a wild donkey.

7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ము కొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.

7. You thought you could be saved by your power and wealth, but you will be captured along with your god Chemosh, his priests, and officials.

8. యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయకూడ నశించును మైదానము పాడైపోవును.

8. Not one of your towns will escape destruction. I have told your enemies, 'Wipe out the valley and the flatlands of Moab.

9. మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడును లేకుండ దాని పట్టణములు పాడగును.

9. Spread salt on the ground to kill the crops. Leave its towns in ruins, with no one living there.

10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.

10. I want you to kill the Moabites, and if you let them escape, I will put a curse on you.'

11. మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.

11. Moab, you are like wine left to settle undisturbed, never poured from jar to jar. And so, your nation continues to prosper and improve.

12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.

12. But now, I will send enemies to pour out the wine and smash the jars!

13. ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు

13. Then you will be ashamed, because your god Chemosh cannot save you, just as Bethel could not help the Israelites.

14. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు?

14. You claim that your soldiers are strong and brave.

15. మోయాబు పాడైపోవుచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి యౌవనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చినమాట యిదే.

15. But I am the LORD, the all-powerful King, and I promise that enemies will overpower your towns. Even your best warriors will die in the battle.

16. మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది.

16. It won't be long now-- disaster will hit Moab!

17. దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి విననివారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి.

17. I will order the nearby nations to mourn for you and say, 'Isn't it sad? Moab ruled others, but now its glorious power has been shattered.'

18. దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.

18. People in the town of Dibon, you will be honored no more, so have a seat in the dust. Your walls will be torn down when the enemies attack.

19. ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.

19. You people of Aroer, go wait beside the road, and when refugees run by, ask them, 'What happened?'

20. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి

20. They will answer, 'Moab has been defeated! Weep with us in shame. Tell everyone at the Arnon River that Moab is destroyed.' *

21. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును

21. I will punish every town that belongs to Moab, but especially Holon, Jahzah, Mephaath,

22. నెబోకును బేత్‌దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును

22. Dibon, Nebo, Beth-Diblathaim,

23. బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు

23. Kiriathaim, Beth-Gamul, Beth-Meon,

24. మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది.

24. Kerioth, and Bozrah.

25. మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.

25. My decision is final-- your army will be crushed, and your power broken.

26. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును.

26. People of Moab, you claim to be stronger than I am. Now I will tell other nations to make you drunk and to laugh while you collapse in your own vomit.

27. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి

27. You made fun of my people and treated them like criminals caught in the act.

28. మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె కొండలో కాపురముండుడి.

28. Now you must leave your towns and live like doves in the shelter of cliffs and canyons.

29. మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు

29. I know about your pride, and how you strut and boast.

30. అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు మాకు సమాచారము వచ్చెను వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములును నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే యెహోవా వాక్కు

30. But I also know bragging will never save you.

31. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టుచున్నారు.

31. So I will cry and mourn for Moab and its town of Kir-Heres.

32. సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.

32. People of Sibmah, you were like a vineyard heavy with grapes, and with branches reaching north to the town of Jazer and west to the Dead Sea. But you have been destroyed, and so I will weep for you, as the people of Jazer weep for the vineyards.

33. ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.

33. Harvest celebrations are gone from the orchards and farms of Moab. There are no happy shouts from people making wine.

34. నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు.

34. Weeping from Heshbon can be heard as far as Elealeh and Jahaz; cries from Zoar are heard in Horonaim and Eglath-Shelishiyah. And Nimrim Creek has run dry.

35. ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపమువేయువారిని మోయాబులో లేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు.

35. I will get rid of anyone who burns incense to the gods of Moab or offers sacrifices at their shrines. I, the LORD, have spoken.

36. వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె నాదము చేయుచున్నది కీర్హరెశువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగు చున్నది.

36. In my heart I moan for Moab, like a funeral song played on a flute. I mourn for the people of the town of Kir-Heres, because their wealth is gone. *

37. నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతులన్నిటిమీద నరుకులును నడుములమీద గోనెపట్టయు నున్నవి.

37. The people of Moab mourn on the rooftops and in the streets. Men cut off their beards, people shave their heads; they make cuts on their hands and wear sackcloth.

38. మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు.

38. And it's all because I, the LORD, have shattered Moab like a jar that no one wants.

39. అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయెను మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టునున్న వారికందరికి అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును.

39. Moab lies broken! Listen to its people cry as they turn away in shame. Other nations are horrified at what happened, but still they laugh.

40. యెహోవా సెలవిచ్చునదేమనగా పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది.

40. Moab, an enemy swoops down like an eagle spreading its wings over your land.

41. కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి యున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

41. Your cities and fortresses will be captured, and your warriors gripped by fear.

42. మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను.

42. You are finished as a nation, because you dared oppose me, the LORD.

43. మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు నీమీదికి వచ్చియున్నవి

43. Terror, pits, and traps are waiting for you.

44. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కు కొందురు మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోనునీడలో నిలిచియున్నారు.

44. If you are terrified and run, you will fall into a pit; and if you crawl out of the pit, you'll get caught in a trap. The time has come for you to be punished.

45. హెష్బోనులోనుండి అగ్నియు సీహోను మధ్యనుండి జ్వాలలును బయలుదేరి

45. Near the city of Heshbon, where Sihon once ruled, tired refugees stand in shadows cast by the flames of their burning city. Soon, the towns on other hilltops, where those warlike people live, will also go up in smoke.

46. మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబూ, నీకు శ్రమ కెమోషుజనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు.

46. People of Moab, you worshiped Chemosh, your god, but now you are done for, and your children are prisoners in a foreign country.

47. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబునుగూర్చిన శిక్షావిధి ముగిసెను.

47. Yet someday, I will bring your people back home. I, the LORD, have spoken.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 48 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అహంకారం మరియు భద్రత కోసం మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనాలు. (1-13) 
మోయాబీయులను నాశనం చేసే పని కల్దీయులకు అప్పగించబడింది. ప్రజల రక్తాన్ని చిందించడం కంటే వారి జీవితాలు మరియు ఆత్మలు రెండింటినీ రక్షించడం మా కర్తవ్యం అని కృతజ్ఞతతో ఉండటం చాలా ముఖ్యం. అయినప్పటికీ, మనం ఈ ముఖ్యమైన మిషన్‌ను మోసంతో సంప్రదించినట్లయితే మనం మరింత దోషులమవుతామని కూడా మనం గుర్తించాలి. నగరాలు శిథిలావస్థకు చేరుకుంటాయి, మరియు భూమి నిర్జనమై ఉంటుంది, ఇది తీవ్ర దుఃఖానికి మరియు ఆవశ్యకతకు దారి తీస్తుంది. పాపులకు రెక్కలు ఇచ్చినా, వారు దైవ కోపం నుండి తప్పించుకోలేరు.
అనేకమంది వ్యక్తులు నిరంతర బాహ్య విజయాన్ని ఆస్వాదిస్తూ పశ్చాత్తాపం చెందకుండా తప్పు చేస్తూ ఉంటారు. వారు అవినీతిపరులుగా మరియు మార్పులకు నిరోధకతను కలిగి ఉన్నారు, సురక్షితంగా మరియు వారి శ్రేయస్సులో మునిగిపోయారు. కీర్తనల గ్రంథము 55:19లో చెప్పబడినట్లుగా, కష్టాల యొక్క అంతరాయాలను వారు అనుభవించనందున వారి జీవితాలు మారవు.

శరీర విశ్వాసం మరియు దేవుని ధిక్కారం కోసం. (14-47)
మోయాబు నాశనానికి సంబంధించిన ప్రవచనం మేల్కొలుపు కాల్‌గా పనిచేస్తుంది, రాబోయే విపత్తును నివారించడానికి జాతీయ పశ్చాత్తాపం మరియు సంస్కరణల వైపు మళ్లేలా వారిని ప్రోత్సహిస్తుంది. ప్రత్యామ్నాయంగా, ఈ సంఘటనల కోసం సిద్ధం కావడానికి వ్యక్తిగత పశ్చాత్తాపం మరియు సంస్కరణకు ఇది పిలుపునిస్తుంది. బెదిరింపుల యొక్క ఈ విస్తృతమైన జాబితాను చదువుతున్నప్పుడు మరియు అవి కలిగించే భయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, దేవుని కోపం యొక్క అపారమైన శక్తి మరియు అతని తీర్పుల భయంపై దృష్టి పెట్టడం మనకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపయోగించిన వివిధ బొమ్మలు మరియు వ్యక్తీకరణల చిక్కుల్లో పడిపోకుండా, మన హృదయాలు దేవుని పట్ల భక్తిపూర్వకమైన విస్మయం మరియు ఆయన ఉగ్రతతో నిండిపోనివ్వండి.
ఈ విధ్వంసం శాశ్వతం కాదని గమనించడం ముఖ్యం. చివరి రోజుల్లో మోయాబు చెర నుండి తిరిగి వస్తాడనే వాగ్దానంతో అధ్యాయం ముగుస్తుంది. దేవుడు మోయాబీయులతో ఎప్పటికీ పోరాడడు, ఆయన కోపము శాశ్వతం కాదు. కొందరు దీనిని మెస్సీయ యొక్క రోజులకు సూచనగా అర్థం చేసుకుంటారు, అప్పుడు దైవిక దయ పాపం మరియు సాతాను యొక్క కాడి నుండి అన్యజనుల బంధీలను తిరిగి తీసుకువస్తుంది, వారికి నిజమైన స్వేచ్ఛను ఇస్తుంది.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |