Leviticus - లేవీయకాండము 9 | View All

1. ఎనిమిదవదినమున మోషే అహరోనును అతని కుమారు లను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి

2. అహరోనుతో ఇట్లనెనునీవు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను, దహనబలిగా నిర్దోషమైన యొక పొట్టే లును యెహోవా సన్నిధికి తీసికొని రమ్ము.

“పాపాలకోసమైన బలి”– లేవీయకాండము 4:3 హెబ్రీయులకు 5:1-3. ఈ విషయంలో అహరోనును గురించి అతడు క్రీస్తుకు చిహ్నంగా గాక, అతని నిజ స్వభావాన్ని బట్టే ఇలా రాసివుంది. ఇస్రాయేల్ వారందరి లాగానే, మనుషులందరి లాగానే అహరోను కూడా పాపి. ప్రజల పాపాలకోసం ధర్మవిధులను నెరవేర్చాలంటే ముందు అతని స్వంత పాపాల విషయం చూడాలి.

3. మరియు నీవు ఇశ్రాయేలీయులతోమీరు యెహోవా సన్నిధిని బలి నర్పించునట్లు పాపపరిహారార్థబలిగా నిర్దోషమైన మేక పిల్లను, దహనబలిగా నిర్దోషమైన యేడాది దూడను గొఱ్ఱపిల్లను

“యెహోవా మీకు ప్రత్యక్షమౌతాడు”– 23,24 వచనాలు; నిర్గమకాండము 29:43.

4. సమాధానబలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసికొని రండి; నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము.

5. మోషే ఆజ్ఞాపించినవాటిని వారు ప్రత్యక్షపు గుడారము నెదుటికి తీసికొనివచ్చిరి. సమాజ మంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా

6. మోషేమీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞా పించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను.

దేవుని మహిమాప్రకాశాన్ని మనం చూడాలంటే ఆయనలో నమ్మకం ఉంచి ఆయన ఆదేశాలను అనుసరించాలి (యోహాను 11:40 యోహాను 17:24).

7. మరియమోషే అహరోనుతో ఇట్లనెనునీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్త మును ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించి నట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము.
Heb,5,3-,727

8. కాబట్టి అహ రోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను.

9. అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.

10. దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలి పీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

11. దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను.

12. అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠముచుట్టు దానిని ప్రోక్షించెను.

13. మరియు వారు దహన బలిపశువుయొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలి పీఠముమీద వాటిని దహించెను.

14. అతడు దాని ఆంత్రము లను కాళ్లను కడిగి బలిపీఠముమీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను.

15. అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాప పరిహారార్థబలిగా అర్పించెను.

16. అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను.

17. అప్పు డతడు నైవేద్యమును తెచ్చి దానిలోనుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠముమీద తీసిన దానిని దహించెను.

18. మరియమోషే ప్రజలు అర్పించు సమాధానబలిరూపమైన కోడెదూడను పొట్టే లును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టు దానిని ప్రోక్షించెను.

19. మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజముమీది వపను అప్పగించిరి.

20. బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహించెను.

21. బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణ ముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

22. అప్పుడు అహరోను పాపపరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను.

ఈ రెండు అసామాన్యమైన వచనాల్లో యేసుప్రభువుకు సూచనగా ఉన్న బలి అర్పణ పూర్తి అయిన తరువాత దేవుని మహిమాప్రకాశం దిగిరావడం చూస్తున్నాం. అంటే యేసు పాపులకోసం చనిపోయిన సిలువ విషయంలో దేవుని మహిమా ప్రకాశం వెల్లడి అయిందన్నమాట. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన దేవుని స్వభావాన్ని వెల్లడించినంత స్పష్టంగా మానవ చరిత్ర అంతట్లో మరే సంఘటనలోనూ, సందర్భంలోనూ జరగలేదు. దేవుని మహిమా ప్రకాశానికి ప్రాణం దేవుని స్వభావమే (నిర్గమకాండము 33:18-19 నిర్గమకాండము 34:5-7). అర్పణ జరిగిన తరువాత ప్రజలమీదికి దేవుని దీవెనలు వచ్చాయని కూడా చూస్తున్నాం. అబ్రాహాము సంతానం ద్వారా దేవుడు మానవాళికి ఇస్తానన్న దీవెనలన్నిటికీ మూలాధారం క్రీస్తు సిలువే (ఈ దీవెనల గురించి ఆదికాండము 12:3 ఆదికాండము 22:18 మొ।। చూడండి). ఇక్కడ లేవీయకాండంలో ప్రజలను వేరువేరుగా రెండుసార్లు దీవించడం జరిగింది. 22వ వచనంలో అహరోను బలులను అర్పించిన తరువాత చేతులెత్తి ప్రజలను దీవించాడు. లూకా 24:50 లో ఈ చిహ్నం యేసుప్రభువు తన శిష్యులను దీవించడం ద్వారా నెరవేరింది. అటు తరువాత మోషే, అహరోనులు ప్రజలకు కనిపించకుండా సన్నిధి గుడారంలోకి వెళ్ళారు. ఇది లూకా 24:51 అపో. కార్యములు 1:9 లో నెరవేరింది. మోషే అహరోనులు తిరిగి బయటకు వచ్చాక మళ్ళీ ప్రజలను దీవించారు. ప్రస్తుతం యేసు ప్రభువు పరలోకంలోని నిజ సన్నిధి గుడారంలోనే ఉన్నాడు. అయితే ఆయన మోషే ధర్మశాస్త్రాన్నీ, అహరోను ప్రముఖయాజికి చెందిన ధర్మాన్నీ పూర్తిగా నెరవేర్చేవాడుగా దేవుని పరిపూర్ణ దీవెనలను ఇచ్చేందుకూ తిరిగి వస్తాడు (రోమీయులకు 8:18-25 1 కోరింథీయులకు 15:51-54 ప్రకటన గ్రంథం 11:1-9 ప్రకటన గ్రంథం 19:11 ప్రకటన గ్రంథం 22:5). దేవుడు నియమించిన సమయం వచ్చేవరకు ఆయన పరలోకంలో ఉంటాడు (అపో. కార్యములు 3:19-21).

23. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడా రములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను.

24. యెహోవా సన్నిధినుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీద నున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి.

సన్నిధి గుడారంలోకి వెళ్ళకముందే అహరోను బలిపశువులను చంపి రక్తాన్ని ఒలికించి అర్పణలను బలిపీఠం మీద ఉంచాడు. బలిపీఠంమీద ఉన్న మంటల్లో అర్పణల కారణంగా కలిగిన దీవెనలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అయితే సన్నిధి గుడారంలోనుంచి మోషే అహరోనులు బయటకు వచ్చిన తరువాతే దేవుడు ఆ అర్పణ పట్ల తన సంపూర్ణ సమ్మతిని బహిరంగంగా వెల్లడి చేశాడు. ఇది సూచించేదేమంటే దేవుడు తన కుమారుని బలి అర్పణను పూర్తిగా అంగీకరించిన విషయం లోకప్రజలందరికీ తేటతెల్లంగా వెల్లడయ్యేది క్రీస్తు రెండో రాకడ సమయంలోనే. ఫిలిప్పీయులకు 2:10-11 మొదలైన వచనాలు నెరవేరేది అప్పుడే. దానిమూలంగా దేవుని ప్రజలకు ఎంత సంబరం కలుగుతుందో!



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |