Leviticus - లేవీయకాండము 2 | View All

1. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి

1. If any soul will offer a meatoffering unto the LORD, his offering shall be fine flour, and he shall pour thereto oil, and put frankincense thereon,

2. యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.

2. and shall bring it unto Aaron's sons the priests. And one of them shall take thereout his handful of the flour, and of the oil with all the frankincense, and burn it for a memorial upon the altar: an offering of a sweet savour unto the LORD.

3. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.

3. And the remnant of the meatoffering shall be Aaron's and his sons, as a thing most holy of the sacrifices of the LORD.

4. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను.

4. If any man bring a meatoffering that is baken in the oven, let him bring sweet cakes of fine flour mingled with oil, and unleavened wafers anointed with oil.

5. నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.

5. If thy meatoffering be baken in the frying pan, then it shall be of sweet flour mingled with oil.

6. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.

6. And thou shalt mince it small, and pour oil thereon: and so is it a meatoffering.

7. నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను.

7. If thy meatoffering be a thing broiled upon the gridiron, of flour mingled with oil it shall be.

8. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను

8. And thou shalt bring the meatoffering that is made of these things unto the LORD, and shalt deliver it unto the priest, and he shall bring it unto the altar,

9. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను.

9. and shall heave up part of the meatoffering for a memorial, and shall burn it upon the altar: an offering of a sweet savour unto the LORD.

10. ఆ నైవేద్యశేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.

10. And that which is left of the meatoffering shall be Aaron's and his sons, as a thing that is most holy of the offerings of the LORD.

11. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు.

11. All the meatofferings which ye shall bring unto the LORD, shall be made without leaven. For ye shall neither burn leaven nor honey in any offering of the LORD:

12. ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింప వలదు.

12. Notwithstanding ye shall bring the firstlings of them unto the LORD: But they shall not come upon the altar to make a sweet savour.

13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.

13. All thy meatofferings thou shalt salt with salt: neither shalt thou suffer the salt of the covenant of thy God to be lacking from thy meatoffering: but upon all thine offerings thou shalt bring salt.

14. నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను.

14. If thou offer a meatoffering of the first ripe fruits unto the LORD, then take of that which is yet green, and dry it by the fire and beat it small, and so offer the meatoffering of thy first ripe fruits.

15. అది నైవేద్యరూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను.

15. And then pour oil thereto, and put frankincense thereon: and so it is a meatoffering.

16. అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

16. And the priest shall burn part of the beaten corn and part of that oil, with all the frankincense, for a remembrance. That is an offering unto the LORD.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
పిండి యొక్క మాంసం-నైవేద్యం. (1-11) 
మాంసాహార నైవేద్యాలు మన ఆత్మలకు జీవపు రొట్టెగా దేవుడు మనకు అందించిన యేసు యొక్క చిహ్నం లాంటివి. మన దగ్గర ఉన్న ప్రతిదానికీ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మరియు ఆయనను సంతోషపరిచే మంచి పనులను చేయడం మన బాధ్యతను కూడా వారు గుర్తుచేస్తారు. నైవేద్యాలు ఆహారంగా తినడానికి ఉద్దేశించబడ్డాయి, కాల్చడం కాదు. అయితే మనము యేసును విశ్వసించి, మన పూర్ణహృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తేనే ఈ అర్పణలను చేయగలము. పులియబెట్టడం గర్వంగా ఉండటం, నీచంగా ఉండటం లేదా అబద్ధం చెప్పడం వంటి చెడు విషయాలను సూచిస్తుంది, అయితే తేనె మన విశ్వాసం నుండి మనల్ని దూరం చేసే మరియు మంచి పనులు చేయడం వంటి వాటిని సూచిస్తుంది. యేసు ఎప్పుడూ చెడుగా లేదా స్వార్థపూరితంగా ఏమీ చేయలేదు మరియు అతని జీవితం మరియు మరణం స్వార్థ ఆనందానికి వ్యతిరేకం. మనం యేసులా ఉండేందుకు ప్రయత్నించాలి మరియు ఆయన మాదిరిని అనుసరించాలి.

ప్రథమ ఫలాల సమర్పణ. (12-16)
ప్రజలు తనకు ఇచ్చిన అర్పణలన్నింటికీ ఉప్పు కలపాలని దేవుడు కోరుకున్నాడు. వారి త్యాగాలు వారి స్వంతంగా సరిపోవని మరియు వారిని మెరుగుపరచడానికి అదనంగా ఏదైనా అవసరమని ఇది చూపించింది. క్రైస్తవ మతం ప్రపంచానికి ఉప్పు లాంటిది, దానిని మంచి ప్రదేశంగా చేస్తుంది. నూనె మరియు సుగంధ ద్రవ్యాలతో పాటు వారి మొదటి మరియు ఉత్తమమైన పంటలను నైవేద్యంగా ఇవ్వాలని దేవుడు ప్రజలకు చెప్పాడు. ఇది దేవుని పట్ల కృతజ్ఞత మరియు వినయాన్ని చూపుతుంది మరియు దేవుని పట్ల ప్రేమ మరియు భక్తిని చూపించే యువకులు కూడా అతనిని సంతోషపరుస్తారు. మనం ఈ నియమాలను ఖచ్చితంగా పాటించనవసరం లేదు కనుక మనం అదృష్టవంతులం, ఎందుకంటే యేసు ఇప్పటికే మన కోసం ప్రతిదీ చేసాడు. అయితే మనం దేవుడు అంగీకరించబడాలంటే యేసుపై మరియు ఆయన పనిపై ఆధారపడాలని మనం ఇంకా గుర్తుంచుకోవాలి.



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |