Zechariah - జెకర్యా 10 | View All

1. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును.

1. Ask rain from Jehovah in the time of the latter rain. Jehovah shall make storm clouds, and He gives them showers of rain, grass to everyone in the field.

2. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱెలమంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి.
మత్తయి 9:36, మార్కు 6:34

2. For the family idols speak iniquity, and the diviners have seen a lie and have told false dreams. They comfort in vain; therefore they wandered like a flock; they were troubled because there was no shepherd.

3. నా కోపాగ్ని మండుచు కాపరులమీద పడును, మేకలను నేను శిక్షించెదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వములవంటివారినిగా చేయును.

3. My anger was kindled against the shepherds, and I will punish the he-goats; for Jehovah of Hosts has visited His flock the house of Judah, and has made them as His beautiful horse in battle.

4. వారిలోనుండి మూల రాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలు గును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,

4. Out of Him came the cornerstone; out of Him the nail; out of Him the battle bow; out of Him every oppressor together.

5. వారు యుద్ధముచేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలె ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధముచేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు.

5. And they shall be like mighty ones who trample the mud of the streets in the battle. And they shall fight because Jehovah is with them, and they shall make the riders on horses ashamed.

6. నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు.

6. And I will strengthen the house of Judah, and I will save the house of Joseph, and I will return to save them; for I have pity on them. And they shall be as though I had not cast them off; for I am Jehovah their God, and I will answer them.

7. ఎఫ్రా యిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు, వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవాను బట్టివారు హృదయపూర్వకముగా ఉల్లసించు దురు.

7. And Ephraim shall be like a mighty one, and their heart shall rejoice as by wine. And their sons shall see and be glad; their heart shall rejoice in Jehovah.

8. నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు.

8. I will hiss for them and gather them; for I have redeemed them. And they shall be many as they were many.

9. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసికొందురు, వారును వారి బిడ్డలును సజీవులై తిరిగి వత్తురు,

9. And I will sow them among the peoples, and they shall remember Me in the distances; and they shall live with their sons and return.

10. ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశ ములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను.

10. I will return them out of the land of Egypt, and I will gather them out of Assyria; and I will bring them into the land of Gilead and Lebanon; for room shall not be found for them.

11. యెహోవా దుఃఖసముద్రమునుదాటి సముద్రతరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయ బడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.

11. And he shall pass through the sea of distress, and shall strike the waves in the sea; and all the depths of the Nile shall dry up. And the pride of Assyria shall be humbled, and the scepter of Egypt shall move away.

12. నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు.

12. And I will strengthen them in Jehovah; and they shall walk up and down in His name, says Jehovah.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Zechariah - జెకర్యా 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవుని నుండి దీవెనలు పొందాలి. (1-5) 
భూసంబంధమైన సమృద్ధికి ప్రతీకాత్మక సూచనల ద్వారా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు వాగ్దానం చేయబడ్డాయి. సకాలంలో వర్షం అనేది చాలా అవసరమైనప్పుడు మనం దేవుని నుండి కోరుకునే గొప్ప దయ, మరియు అది సరైన సమయంలో వస్తుందని మనం ఆశించవచ్చు. మన ప్రార్థనలలో, వారి నిర్ణీత సమయాలలో మనం ఈ ఆశీర్వాదాలను అభ్యర్థించాలి. ప్రభువు ప్రయోజనకరమైన పరిస్థితులను తీసుకురావడానికి మరియు మనకు అవసరమైన ఆశీర్వాదాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేఖనాల్లో వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను పొందేందుకు మరియు ఆస్వాదించడానికి విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని వెతకడానికి ఇది ప్రోత్సాహకంగా కూడా చూడవచ్చు.
వారి పూర్వీకులు చేసినట్లుగా, విగ్రహాలను ఆశ్రయించడం యొక్క మూర్ఖత్వాన్ని ప్రవక్త నొక్కిచెప్పాడు. ప్రభువు, తన దయతో, తన ప్రజలలో మిగిలి ఉన్న విశ్వాసులను సందర్శించాడు మరియు రాబోయే సవాళ్లు మరియు విజయాల కోసం వారి బలాన్ని మరియు ధైర్యాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి సృష్టికి దేవుడు కేటాయించిన ప్రాముఖ్యత ఉంది. ఒక జాతికి మద్దతు ఇవ్వడానికి వ్యక్తులను పెంచడం, భవనంలో మూలస్తంభం వంటిది, లేదా విభేదాలు ఉన్నవారిని ఏకం చేయడం, వివిధ కలపలను బంధించే మేకులు వంటివి, అదంతా ప్రభువు నుండి ఉద్భవించింది. తమ ప్రత్యర్థులను అధిగమించడానికి పిలువబడే వారు అతని నుండి తమ బలాన్ని మరియు విజయాన్ని పొందాలి. ఇది క్రీస్తుకు అన్వయించవచ్చు, ఎందుకంటే ఆయన ప్రజలను ఏకం చేయడానికి, నిలబెట్టడానికి మరియు రక్షించడానికి వ్యక్తులను పెంచడానికి ఆయన మూలం. వృధాగా తన్ను వెదికేవారిని ఆయన ఎన్నటికీ తిప్పుకోడు.

దేవుడు తన ప్రజలను పునరుద్ధరించును. (6-12)
ఈ అమూల్యమైన వాగ్దానాలు దేవుని ప్రజలకు విస్తరించబడ్డాయి మరియు అవి యూదు ప్రజల స్థితికి మరియు చర్చి యొక్క భవిష్యత్తుకు సంబంధించినవి. సువార్త ప్రకటించడం అనేది ఆత్మలు యేసుక్రీస్తు వద్దకు రావాలని దేవుడు ఇచ్చిన దైవిక పిలుపు. క్రీస్తు తన రక్తముతో విమోచించిన వారు దేవుని కృపచేత సమీకరించబడతారు. ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయుల విమోచన మాదిరిగానే ఏవైనా అడ్డంకులు సులభంగా మరియు ప్రభావవంతంగా అధిగమించబడతాయి. దేవుడే వారికి బలాన్ని అందజేస్తాడు మరియు వారి ప్రేరణకు మూలంగా ఉంటాడు. మన ఆధ్యాత్మిక విరోధులను ఎదిరించి, జయించినప్పుడు, మన హృదయాలు సంతోషంతో నిండిపోతాయి. దేవుడు మనలను శక్తివంతం చేస్తే, మనం మన క్రైస్తవ విధులన్నిటిలో శ్రద్ధగా ఉండాలి మరియు దేవుని పనిలో చురుకుగా పాల్గొనాలి, ఎల్లప్పుడూ ప్రభువైన యేసు నామంలో పనిచేస్తూ ఉండాలి.



Shortcut Links
జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |