Nahum - నహూము 3 | View All

1. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడ తెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.

1. Woe to the city of blood, full of lies, full of plunder, never without victims!

2. సారధియొక్క చబుకు ధ్వనియు చక్రములధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథములధ్వనియు వినబడు చున్నవి.

2. The crack of whips, the clatter of wheels, galloping horses and jolting chariots!

3. రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు.

3. Charging cavalry, flashing swords and glittering spears! Many casualties, piles of dead, bodies without number, people stumbling over the corpses

4. చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివే సినదానా,

4. all because of the wanton lust of a prostitute, alluring, the mistress of sorceries, who enslaved nations by her prostitution and peoples by her witchcraft.

5. నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.

5. 'I am against you,' declares the LORD Almighty. 'I will lift your skirts over your face. I will show the nations your nakedness and the kingdoms your shame.

6. పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమాన పరచెదను.

6. I will pelt you with filth, I will treat you with contempt and make you a spectacle.

7. అప్పుడు నిన్ను చూచు వారందరు నీయొద్ద నుండి పారిపోయి నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు.

7. All who see you will flee from you and say, 'Nineveh is in ruinswho will mourn for her?' Where can I find anyone to comfort you?'

8. సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహు జనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నో అమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?

8. Are you better than Thebes, situated on the Nile, with water around her? The river was her defense, the waters her wall.

9. కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి.

9. Cush and Egypt were her boundless strength; Put and Libya were among her allies.

10. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.

10. Yet she was taken captive and went into exile. Her infants were dashed to pieces at every street corner. Lots were cast for her nobles, and all her great men were put in chains.

11. నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.

11. You too will become drunk; you will go into hiding and seek refuge from the enemy.

12. అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;

12. All your fortresses are like fig trees with their first ripe fruit; when they are shaken, the figs fall into the mouth of the eater.

13. నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల యడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.

13. Look at your troops they are all weaklings. The gates of your land are wide open to your enemies; fire has consumed the bars of your gates.

14. ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము.

14. Draw water for the siege, strengthen your defenses! Work the clay, tread the mortar, repair the brickwork!

15. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంత విస్తారముగాను మిడుత లంత విస్తారముగాను ఉండుము.

15. There the fire will consume you; the sword will cut you down and it will devour you like a swarm of locusts. Multiply like grasshoppers, multiply like locusts!

16. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను.

16. You have increased the number of your merchants till they are more than the stars in the sky, but like locusts they strip the land and then fly away.

17. నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరి పోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.

17. Your guards are like locusts, your officials like swarms of locusts that settle in the walls on a cold day but when the sun appears they fly away, and no one knows where.

18. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధా నులు పండుకొనిరి, నీ జనులు పర్వతములమీద చెదరి పోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు.

18. King of Assyria, your shepherds slumber; your nobles lie down to rest. Your people are scattered on the mountains with no one to gather them.

19. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త విను వారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.

19. Nothing can heal you; your wound is fatal. All who hear the news about you clap their hands at your fall, for who has not felt your endless cruelty?



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Nahum - నహూము 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నీనెవె యొక్క పాపాలు మరియు తీర్పులు. (1-7) 
తమ తప్పులో గర్వించే వ్యక్తులు పతనాన్ని ఎదుర్కొన్నప్పుడు, అహంకారంతో తమను తాము పెంచుకోవద్దని అది ఇతరులకు రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. ఈ అద్భుతమైన నగరం యొక్క క్షీణత మోసం మరియు దోపిడీ ద్వారా సంపదను కూడబెట్టుకునే వ్యక్తులకు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది. ఇటువంటి చర్యలు శత్రుత్వానికి బీజాలు వేస్తాయి మరియు ఈ భూమ్మీద శిక్ష విధించాలని దైవం నిర్ణయించుకుంటే, వారు సానుభూతి లేకుండా చూస్తారు. తమ స్వంత శ్రేయస్సు, భద్రత మరియు ప్రశాంతత కోసం ప్రయత్నించే ప్రతి వ్యక్తి తమను తాము చిత్తశుద్ధితో మరియు గౌరవంగా ప్రవర్తించడమే కాకుండా అందరికీ దయను కూడా అందించాలి.

దాని పూర్తి విధ్వంసం. (8-19)
అత్యంత శక్తివంతమైన కోటలు కూడా దేవుని తీర్పుల నుండి ఎటువంటి రక్షణను అందించవు. వారు తమను తాము రక్షించుకోవడానికి పూర్తిగా శక్తిలేనివారు. కల్దీయులు, మాదీయులు తిండిపోతు పురుగుల్లా భూమిని తినేస్తారు. అదేవిధంగా, అస్సిరియన్లు వారి స్వంత అనేక అద్దె దళాలచే మ్రింగివేయబడతారు, వారు ఇక్కడ "వ్యాపారులు"గా సూచించబడతారు. పొరుగువారిపై అన్యాయానికి పాల్పడిన వారు చివరికి పరిణామాలను ఎదుర్కొంటారు. నీనెవె మరియు అనేక ఇతర నగరాలు, రాష్ట్రాలు మరియు సామ్రాజ్యాల పతనం మనకు ఒక హెచ్చరిక కథగా ఉపయోగపడుతుంది.
స్థానం లేదా బలం యొక్క ఏవైనా ప్రయోజనాల కంటే ఎక్కువ భద్రతను మరియు బలమైన రక్షణను అందించే నిజమైన క్రైస్తవులు మన మధ్య ఉండటం తప్ప, మనం ఏదైనా మెరుగ్గా ఉన్నారా? ప్రభువు ప్రజలను ఎదిరించినప్పుడు, వారు ఆధారపడే ప్రతి వస్తువు క్షీణిస్తుంది లేదా అవరోధంగా నిరూపించబడుతుంది. అయినప్పటికీ, అతను ఇశ్రాయేలు పట్ల దయ చూపుతూనే ఉన్నాడు. కష్ట సమయాల్లో ప్రతి విశ్వాసికి, అతను ముట్టడి చేయలేని లేదా పట్టుకోలేని దుర్భేద్యమైన కోట, మరియు తనపై నమ్మకం ఉంచేవారిని అతను గుర్తిస్తాడు.



Shortcut Links
నహూము - Nahum : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |