Leviticus - లేవీయకాండము 24 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. The LORD told Moses

2. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.

2. to say to the community of Israel: You must supply the purest olive oil for the lamps in the sacred tent, so they will keep burning.

3. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

3. Aaron will set up the gold lampstand in the holy place of the sacred tent. Then he will light the seven lamps that must be kept burning there in my presence, every night from now on. This law will never change.

4. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.

4. (SEE 24:3)

5. నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.
మత్తయి 12:4, మార్కు 2:26, లూకా 6:4

5. Use your finest flour to bake twelve loaves of bread about four pounds each,

6. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.

6. then take them into the sacred tent and lay them on the gold table in two rows of six loaves.

7. ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా యెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును.

7. Alongside each row put some pure incense that will be sent up by fire in place of the bread as an offering to me.

8. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను.

8. Aaron must lay fresh loaves on the table each Sabbath, and priests in all generations must continue this practice as part of Israel's agreement with me.

9. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము.

9. This bread will always belong to Aaron and his family; it is very holy because it was offered to me, and it must be eaten in a holy place.

10. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను.

10. Shelomith, the daughter of Dibri from the tribe of Dan, had married an Egyptian, and they had a son. One day their son got into a fight with an Israelite man in camp and cursed the name of the LORD. So the young man was dragged off to Moses,

11. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమారె

11. (SEE 24:10)

12. యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.

12. who had him guarded while everyone waited for the LORD to tell them what to do.

13. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

13. Finally, the LORD said to Moses:

14. శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.

14. This man has cursed me! Take him outside the camp and have the witnesses lay their hands on his head. Then command the whole community of Israel to stone him to death.

15. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.

15. And warn the others that everyone else who curses me will die in the same way, whether they are Israelites by birth or foreigners living among you.

16. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
మత్తయి 26:65-66, మార్కు 14:64, యోహాను 10:33, యోహాను 19:7

16. (SEE 24:15)

17. ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
మత్తయి 5:21

17. Death is also the penalty for murder,

18. జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.

18. but the killing of an animal that belongs to someone else requires only that the animal be replaced.

19. ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.

19. Personal injuries to others must be dealt with in keeping with the crime--

20. విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.
మత్తయి 5:38

20. a broken bone for a broken bone, an eye for an eye, or a tooth for a tooth.

21. జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.

21. It's possible to pay the owner for an animal that has been killed, but death is the penalty for murder.

22. మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను.

22. I am the LORD your God, and I demand equal justice both for you Israelites and for those foreigners who live among you.

23. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెను శపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.

23. When Moses finished speaking, the people did what the LORD had told Moses, and they stoned to death the man who had cursed the LORD.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 24 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
దీపాలకు నూనె, రొట్టె. (1-9) 
రొట్టె మన ఆత్మలకు ఆహారం వంటి యేసును సూచిస్తుంది. అతను ప్రపంచానికి వెలుగుని తెస్తాడు మరియు మనకు ఏది మంచిదో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. మనం అతని గురించి ఆలోచించాలని గుర్తుంచుకోవాలి మరియు ప్రతిరోజూ, ముఖ్యంగా ఆదివారం నాడు అతనికి కృతజ్ఞతలు చెప్పాలి. రొట్టెలను ప్రత్యేక స్థలంలో ఉంచినట్లు, మనం బయలుదేరే సమయం వరకు మనం దేవునికి దగ్గరగా ఉండాలి.

దైవదూషణ, దూషకుడు రాళ్లతో కొట్టబడ్డాడు. (10-23)
ఒక వ్యక్తికి ఈజిప్టు తండ్రి మరియు ఒక ఇజ్రాయెల్ తల్లి ఉన్నారు. విభిన్న నేపథ్యాల వ్యక్తులు వివాహం చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది కాదని ఇది చూపించింది. ఈ వ్యక్తి దేవుని గురించి నీచమైన మాటలు చెప్పాడు కాబట్టి, అలా చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని కొత్త నియమం వచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన వారు కాకపోయినా ఈ నియమం అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడటం మరియు తప్పు చేస్తే శిక్షించబడటం చాలా ముఖ్యం. దేవుని గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులు ఇతరుల నుండి ఇబ్బంది పడకపోయినా, వారు చేసిన దానికి దేవుడు వారిని శిక్షిస్తాడు. ఎవరైనా దేవుని గురించి చెడుగా మాట్లాడితే అది నిజంగా చెడ్డది, మరియు వారు ఆయనను ఇష్టపడరని చూపిస్తుంది. పాత రోజుల్లో కూడా, మోషే నియమాలను అగౌరవపరిచిన వ్యక్తులు శిక్షించబడ్డారు, కాబట్టి యేసు బోధనలను అగౌరవపరిచే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి! మనం కోపం తెచ్చుకోకుండా, చెడు పనులు చేయకుండా, చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉంటూ, ఇతరులు లేకపోయినా, ఎల్లప్పుడూ దేవుని పేరు పట్ల గౌరవం చూపుతూ ఉండాలి. 



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |