Lamentations - విలాపవాక్యములు 2 | View All

1. ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను.

1. సీయోను కుమార్తెను (యెరూషలేము) యెహోవా మేఘముతో కప్పి ఎలా మరుగు పర్చినాడో చూడుము. ఇశ్రాయేలు వైభవాన్ని ఆయన ఆకాశాన్నుండి భూమికి త్రోసివేశాడు. యెహోవాకు కోపం వచ్చిన రోజున ఇశ్రాయేలు ఆయన కాలిపీట అని కూడా ఆయన గుర్తు పెట్టు కోలేదు.

2. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటిని నాశనముచేసి యున్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్ర పరచియున్నాడు.

2. యాకోబు (ఇశ్రాయేలు) ఇండ్లను యెహోవా మింగివేశాడు. కనికరం లేకుండా ఆయన వాటిని మింగివేశాడు. ఆయన తన కోపంలో యూదా కుమార్తె (యూదా రాజ్యం) కోటలను నాశనం చేశాడు. యూదా రాజ్యాన్ని, దాని పాలకులను యెహోవా నేలకు పడదోసినాడు. ఆయన రాజ్యాన్ని నాశనం చేశాడు.

3. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసి యున్నాడు.

3. యెహోవా తన కోపంతో ఇశ్రాయేలు బలాన్ని క్షయం చేశాడు. ఆయన తన కుడిచేతిని ఇశ్రాయేలు మీదినుండి తీసివేశాడు. శత్రువు వచ్చినప్పుడు ఆయన అలా చేశాడు. యాకోబు (ఇశ్రాయేలు) లో ఆయన అగ్నిశిలలా మండినాడు. ప్రళయాగ్నిలా ఆయన ఉన్నాడు.

4. శత్రువువలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధివలె కుడి చెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనముచేసి యున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించి యున్నాడు.

4. ఒక శత్రువులా యెహోవా తన విల్లు వంచాడు. అయన కుడిచేయి తన ఖడ్గం ఒరమీద వుంది. బాగా కన్పించే యూదా మనుష్యులందరినీ ఆయన చంపివేశాడు. యెహోవా ఒక శత్రువులా వారిని హతమార్చినాడు. యెహోవా తన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన దానిని సీయోను గుడారాలపై కుమ్మరించాడు.

5. ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.

5. యెహోవా ఒక శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగేశాడు. ఆయన దాని స్థలాలన్నిటినీ మింగేశాడు. ఆయన దాని కోటలన్నిటినీ మింగేశాడు. మృతుల కొరకు యూదా కుమార్తెలో మిక్కిలి దుఃఖాన్ని, బాధను కలుగ జేశాడు.

6. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి యున్నాడు తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతిదినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి యున్నాడు.

6. యెహోవా తన స్వంత గుడారాన్నే ఒక తోట మాదిరి నాశనం చేసినాడు. ప్రజలు ఎక్కడ సమావేశమై తనను ఆరాధిస్తారో ఆ ప్రదేశాన్నే ఆయన పాడుజేశాడు. సీయోనులో ప్రత్యక సమావేశాలు, ప్రత్యేక విశ్రాంతి దినాలను ప్రజలు మర్చిపోయేలా యెహోవా చేశాడు. యెహోవా రాజును, యాజకుని తిరస్కరించాడు. తనకోపంలో ఆయన వారిని తిరస్కరించాడు.

7. ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.

7. యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు. ఆయన తన పవిత్ర ఆరాధనా స్థలాన్ని తిరస్కరించాడు. యెరూషలేము కోట గోడలను ఆయన శత్రువులకు అప్పజెప్పాడు. యెహోవా ఆలయంలో శత్రువు అల్లరి చేశాడు. అది ఒక సెలవు రోజు అన్నట్లు వారు అల్లరి చేశారు.

8. సీయోను కుమారియొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను నాశనముచేయుటకు తన చెయ్యి వెనుకతీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గు చున్నవి అవి యేకరీతిగా క్షీణించుచున్నవి.

8. సీయోను కుమార్తె (ఇశ్రాయేలు) కోట గోడలను కూల దోయటానికి యెహోవా పథకం నిర్ణయించాడు. ఒక కొలబద్దతో అతడు గోడకు గుర్తులు పెట్టాడు. దానిని నాశనం చేయటంలో తనను తాను నిగ్రహించుకోలేదు. కావున బయటి ప్రాకారం, ఇతర గోడలు ధుఃఖ భారంతో కూలి పోయేలా చేశాడు. అవి ఒక్కుమ్మడిగా శిథి లమై పోయాయి.

9. పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయి యున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు.

9. యోరూషలేము ద్వారాలు భూమిలోకి క్రుంగి పోయాయి. ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు నుగ్గు చేశాడు. ఆమె యొక్క రాజు, యువరాజులు పరదేశాలకు పోయి ఉన్నారు. వారికి ఇక ఎంత మాత్రం ఉపదేశం లేదు. యెరూషలేము ప్రవక్తలకు కూడా యెహోవా నుండి దర్శనాలు ఏమీలేవు.

10. సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు కొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు కొందురు.

10. సీయోను పెద్దలు నేలపై కూర్చున్నారు. వారు కింద కూర్చుండి మౌనం వహించారు. వారు తమ తలలపై దుమ్ము జల్లుకున్నారు. వారు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము యువతులు దుఃఖంతో తమ తలలు కిందికి వంచుకున్నారు.

11. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు.

11. కన్నీళ్లతో నా కళ్లు నీరసించాయి! నా అంత రంగంలో గందరగోళం చెలరేగుతూవుంది! నా గుండె జారి కిందపడినట్లు భావన కలుగుతూ ఉంది! నా ప్రజల నాశనం చూసిన నాకు ఆ భావన కలుగుతూ ఉంది. పిల్లలు, పసికందులు నగర రహదారి స్థలాలలో మూర్ఛపోతున్నారు.

12. గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము ఏదియని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు.

12. “రొట్టె, ద్రాక్షారసం ఏవి?” అని ఆ పిల్లలు తమ తల్లులను ఆగుడుతున్నారు. వారు చనిపోతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు. వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు.

13. యెరూషలేము కుమారీ, ఎట్టిమాటలచేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటిచేయుదును? సీయోను కుమారీ, కన్యకా, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు?

13. సీయోను కుమారీ, నిన్ను దేనితో సరిపోల్చను? నిన్ను దేనితో పోల్చాలి? సీయోను కన్యాకుమారీ, నిన్ను దేనితో పోల్చను? నిన్నెలా ఓదార్చగలను? నీ వినాశనం సముద్రమంత పెద్దది! ఎవ్వరేగాని నిన్ను స్వస్థపర్చగలరని నేను అనుకోవటంలేదు.

14. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచి యున్నారు నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.

14. నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు. కాని వారి దర్శనాలన్నీ విలువలేని అబద్ధాలు. పాపం చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు. పరిస్థితి మెరుగుపర్చటానికి వారు ఎట్టి ప్రయత్నిమూ చేయలేదు. వారు నీకొరకు ఉపదేశాలు అందించారు. కాని, అవి కేవలం నిన్ను మోసగించటానికి ఉద్దేశించబడిన అబద్ధపు వర్తమానాలు.

15. త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు
మత్తయి 27:39, మార్కు 15:29

15. మార్గమున పోవు వారు నిన్ను చూసి విస్మయంతో చేతులు చరుస్తారు. యెరూషలేము కుమార్తెను చూచి వారు ఈలవేసి తలలు ఆడిస్తారు. ‘అపురూప అందాల నగరం’ అనీ , ‘భూనివాసులకు ఆనంద దాయిని’ అని ప్రజలు పిలిచే నగరం ఇదేనా?” అని వారడుగుతారు.

16. నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.

16. నీ శత్రువులంతా నిన్ను చూసి నోళ్లు తెరుస్తారు. వారు ఈలవేసి, నిన్నుజూచి పండ్లు కొరుకుతారు. “మేము వారిని మింగేశాము! నిజంగా మేము ఈ రోజుకొరకే ఎదురుచూశాము. చివరకు ఇది జరగటం మేము చూశాము” అని వారంటారు.

17. యెహోవా తాను యోచించిన కార్యము ముగించి యున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసి యున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.

17. యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు. ఆయన ఏది చేస్తానని అన్నాడో అది చె సివేశాడు. పూర్వకాలం నుండి ఆయన ఎలా హెచ్చరిస్తూవచ్చాడో ఆయన ఇప్పుడు అలాగే చేశాడు. దయాదాక్షిణ్యం లేకుండా ఆయన నాశనం చేశాడు. నీ మూలంగానే నీ శత్రువులు సంతోషపడేలా ఆయన చేశాడు. ఆయన నీ శత్రువుల శక్తియుక్తులను పెంచాడు.

18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.

18. ఓ సీయోను కుమార్తె ప్రాకారమా, నీ గుండెలు పగిలేలా యెహోవాకు మొరపెట్టుకో! నీ కన్నీరు వాగులా పారనీ! నీ కన్నీరు మున్నీరై పారనీ! నీ కన్నీరు రాత్రింబవళ్లు కారనీ! వాటిని ఆపకు! నీ కండ్లకు విశ్రాంతి ని వ్వకు!

19. నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లు చున్నారు

19. లెమ్ము! రాత్రిళ్లు రోదించు! రాత్రిళ్లు ప్రతి ఝామున దుఃఖించు! ఒక జలరాశిలా నీ గుండె కుమ్మరించు! యెహోవా ముందు నీ గుండె కుమ్మరించు! నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయుము. నీ పిల్లలు బతికేలా చేయుమని ఆయనను ప్రాధేయపడుము. ఆకలితో అలమటించి సొమ్మసిల్లే నీ పిల్లలను బతికించుమని ఆయనను అర్థించుము. ఆకలితో మాడి నగర వీధుల్లో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు.

20. నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగువా?

20. యెహోవా, నావైపు చూడుము! నీవు ఈ రకంగా శిక్షించినది ఎవ్వరినో చూడు! నన్ను ఈ ప్రశ్న అడుగనిమ్ము: తాము కన్న బిడ్డలనే స్త్రీలు తిన వలెనా? తాము పెంచి పోషిర చిన బిడ్డలనే స్త్రీలు తినవలెనా? యాజకుడు, ప్రవక్త యెహోవా ఆలయంలో చంపబడాలా?

21. యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి యున్నారు నా కన్యకలును నా ¸యౌవనులును ఖడ్గముచేత కూలియున్నారు నీ ఉగ్రతదినమున నీవు వారిని హతము చేసితివి దయ తలచక వారినందరిని వధించితివి.

21. యువకులు, ముసలివారు నగర వీధుల్లో దుమ్ములో పడివున్నారు. నా యువతీ యువకులు కత్తి వేటుకు గురియైనారు. యెహోవా, నీవు కోపగించిన రోజున నీవు వారిని చంపేశావు! దయ లేకుండా నీవు వారిని చంపివేశావు!

22. ఉత్సవదినమున జనులు వచ్చునట్లుగా నలుదిశలనుండి నీవు నామీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రతదినమున ఎవడును తప్పించుకొనలేక పోయెను శేషమేమియు నిలువకపోయెను నేను చేతులలో ఆడించి సాకినవారిని శత్రువులు హరించివేసియున్నారు.

22. నలుమూలల నుండి నా మీదికి భయాన్ని ఆహ్వానించావు. ఏదో విందుకు ఆహ్వానించినట్లు నీవు భయాన్ని ఆహ్వానించావు. యెహోవాకు కోపం వచ్చిన రోజున తప్పించుకున్నావాడుగాని, దానిని తట్టుకున్నవాడుగాని ఒక్కడూ లేడు. నేను పెంచిపోషించిన వారందరినీ నా శత్రువు చంపివేశాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Lamentations - విలాపవాక్యములు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జెరూసలేం దుస్థితికి విలపించడం.

1-9
ఇక్కడ, దేవుని చర్చి, ప్రత్యేకించి జాకబ్ మరియు ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి యొక్క నిస్సత్తువ చిత్రణను మేము కనుగొన్నాము. అయితే, వారి కష్టాలలో దేవుని పాత్రను గుర్తించడంపై ప్రధానంగా ప్రాధాన్యత కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలతో కలత చెంది వారిని సరిదిద్దినప్పటికీ, అతను వారి శత్రువు అని అర్థం కాదు. దేవుడు తన రక్షణను ఉపసంహరించుకున్నప్పుడు, గేట్లు మరియు బార్లు వంటి కోటలు పనికిరావు. పాపం ద్వారా తమను తాము దిగజార్చుకున్న వారిని దించడంలో దేవుని చర్యలు న్యాయమైనవి, అలాగే వాటిని గౌరవించని లేదా సరిగ్గా పాటించని వారికి సబ్బాత్‌లు మరియు మతపరమైన ఆచారాల యొక్క ఆశీర్వాదాలు మరియు ఓదార్పుని నిరాకరించడం. బైబిళ్లు వాటి నుండి ఎలాంటి ప్రయోజనం పొందని వారికి ఏ ఉద్దేశ్యాన్ని అందిస్తాయి? దేవుని ప్రవక్తలను తప్పుగా ప్రవర్తించే వారు తమ మార్గదర్శకత్వాన్ని కోల్పోతారు. ఇది బాధాకరమైనది అయినప్పటికీ, బాధకు గురైన వారి ఆలోచనలను వారిపై ఎత్తిన దేవుని వైపు మరియు వారి స్వంత అతిక్రమణలు వారి బాధలకు మూలకారణంగా మళ్లించడం అవసరం.

10-22
ఈ ప్రకరణం దుఃఖానికి కారణాలను వివరిస్తుంది. ద్వితీయోపదేశకాండము 28:53లో ముందే హెచ్చరించినట్లుగా, వారి స్వంత తల్లులచే విషాదకరంగా చంపబడిన మరియు సేవించబడిన చిన్న పిల్లలతో సహా లెక్కలేనన్ని వ్యక్తులు ఆకలితో చనిపోయారు. అనేకమంది తమ పొరుగువారు వారిని ఎగతాళి చేసినప్పుడు, తప్పుడు ప్రవక్తలచే మోసగించబడి, యుద్ధంలో తమ ముగింపును ఎదుర్కొన్నారు. ఇతరుల బాధలను ఎగతాళి చేయడం ఘోరమైన పాపం, ఎందుకంటే ఇది ఇప్పటికే బాధపడుతున్న వారి వేదనను పెంచుతుంది. వారి పతనాన్ని వారి శత్రువులు ఆనందించారు. చర్చి యొక్క శత్రువులు దాని అంతిమ పతనానికి దాని ఎదురుదెబ్బలను తరచుగా పొరపాటు చేస్తారు, కానీ చివరికి అవి తప్పుగా నిరూపించబడతాయి.
వచనం దుఃఖం యొక్క వ్యక్తీకరణలకు పిలుపునిస్తుంది మరియు ఈ దుఃఖాలను నయం చేయడానికి ఓదార్పుని కోరుతుంది. ప్రార్థన ప్రతి గాయానికి ఔషధంగా పనిచేస్తుంది, అత్యంత తీవ్రమైనది కూడా, మరియు ప్రతి బాధకు, ఎంత బాధాకరమైనదైనా సరే. ప్రార్థనలో, మన కర్తవ్యం ఏమిటంటే, మన పరిస్థితులను ప్రభువుకు అప్పగించడం మరియు వాటిని ఆయన చేతుల్లో వదిలివేయడం, ఆయన చిత్తానికి లొంగిపోవడం. మనం దేవుని పట్ల భక్తిని కాపాడుకుందాం, ఆయన ముందు వినయంగా నడుచుకుందాం మరియు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడదాం.



Shortcut Links
విలాపవాక్యములు - Lamentations : 1 | 2 | 3 | 4 | 5 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |