Daniel - దానియేలు 4 | View All

1. రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక.

1. రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే దేశాలకు, ప్రజలకు వ్రాయిస్తూ మీ అందరికీ సమాధాన మగుగాక!

2. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను.
యోహాను 4:48

2. అత్యున్నతుడైన దేవుడు, నా కోసం చేసిన అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల గురించి చెప్పడానికి సంతోసిస్తున్నాను.

3. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది.

3. దేవుని సూచనలు, అద్భుతాలు మహాగొప్పవి, శక్తివంతమైనవి. దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది.

4. నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కల కంటిని; అది నాకు భయము కలుగజేసెను.

4. నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన ఉన్నాను. నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను.

5. నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను.

5. నన్ను భయంగొలిపే కల ఒకటి వచ్చింది. నేను నా పడకమీద ఉన్నాను. నా మనస్సులోని ఆలోచనలు నన్ను భయపెట్టాయి.

6. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరిని నా యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని.

6. అందువల్ల బబులోనులోని వివేకవంతులందరినీ నావద్దకు తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే వారు నా కలయొక్క అర్థం చెప్పగలరని.

7. శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి.

7. ఇంద్ర జాలికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో వారు చెప్పలేకపోయారు.

8. కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను, కావున నేనతనికి నా కలను చెప్పితిని.

8. చివరికి దానియేలు వచ్చాడు. (నా దేవుని గౌరవించే నిమిత్తం నేను దానియేలుకు బెల్తెషాబరు అని పేరుపెడితిని. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ అతనిలో వుంది.) నా కల గురించి దానియేలుతో చెప్పాను.

9. ఎట్లనగా శకునగాండ్ర అధిపతి యగు బెల్తెషాజరూ, పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్న దనియు, ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియ జెప్పుము.

9. నేను ఈ విధంగా చెప్పాను: “బెలైషాజరూ! ఇంద్ర జాలికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్లు నాకు తెలుసు. ఏ రహస్యమూ నీకు తెలుసుకోవడం కష్టంకాదు. ఇది నేను (కన్నకల) దాని అర్థమేమిటో చెప్పుము.

10. నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను.

10. నేను నా పడక మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది.

11. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను.

11. ఆ చెట్టు ఏపుగా దృఢంగా పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా అన్నట్లున్నది. భూమిమీద ఎక్కడినుంచ యినా ఆ చెట్టుని చూడవచ్చు.

12. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను.
మత్తయి 13:32, మార్కు 4:32, లూకా 13:19

12. ఆ చెట్టు ఆకులు చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్లు ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. భూజంతువులకు చెట్టుక్రింద నీడ లభించింది. దాని కొమ్మలలో పక్షులు ఉన్నవి. ప్రతీ జీవి ఆ చెట్టునుండి పోషింటబడింది.

13. మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనము లను చూచుచుండగా,

13. నేను నా పడక మీదనే పడుకొని నా దర్శనంలో కావలివానివలె పరలోకంనుంచి ఒక పవిత్రుడు క్రిందికి రావడం చూశాను.

14. జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి.

14. అతను చాలా బిగ్గరగా మాట్లాడాడు, ‘చెట్టును నరికి వేయండి. చెట్టుకొమ్మల్ని నరికి వేయండి. దాని ఆకులను, దాని పండ్లని త్రుంచి పారవేయండి. చెట్టుకిందవున్న జంతువుల్ని తోలివేయండి. దాని కొమ్మల మీదవున్న పక్షుల్ని ఎగిరి పోనివ్వండి.

15. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగు నట్లు దానిని భూమిలో విడువుడి.

15. కాని దాని మొద్దును వేళ్లతో సహాభూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ ఇనుమూ కంచు కలిసిన ఒక బద్దీ వేయండి. చెట్టుమొద్దు, వ్రేళ్లు పొలంలో పెరిగే గడ్డి మధ్యలో భూమిలోనే ఉండినివ్వండి. మంచు చేత దాన్ని తడవ నివ్వండి. అని అతను చెప్పాడు.

16. ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.

16. ఇక మీదట అతను మనిషిలా ఆలోచించడు. అతనికి జంతువుల బుద్ధి వస్తుంది. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతని మీదగా గడుస్తాయి.’

17. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయ మైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరు గును.

17. కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమి మీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు!

18. బెల్తెషాజరూ, నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శనము ఇదే; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు. నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడ వంటిని.

18. ఇదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్నకల. ఇప్పుడు బెలైషాజరూ (దానియేలూ) ఈ కల అర్థం చెప్పుము. నా రాజ్యాంలోని వివేకవంతు లెవ్వరూ నాకు ఆ కల అర్థం చెప్పలేకపోయారు. కాని బెలైషాజరూ, నీవు ఆ కల గురించి చెప్పగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మవుంది.

19. అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు - బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తెషాజరు నా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,

19. తర్వాత దానియేలు (బెలైషాజరు) కొంచెంసేపు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విషయాలు అతన్ని కలత పరచినవి. అందువల్ల రాజు, “బెల్తెషాజరూ! (దానియేలు) ఆ కలగాని, ఆ కలయొక్క అర్థంగాని, నిన్ను కలత చెందనీయకుండును గాక” అని చెప్పాడు. తర్వాత బెల్తెషాజరు (దానియేలు) రాజుతో ఇలా అన్నాడు: “నా రాజా! ఆ కల నీ విరోధులకు జరుగునుగాక! నీ శత్రువులకు ఆ కలయొక్క అర్థము నెరవేరును గాక!

20. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకాశమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను.

20.

21. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను, దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెనుగదా
లూకా 13:19

21.

22. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.

22. రాజా. నీవే ఆ వృక్షానివి. నీవు మహా శక్తిమంతుడవయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షంవంటి వాడవు నీవు. నీ అధికారం భూమిమీద దూర భాగాలకు కూడా వ్యాపించింది.”

23. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తిడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపుమంచుకు తడవనిచ్చి పశువులతో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా.

23. “రాజా, పరలోకంనుంచి ఒక పవిత్ర కావలి దేవదూత క్రిందికి రావడం నీవు చూశావు. అతడు ఇలా అన్నాడు:’చెట్టుని నరికివేయుము; నాశనం చేయుము. ఇనుము కంచు బద్దీతో కట్టబడి, పొలంలోని గడ్డి మధ్య నాటబడిన ఆ మొద్దును ప్రేళ్ళతో సహా భూమిలోనే విడిచిపెట్టు. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతను మంచుకు తడుస్తూ మృగంవలె జీవస్తాడు.’

24. రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా

24. “రాజా, కలయొక్క అర్థం ఇదే. మహోన్నతుడైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజువైన నీకు ఆజ్ఞాపించాడు.

25. తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడ నియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాల ములు నీకీలాగు జరుగును.

25. నెబుకద్నెజరు రాజా, నీ ప్రజలనుంచి దూరంగా నీవు తరుమబడుతావు. భూజంతువుల మధ్య నీవు నివసిస్తావు. ఎద్దువలె నీవు పచ్చిక తింటావు. నీవు మంచుచేత తడుస్తావు. అలా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు నీవీపాఠం నేర్చుకుంటావు - మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనియు, తనకు నచ్చిన ఎవనికైనా రాజ్యాలను ఇచ్చివేస్తాడనియు నీవు తెలుసుకుంటావు.

26. చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము.

26. “చెట్టు మొద్దు, వ్రేళ్లనీ నేలలోనే ఉంచుము అని ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమిది: మహోన్నతుడైన ఆ దేవుడే మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడన్న విషయం నీవు తెలుసుకున్నప్పుడు, నీ రాజ్యం నీకు ఇవ్వ బడుతుంది.

27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములుమాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.

27. అందువల్ల, రాజా, నా సమహాని స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయుము. సరి యైనదేదో అదే జరిగించుము. చెడు విషయాలు చేయడం ఆపివేయుము. బీదవారిపట్ల దయగలిగి ఉండుము. అప్పుడు నీవు క్రమంగా విజయాన్ని పొందగలవు.”

28. పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను.

28. నెబుకద్నెజరు రాజుకి ఆ ఘటనలన్నీ జరిగినవి.

29. పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా

29.

30. రాజుబబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.
ప్రకటన గ్రంథం 14:8, ప్రకటన గ్రంథం 16:19, ప్రకటన గ్రంథం 17:5, ప్రకటన గ్రంథం 18:2-10

30.

31. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.

31. అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం వినిపించింది. “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే: నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది.

32. తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి యైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయిం చునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.

32. ప్రజలనుండి నీవు తరిమి వేయబడతావు. భూజంతువులతో మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనియు, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనియు నీవు తెలుసుకుంటావు.”

33. ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభ వించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను.

33. ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు ఎద్దువలె పచ్చిక వేయ సాగాడు. ఆకాశ మంచుచేత అతని దేహం తడిసింది. గ్రద్ద ఈకలవలె అతని గోళ్లు పొడుగ్గా పెరిగాయి.

34. ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నె జరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి.
ప్రకటన గ్రంథం 4:9-10

34. ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి చూశాను. మళ్లీ నాకు మానవబుద్ది లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవున్ని నేను కీర్తించాను. ఎల్లాకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా ప్రశంసించాను: ఆయన పరిపాలన శాశ్వతమైనది, తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది.

35. భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

35. భూమిమీద మనుష్యులు ఆయన ఎదుట లెక్క లేనివారికి సమానము. దేవుడు పరలోకలమందలి సైన్యాలకు, భూమిమీది మనుష్యులకు తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తాడు. ఎవ్వరూ ఆయన శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు. ఎవ్వరూ ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు.

36. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను; నా మంత్రులును నా క్రిందియధిపతులును నాయొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని.

36. అందువల్ల, ఆ సమయాన, దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం కంటె ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి.

37. ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
యోహాను 4:48

37. ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను పరలోక మందున్న రాజుని కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అణగ ద్రొక్కుతాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Daniel - దానియేలు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నెబుచాడ్నెజార్ యెహోవా శక్తిని గుర్తించాడు. (1-18) 
ఈ అధ్యాయం యొక్క ప్రారంభ మరియు ముగింపు ఆశ యొక్క మెరుపును అందిస్తాయి, నెబుచాడ్నెజార్ దైవిక దయ యొక్క శక్తికి మరియు దైవిక దయ యొక్క అనంతమైన లోతులకు నిదర్శనంగా ఉపయోగపడగలడని సూచిస్తున్నాయి. అతని పిచ్చి నుండి కోలుకున్న తరువాత, అతను కథను చాలా దూరం వ్యాపింపజేయడం, భవిష్యత్ తరాల కోసం దానిని భద్రపరచడం తన లక్ష్యం, దేవుడు అతనిని ఎలా న్యాయంగా తగ్గించి, దయతో పునరుద్ధరించాడు అనేదానికి సాక్ష్యంగా. ఒక పాపి వారి నిజమైన స్వభావానికి మేల్కొన్నప్పుడు, వారు దేవుని యొక్క విశేషమైన దయను పంచుకోవడానికి బలవంతం చేయబడతారు, తద్వారా ఇతరుల శ్రేయస్సుకు దోహదపడతారు.
నెబుచాడ్నెజార్ తన గర్వం కారణంగా ఎదుర్కొన్న దైవిక తీర్పులను వివరించే ముందు, కలలు లేదా దర్శనాల ద్వారా అతను పొందిన హెచ్చరికలను వివరించాడు. ఈ ద్యోతకాలు అతని కోసం తరువాత వివరించబడ్డాయి, గొప్ప గౌరవం ఉన్న వ్యక్తిని తక్కువ చేసి ఏడు సంవత్సరాల పాటు వారి కారణాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది-నిస్సందేహంగా తీవ్రమైన తాత్కాలిక శిక్ష. దేవుడు మనపై విధించే బాహ్య పరీక్షలతో సంబంధం లేకుండా, మనం వాటిని ఓపికగా భరించాలి మరియు మన హేతువును ఉపయోగించడాన్ని మరియు మన మనస్సాక్షి యొక్క శాంతిని ఆయన మనకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉండాలి.
ప్రభువు తన వివేకంతో, ఒక పాపిని తదుపరి అతిక్రమణలకు పాల్పడకుండా నిరోధించడానికి లేదా విశ్వాసి తన పేరును చెడగొట్టకుండా నిరోధించడానికి అటువంటి చర్యలను ఎంచుకున్నట్లయితే, వారి తప్పుడు చర్యల యొక్క పరిణామాల కంటే అలాంటి భయంకరమైన జోక్యం కూడా ఉత్తమం. దేవుడు, న్యాయమూర్తిగా, దానిని నియమించాడు మరియు స్వర్గంలోని దేవదూతలు కూడా ఈ దైవిక నిర్ణయాన్ని మెచ్చుకుంటారు. గొప్ప దేవునికి దేవదూతల సలహా లేదా ఒప్పందం అవసరం లేనప్పటికీ, వారి సమ్మతి ఈ తీర్పు యొక్క గంభీరతను నొక్కి చెబుతుంది. ఈ చర్య కోసం డిమాండ్ పవిత్రుల నుండి వస్తుంది-దేవుని బాధాకరమైన ప్రజలు. అణచివేయబడినవారు దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన వాటిని వింటాడు.
మన నుండి ఎన్నటికీ తీసివేయబడని ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా కోరుకుందాం మరియు అన్నింటికంటే, అహంకారం మరియు దేవుణ్ణి మరచిపోయే ధోరణి నుండి కాపాడుకుందాం.

దానియేలు తన కలను అర్థం చేసుకున్నాడు. (19-27) 
అటువంటి శక్తిమంతుడైన పాలకునిపై బరువైన తీర్పు వెలువడడాన్ని చూసినప్పుడు దానియేలు విస్మయం మరియు భయంతో నిండిపోయాడు మరియు అతను సౌమ్యత మరియు భక్తితో తన సలహాను అందించాడు. పశ్చాత్తాప ప్రక్రియలో, తప్పులో పాల్గొనడం మానేయడమే కాకుండా సద్గుణాలను పెంపొందించడం కూడా చాలా అవసరం. ఇది రాబోయే తీర్పును పూర్తిగా నివారించలేకపోయినా, దాని రాకను ఆలస్యం చేయవచ్చు లేదా దాని తీవ్రతను తగ్గించవచ్చు. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగేవారు చివరికి శాశ్వతమైన బాధల నుండి తప్పించబడతారు.

దాని నెరవేర్పు. (28-37)
గర్వం మరియు ఆత్మాభిమానం తరచుగా గొప్ప వ్యక్తులను వలలో వేసుకుంటాయి, దేవునికి మాత్రమే సంబంధించిన కీర్తిని తప్పుగా పొందేలా చేస్తుంది. నెబుచాడ్నెజార్ విషయంలో, గర్వపూరితమైన మాటలు అతని పెదవులపై ఉండగానే, ఒక శక్తివంతమైన దైవిక శాసనం వెలువడింది. అతని అవగాహన మరియు జ్ఞాపకశక్తి తీసివేయబడింది మరియు అతని హేతుబద్ధమైన ఆత్మ యొక్క అన్ని సామర్థ్యాలు విచ్ఛిన్నమయ్యాయి. ఇది జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గంభీరంగా గుర్తుచేస్తుంది మరియు మన తెలివిని తీసివేయడానికి దేవుణ్ణి ప్రేరేపించే చర్యలకు దూరంగా ఉంటుంది. లేఖనాలు బోధిస్తున్నట్లుగా, "అహంకారులను దేవుడు వ్యతిరేకిస్తాడు."
నెబుచాడ్నెజ్జార్, కేవలం మర్త్యుని కంటే ఎక్కువగా ఉండాలని కోరుకున్నాడు, దేవునిచే న్యాయంగా తక్కువ స్థితికి తగ్గించబడ్డాడు. ఈ ఎపిసోడ్ దేవుని గురించిన ఒక ప్రాథమిక సత్యాన్ని నొక్కి చెబుతుంది - ఆయన సర్వోన్నతుడు, శాశ్వతుడు, మరియు అతని రాజ్యం కూడా తనలాగే శాశ్వతమైనది మరియు సర్వతో కూడినది. అతని శక్తిని ఎదిరించలేము. వ్యక్తులు తమను తాము లొంగదీసుకుని, తమ పాపాలను ఒప్పుకొని, దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించినప్పుడు వారు ఆయన అనుగ్రహాన్ని ఆశించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా, దేవుడు మొదటి ఆదాము యొక్క పాపం ద్వారా కోల్పోయిన గౌరవాన్ని వారికి పునరుద్ధరించడమే కాకుండా, రెండవ ఆదాము యొక్క నీతి మరియు దయ ద్వారా వారికి ఉన్నతమైన మహిమను కూడా ప్రసాదిస్తాడు.
బాధలకు ఒక ప్రయోజనం ఉంటుంది మరియు అవి తాము అనుకున్న పనిని సాధించే వరకు మాత్రమే కొనసాగుతాయి. నెబుచాడ్నెజ్జార్ తన పునరుద్ధరణ తర్వాత కేవలం ఒక సంవత్సరం మాత్రమే జీవించాడని నమ్ముతున్నప్పటికీ, నిజమైన పశ్చాత్తాపం మరియు అంగీకరించబడిన విశ్వాసిగా మారడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వృత్తాంతం ప్రభువు గర్విష్ఠులను ఎలా అణగదొక్కాడో వివరిస్తుంది, అయితే ఆయనను పిలిచే వినయపూర్వకమైన, పశ్చాత్తాపం చెందిన పాపిపై దయ మరియు ఓదార్పునిస్తుంది.



Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |