Numbers - సంఖ్యాకాండము 18 | View All

1. యెహోవా అహరోనుతో ఇట్లనెనునీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవ లోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు

1. And the LORD said unto Aaron: 'Thou and thy sons and thy father's house with thee shall bear the iniquity of the sanctuary; and thou and thy sons with thee shall bear the iniquity of your priesthood.

2. మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను
హెబ్రీయులకు 9:6

2. And thy brethren also of the tribe of Levi, the tribe of thy father, bring thou with thee, that they may be joined unto thee and minister unto thee; but thou and thy sons with thee shall minister before the tabernacle of witness.

3. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండ వలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు.

3. And they shall keep thy charge and the charge of all the tabernacle; only they shall not come nigh the vessels of the sanctuary and the altar, that neither they, nor ye also, die.

4. వారు నీతో కలిసి ప్రత్య క్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను.

4. And they shall be joined unto thee, and keep the charge of the tabernacle of the congregation for all the service of the tabernacle; and a stranger shall not come nigh unto you.

5. అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడ వలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.

5. And ye shall keep the charge of the sanctuary and the charge of the altar, that there be no wrath any more upon the children of Israel.

6. ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయు లైన మీ సహోద రులను తీసికొని యున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు.

6. And I, behold, I have taken your brethren the Levites from among the children of Israel. To you they are given as a gift for the LORD, to do the service of the tabernacle of the congregation.

7. కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపుసేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.

7. Therefore thou and thy sons with thee shall keep your priest's office for every thing of the altar and within the veil; and ye shall serve. I have given your priest's office unto you as a service of gift, and the stranger who cometh nigh shall be put to death.'

8. మరియయెహోవా అహరోనుతో ఇట్లనెనుఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చి యున్నాను; అభి షేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.
1 కోరింథీయులకు 9:13

8. And the LORD spoke unto Aaron: 'Behold, I also have given thee the charge of Mine heave offerings of all the hallowed things of the children of Israel. Unto thee have I given them by reason of the anointing, and to thy sons, by an ordinance for ever.

9. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరి శుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.

9. This shall be thine of the most holy things reserved from the fire: every oblation of theirs, every meat offering of theirs, and every sin offering of theirs, and every trespass offering of theirs, which they shall render unto Me, shall be most holy for thee and for thy sons.

10. ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.

10. In the most holy place shalt thou eat it; every male shall eat it. It shall be holy unto thee.

11. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.

11. And this is thine: the heave offering of their gift, with all the wave offerings of the children of Israel. I have given them unto thee, and to thy sons and to thy daughters with thee, by a statute for ever; every one who is clean in thy house shall eat of it.

12. వారు యెహో వాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్త మైనదంతయు నీకిచ్చితిని.

12. All the best of the oil, and all the best of the wine and of the wheat, the firstfruits of them which they shall offer unto the LORD, them have I given thee.

13. వారు తమ దేశపు పంటలన్ని టిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తిన వచ్చును.

13. And whatsoever is first ripe in the land, which they shall bring unto the LORD, shall be thine. Every one who is clean in thine house shall eat of it.

14. ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.

14. Every thing devoted in Israel shall be thine.

15. మనుష్యులలోనిదేమి జంతువులలోని దేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.

15. Every thing that openeth the womb in all flesh, which they bring unto the LORD, whether it be of men or beasts, shall be thine. Nevertheless the firstborn of man shalt thou surely redeem, and the firstling of unclean beasts shalt thou redeem.

16. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణ మునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.

16. And those that are to be redeemed from a month old shalt thou redeem, according to thine estimation, for the money of five shekels, according to the shekel of the sanctuary which is twenty gerahs.

17. అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱెయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠిత మైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను గాని వాటి మాంసము నీదగును.

17. But the firstling of a cow, or the firstling of a sheep, or the firstling of a goat thou shalt not redeem. They are holy. Thou shalt sprinkle their blood upon the altar, and shalt burn their fat for an offering made by fire for a sweet savor unto the LORD.

18. అల్లాండిపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును.

18. And the flesh of them shall be thine, as the wave breast and as the right shoulder are thine.

19. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమా ర్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్ని ధిని నిత్యమును స్థిరమైన నిబంధన.

19. All the heave offerings of the holy things, which the children of Israel offer unto the LORD, have I given thee, and thy sons and thy daughters with thee, by a statute for ever. It is a covenant of salt for ever before the LORD unto thee and to thy seed with thee.'

20. మరియయెహోవా అహరోనుతో ఇట్లనెనువారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.

20. And the LORD spoke unto Aaron, 'Thou shalt have no inheritance in their land, neither shalt thou have any part among them: I am thy part and thine inheritance among the children of Israel.

21. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.
హెబ్రీయులకు 7:5

21. And behold, I have given the children of Levi all the tenth in Israel for an inheritance for their service which they serve, even the service of the tabernacle of the congregation.

22. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.

22. Neither must the children of Israel henceforth come nigh the tabernacle of the congregation, lest they bear sin and die.

23. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్య మేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

23. But the Levites shall do the service of the tabernacle of the congregation, and they shall bear their iniquity. It shall be a statute for ever throughout your generations that among the children of Israel they have no inheritance.

24. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతి ష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయు లకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రా యేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని.

24. But the tithes of the children of Israel, which they offer as a heave offering unto the LORD, I have given to the Levites to inherit. Therefore I have said unto them: `Among the children of Israel they shall have no inheritance.''

25. మరియయెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను

25. And the LORD spoke unto Moses, saying,

26. నీవు లేవీయులతో ఇట్లనుమునేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.

26. 'Thus speak unto the Levites and say unto them: `When ye take of the children of Israel the tithes which I have given you from them for your inheritance, then ye shall offer up a heave offering of it for the LORD, even a tenth part of the tithe.

27. మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను.

27. And this your heave offering shall be reckoned unto you as though it were the corn of the threshing floor and as the fullness of the wine press.

28. అట్లు మీరు ఇశ్రాయేలీ యులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింప వలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజ కుడైన అహరోనుకు ఇయ్యవలెను.

28. Thus ye also shall offer a heave offering unto the LORD of all your tithes, which ye receive from the children of Israel; and ye shall give thereof the LORD'S heave offering to Aaron the priest.

29. మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను.

29. Out of all your gifts ye shall offer every heave offering of the LORD of all the best thereof, even the hallowed part thereof out of it.'

30. మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగ మును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.

30. Therefore thou shalt say unto them: `When ye have offered the best thereof from it, then it shall be counted unto the Levites as the increase of the threshing floor and as the increase of the wine press.

31. మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము.
మత్తయి 10:10, 1 కోరింథీయులకు 9:13

31. And ye shall eat it in every place, ye and your households, for it is your reward for your service in the tabernacle of the congregation.

32. మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాప శిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీ యుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.

32. And ye shall bear no sin by reason of it, when ye have offered from it the best of it; neither shall ye pollute the holy things of the children of Israel, lest ye die.''



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
యాజకులు మరియు లేవీయుల బాధ్యత. (1-7) 
ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు మరియు భయపడ్డారు. వారి కోసం పూజారులు దేవుడి దగ్గరికి వస్తారని దేవుడు చెప్పాడు. పూజారులలో ఒకరైన ఆరోన్ తన ఉద్యోగం గురించి చాలా గర్వపడకూడదు ఎందుకంటే అది పెద్ద బాధ్యత మరియు ప్రమాదకరమైనది. మనం చాలా గర్వపడకూడదు లేదా బాధ్యత వహించాలని కోరుకోకూడదు ఎందుకంటే ఎక్కువ బాధ్యతతో తప్పులు చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

పూజారుల భాగం. (8-19) 
ఆధ్యాత్మిక పూజారుల వంటి విశ్వాసులందరినీ జాగ్రత్తగా చూసుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. క్రైస్తవ చర్చిలు తమ మంత్రులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా వారు తమ పనిపై దృష్టి పెట్టవచ్చు మరియు విశ్వాసంతో జీవించడంలో మంచి ఉదాహరణను సెట్ చేయవచ్చు. పూజారులు తమ పనిలో అంకితభావంతో ఉండాలి మరియు ప్రాపంచిక విషయాలపై దృష్టి మరల్చకూడదు. మనం మన ఉత్తమమైన వాటిని దేవునికి సమర్పించాలి మరియు మన కోసం వస్తువులను కాపాడుకోవడానికి ప్రయత్నించకూడదు, ఎందుకంటే మనం ఏమి చేస్తున్నామో దేవునికి తెలుసు. 

లేవీయుల భాగము. (20-32)
ఇశ్రాయేలు ప్రజల ప్రత్యేక సమూహంగా ఉన్నట్లే, లేవీ గోత్రం కూడా ప్రత్యేకమైనది మరియు ఇతర తెగల నుండి భిన్నంగా ఉంటుంది. దేవుని నిత్య సంపదగా భావించే వ్యక్తులు ప్రాపంచిక ఆస్తుల గురించి పెద్దగా పట్టించుకోకూడదు. ఇశ్రాయేలీయులు తమ పంటలో కొంత భాగాన్ని ఆయనకు ఇచ్చినట్లే, లేవీయులు తమ దశమభాగాల్లో కొంత భాగాన్ని దేవునికి ఇచ్చే బాధ్యతను కలిగి ఉన్నారు. 2The 3:10 మనం మన వస్తువులలో కొన్నింటిని దేవునికి ఇస్తున్నామని నిర్ధారించుకోవాలి ఎందుకంటే అది ముఖ్యమైనది. మనం ఇలా చేసినప్పుడు, మనకు ఉన్నదాని గురించి మనం మంచి అనుభూతి చెందుతాము మరియు ఏ తప్పు చేయము. ప్రతి ఒక్కరూ సంతోషంగా మరియు మంచిగా ఉండేలా మనం ఇతరులకు కూడా ఇవ్వాలి. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |