Daniel - దానియేలు 5 | View All

1. రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను.

1. రాజైన బెల్షెస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు.

2. బెల్షస్సరు ద్రాక్షా రసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను.

2. బెల్షెస్సరు ద్రాక్షామద్యం తాగుతుండగా బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకుల్ని ఆజ్ఞాపించాడు. తన తండ్రి అయిన నెబుకద్నెజరు ఆ పాత్రల్ని యెరూషలేము ఆలయం నుంచి తీసుకువచ్చాడు. బెల్షెస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు.

3. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి.
ప్రకటన గ్రంథం 9:20

3. కనుక యెరూషలేము ఆలయం నుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు.

4. వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా
ప్రకటన గ్రంథం 9:20

4. త్రాగుచూవారు బంగారం వెండి, కంచు, ఇనుము, కర్ర రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు.

5. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా

5. అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడిగోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు.

6. అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.

6. రాజైన బెల్షెస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంగా ఉండటంవల్ల, అతడు నిలబడలేక పోయాడు.

7. రాజు గారడీ విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను - ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును.

7. అప్పుడు ఇంద్రజాలకుల్ని, కల్దీయుల్ని, తన సమక్షమునకు తీసుకురావలసిందిగా కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీద ఈ వ్రాతను చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు అతనికి బహుకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు.

8. రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారివల్ల కాకపోయెను.

8. అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు ఆ వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు.

9. అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధిపతులు విస్మయమొందునట్లుగా ముఖవికారముగలవాడా యెను.

9. బెల్షెస్సరు, అతని అధికారులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్ల బోయింది.

10. రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండ నిమ్ము.

10. విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజు యొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్ఖిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు.

11. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను.

11. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. పవిత్ర దేవుళ్ల ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రి పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేక వంతంగా ఉన్నట్లుగా కూడా అతను కనిపించాడు. ఇటువంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ అధికారిగా నియమించాడు. అతను ఇంద్ర జాలకులందరికి, కల్దీయులందరికి ఆధిపత్యం వహించాడు.

12. ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును.

12. నేను మాటలాడుతున్న వ్యక్తి వేరు దానియేలు. రాజు అతనికి బెల్తెషాజరు అని నామకరణం చేశాడు. బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్ధాలు చెప్పగలడు. రహస్య విషయాలు వివరించగలడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పిలిపించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను చెప్పగలడు” అని ఆమె చెప్పింది.

13. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను - రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసికొనివచ్చిన చెర సంబంధమగు యూదు లలోనుండు దానియేలు నీవే గదా?

13. అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా?

14. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్నుగూర్చి వింటిని.

14. నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను.

15. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్యగల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి.

15. వివేకవంతుల్నీ ఇంద్రజాలకుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుప లేకపోయారు.

16. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్ధుడవని నిన్నుగూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైనయెడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణకంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ యధిపతివిగా ఏలుదువు.

16. నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు.

17. అందుకు దానియేలు ఇట్లనెను నీ దానములు నీయొద్ద నుంచు కొనుము, నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియ జెప్పెదను.

17. తర్వాత దానియేలు రాజుతో, “బెల్షెస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకొనుము. లేకపోతో ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వవచ్చు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు.

18. రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.

18. “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తిమంతమైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు.

19. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడ వేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములును జనులును ఆ యా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి.

19. పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడుచుండిరి. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింప తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచు కుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు.

20. అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను.
అపో. కార్యములు 12:23

20. కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయినాడు, మొండి వాడయ్యాడు. అందువల్ల అతని నుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది.

21. అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడా యెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్య ములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించు నని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.

21. అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవిగాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చు కొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించు వాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించ గలడని తెలుసుకొన్నాడు.

22. బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి.

22. “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షెస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు,

23. ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచు కొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.
ప్రకటన గ్రంథం 9:20

23. అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరొధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయం నుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజో ద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు.

24. కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్‌ ఉఫార్సీన్‌.

24. ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు.

25. ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను.

25. ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి: మెనే మెనే టెకేల్ ఊఫర్సీన్.

26. టెకేల్‌ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి.

26. “ఈ మాటలకు అర్థం ఇది: మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు.

27. ఫెరేన్‌ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.

27. టేకల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు.

28. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని

28. ఊఫర్సిన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసి వేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”

29. మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి.

29. తర్వాత బెల్షెస్సరు ఊదారంగు బట్టలు దానియేలు ధరించేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు.

30. ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను.

30. ఆ రాత్రే బబులోను రాజైన బెల్షెస్సరు హతుడయ్యాడు.

31. మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను.

31. దర్యావేషు అనే పేరుగల మాదీయుడు క్రొత్తగా రాజు అయ్యాడు. దర్యావేషు సుమారు అరవై రెండు యేండ్లవాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Daniel - దానియేలు 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

బెల్షస్జార్ యొక్క దుర్మార్గపు విందు; గోడపై చేతి రాత. (1-9) 
బెల్షస్జార్ బహిరంగంగా దేవుని తీర్పులను ధిక్కరించాడు మరియు చాలా మంది చరిత్రకారులు సైరస్ బాబిలోన్‌ను ముట్టడించినప్పుడు ఇదేనని నమ్ముతారు. ప్రజలు తమ సౌలభ్యం మరియు ఆనందానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇది రాబోయే పతనానికి నిగూఢమైన సూచన. అటువంటి వినోదం పవిత్రమైన విషయాలను అపవిత్రం చేసినప్పుడు ఇది చాలా పాపం. ఆధునిక విందులలో పాడే అనేక పాటలు అన్యమత దేవతలకు అందించే ప్రశంసల కంటే మెరుగైనవి కావు. దేవుడు బెల్షస్సరు మరియు అతని ప్రభువులను ఎలా భయపెట్టాడో చూడండి. గర్వించదగిన పాపాత్ముని వణికిపోయేలా చేయడానికి దేవుడు వ్రాసిన వాక్యం యొక్క ఉనికి మాత్రమే సరిపోతుంది. దేవుని గురించి మనం గ్రహించగలిగేది, ఆయన సృష్టి ద్వారా లేదా ఆయన గ్రంథాల ద్వారా, మనం చూడలేని భాగానికి భక్తితో నింపాలి. దేవుని వేలు అలాంటి భయాన్ని కలిగించగలిగితే, అతని పూర్తిగా బహిర్గతం చేయబడిన చేయి యొక్క శక్తిని ఊహించుకోండి. ఆయన ఎవరు? రాజు యొక్క అపరాధ మనస్సాక్షి అతనికి స్వర్గం నుండి శుభవార్త ఎదురుచూడడానికి కారణం లేదని అతనికి గుర్తు చేసింది.
క్షణికావేశంలో, దేవుడు అత్యంత మొండి పాపి హృదయాన్ని కూడా కదిలించగలడు. తరచుగా, వారి స్వంత ఆలోచనలు వారిని ఇబ్బంది పెట్టడానికి అనుమతించడమే మరియు బాధ కలిగించడానికి ఇది సరిపోతుంది. వారి ప్రాపంచిక ఆనందాలు, ఉల్లాసం మరియు ఆడంబరాల మధ్య పాపిని పట్టుకోగల అంతర్గత వేదనతో ఏ శారీరక బాధ సరిపోదు. కొన్నిసార్లు, ఈ భయాందోళనలు ఒక వ్యక్తిని క్రీస్తులో క్షమాపణ మరియు శాంతిని పొందేలా చేస్తాయి. అయినప్పటికీ, చాలామంది తమ పాపాలకు నిజమైన పశ్చాత్తాపం లేకుండా దేవుని కోపానికి భయపడి కేకలు వేస్తారు, ఖాళీ పరధ్యానంలో ఓదార్పుని కోరుకుంటారు. తమను తాము జ్ఞానులమని భావించుకునే వారు పవిత్ర లేఖనాల గురించిన అజ్ఞానం మరియు అనిశ్చితి, బెల్షస్జర్ ఆస్థానంలోని జ్ఞానుల వలె పాపుల నిరాశను మరింతగా పెంచుతాయి.

దానిని అర్థం చేసుకోవడానికి దానియేలు పంపబడ్డాడు. (10-17) 
తొంభై సంవత్సరాల వయస్సులో, దానియేలు రాజ న్యాయస్థానంలో మరుగున పడిపోయాడు. చాలా మంది ఉత్సుకతతో కూడిన విషయాలపై లేదా సంక్లిష్టమైన సమస్యలను విప్పుటకు దేవుని సేవకుల నుండి మార్గనిర్దేశం చేసినప్పటికీ, వారు మోక్షానికి మార్గం లేదా నీతి మార్గం గురించి విచారించడాన్ని తరచుగా విస్మరించారు. దానియేలు వాగ్దానం చేసిన బహుమతులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు మరియు బదులుగా బెల్షస్జర్‌ను ఖండించిన వ్యక్తిగా సంబోధించాడు. విశ్వాసం ద్వారా, ప్రాపంచిక సాధనల యొక్క ఆసన్న ముగింపును మనం గుర్తించినప్పుడు, ప్రాపంచిక బహుమతులు మరియు బహుమతులను తక్కువ స్థాయిలో ఉంచడం మనకు కీలకం. అయితే, ఈ ప్రపంచంలో మన విధులను నెరవేర్చడానికి మరియు ఇతరులకు నిజమైన సేవను అందించడానికి మనం కట్టుబడి ఉందాం.

దానియేలు రాజును నాశనం చేయడం గురించి హెచ్చరించాడు. (18-31)
దానియేలు బెల్షస్జర్ యొక్క రాబోయే వినాశనాన్ని ముందే చెప్పాడు. నెబుకద్నెజరు అనుభవాల్లో కనిపించే హెచ్చరికలను పట్టించుకోవడంలో బెల్షస్జర్ విఫలమయ్యాడు మరియు అతను బహిరంగంగా దేవుణ్ణి అవమానించాడు. పాపులు తరచుగా చెవిటి, గుడ్డి మరియు అజ్ఞాన దేవతలను ఆరాధించడంలో ఓదార్పుని పొందుతారు, కాని వారు చివరికి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ద్వారా తీర్పును ఎదుర్కొంటారు. గోడపై వ్రాసిన తీర్పును దానియేలు అర్థంచేసుకున్నాడు. ఇవన్నీ ప్రతి పాపి యొక్క విధికి వర్తించవచ్చు. ఒక పాప జీవితం ముగిసినప్పుడు, వారి రోజులు లెక్కించబడతాయి మరియు పూర్తవుతాయి; మరణానంతరం తీర్పు వస్తుంది, అక్కడ వారు అంచనా వేయబడతారు మరియు లేకపోవడం కనుగొనబడుతుంది. తీర్పును అనుసరించి, పాపాత్ముడు వేరు చేయబడి, దెయ్యానికి మరియు అతని అనుచరులకు వేటాడతాడు.
ఈ సంఘటనలు ప్యాలెస్‌లో జరిగినప్పుడు, సైరస్ సైన్యం నగరంలోకి ప్రవేశించిందని నమ్ముతారు. బెల్షస్జార్ మరణంతో, సాధారణ లొంగుబాటు జరిగింది. పశ్చాత్తాపపడని ప్రతి పాపాత్ముడు, ధర్మశాస్త్ర సారాంశంలో స్వీయ-నీతిమంతుడైన పరిసయ్యుడిగా లేదా సువార్త యొక్క సమతుల్యతలో మోసపూరిత వేషధారిగా పరిగణించబడినా, దేవుని వాక్యం యొక్క నెరవేర్పును త్వరలోనే చూస్తాడు.



Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |