Numbers - సంఖ్యాకాండము 19 | View All

1. యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

1. And the Lorde spake vnto Moses and Aaron sayenge:

2. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము.

2. this is the ordynaunce of the lawe which ye Lorde comaudeth sayenge: speake vnto ye childern of Israel and let them take the a redd cowe with out spot wherein is no blemysh and which neuer bare yocke apo her.

3. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.

3. And ye shall geue her vnto Eleazer the preast and he shall brynge her with out the hoste and cause her to be slayne before him.

4. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;

4. And Eleazar ye preast shall take of hir bloude vppon his fynger and sprynkle it streght towarde the tabernacle of witnesse .vij. tymes

5. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింప వలెను.

5. And he shall cause the cowe to be burnt in his syghte: both skyn flesh and bloude with the douge also.

6. మరియు ఆ యాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.
హెబ్రీయులకు 9:19

6. And let the preast take cipresse wodd and Isope and purple cloth and cast it apon the cowe as she burneth.

7. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిర స్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

7. And let the preast wash his clothes and bathe his flesh in water and then come in to the hoste and ye preast shalbe vncleane vnto the euen.

8. దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

8. And he that burneth her shall wash his clothes in water and bathe his flesh also in water ad be vncleane vntill euen.

9. మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి.
హెబ్రీయులకు 9:13

9. And one that is cleane shall goo and take vpp the asshes of the cowe and put them without the hoste in a cleane place where they shall be kepte to make sprynklynge water for the multitude of the childern of Israel: for it is a synofferynge

10. ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.

10. And let him that gathereth the asshes of the cowe wash his clothes and remayne vncleane vntill euen. And this shalbe vnto the childern of Israel ad vnto the straunger yt dwelleth amonge them a maner for euer.

11. ఏ నరశవమునైనను ముట్టిన వాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.

11. Be that twycheth any deed persone shalbe vncleane .vij. dayes.

12. అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవ దినమున పవిత్రుడగును. అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసికొనని యడల ఏడవ దినమున పవిత్రుడుకాడు.

12. And he shall purifye him selfe with the asshes the thyrde daye ad then he shalbe cleane the seuenth daye. And yf the purifye not himselfe the thyrde daye the the seuenth daye he shall not be cleane.

13. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వాని కుండును.
హెబ్రీయులకు 9:10

13. Who soeuer twicheth any persone yt dyeth and sprynkleth not him selfe defyleth the dwellynge of the Lorde: ad therfore that soule shalbe roted out of Israel because he hath not sprynkled the sprynklynge water vppon him. he shalbe vncleane and his vnclennesse shall remayne vppon him.

14. ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.

14. This is the lawe of the man that dyeth in in a tent: all that come in to the tent and all yt is in the tent shalbe vncleane .vij dayes.

15. మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.

15. And all the vessels that be ope which haue no lyd nor couerynge apon them are vncleane.

16. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవము నైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.

16. And who soeuer twicheth one that is slayne with a swerde in the feldes or a deed persone or a bone of a deed man or a graue: shall be vncleane .vij. dayes.

17. అప విత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.
హెబ్రీయులకు 9:13

17. And they shall take for an vncleane persone of the burnt asshes of the synofferynge and put runnynge water thereto in to a vessell.

18. తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్త మైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యుల మీదను, ఎముకనే గాని నరకబడిన వానినేగాని శవమునే గాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను.

18. And a cleane persone shall take Isope and dyppe it in the water and sprynkle it apon ye tent and apon all the vessells and on the soules that were there and apon him that twyched a bone or a slayne persone or a deed body or a graue.

19. మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమున వాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును.

19. And the cleane persone shall sprynkle apon the vncleane the thyrde daye and the seuenth daye. And the seuenth daye he shall purifie him selfe and wasshe his clothes and bathe him selfe in water and shalbe cleane at euen.

20. అపవిత్రుడు పాపశుద్ధిచేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును; వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు; వాడు అపవిత్రుడు.

20. Yf any be vncleane and sprynkle not him selfe the same soule shalbe destroyed fro amoge the congregacion: for he hath defyled the holy place of the Lorde. And he that sprynkleth ye sprynklynge water shall wassh his clothes.

21. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరిహార జలమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము.

21. And he that twicheth the sprynklynge water shalbe vncleane vntill eue.

22. దాని ముట్టు మనుష్యులందరు సాయం కాలమువరకు అపవిత్రులై యుందురు.

22. And what soeuer ye vncleane persone twicheth shalbe vncleane. And the soule that twicheth it shalbe vncleane vntill the euen.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 19 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
కోడలు యొక్క బూడిద. (1-10) 
చాలా కాలం క్రితం, ఒక చిన్న ఆవు పూర్తిగా కాలిపోయింది. ఈ ఆవు యేసు తన హృదయం మరియు శరీరం రెండింటిలో ఎంత బాధపడ్డాడో గుర్తుగా ఉంది, ఎందుకంటే ప్రజలు చేసే చెడు పనులన్నింటికీ భర్తీ చేయడానికి అతను తనను తాను త్యాగం చేశాడు. ప్రజలు ఏదైనా తప్పు చేసినప్పుడు వాటిని సరిదిద్దడానికి ఆవు నుండి బూడిదను ప్రత్యేక మార్గంగా ఉంచారు. ఇది కేవలం ప్రత్యేక వేడుకల కోసమే అయినప్పటికీ, మన కోసం విషయాలను సరిదిద్దడానికి యేసు ఎలా చనిపోయాడో గుర్తుచేస్తుంది. మనం యేసు రక్తంలో ఓదార్పు మరియు క్షమాపణను కనుగొనగలము, ఇది మనకు మంచిగా ఉండటానికి సహాయం అవసరమైనప్పుడు మనం ఎల్లప్పుడూ ఆశ్రయించగల ఒక ప్రత్యేక విషయం వంటిది. 

అపవిత్రతను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. (11-22)
మరణం పాపం నుండి వస్తుంది మరియు అది చాలా శక్తివంతమైనది కాబట్టి మృతదేహానికి దూరంగా ఉండాల్సిన విషయం అని చట్టం చెబుతోంది. చట్టం మరణం నుండి బయటపడలేదు, కానీ సువార్త జీవితం మరియు ఆశ గురించి బోధిస్తుంది. ఒక ప్రత్యేక జంతువు యొక్క బూడిద యేసు మన కోసం ఏమి చేసాడో సూచిస్తుంది మరియు నీరు పవిత్రాత్మను సూచిస్తుంది, అది యేసు వలె శుభ్రంగా మరియు నీతిమంతులుగా మారడానికి మాకు సహాయపడుతుంది. యేసు వల్ల తాము మంచివారమవుతామని ఎవరైనా విశ్వసిస్తే, కానీ వారు దేవుని ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించకపోతే, వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు. పరిశుభ్రమైన నీళ్లకు బదులు మురికి నీళ్లతో ఏదైనా శుభ్రం చేయడానికి ప్రయత్నించడం లాంటిది. ఈ నియమాలు మరియు బోధలు ముఖ్యమైనవి ఎందుకంటే అవి యేసు మనలను ఎలా రక్షిస్తాడో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఈ నియమాలను క్రొత్త నిబంధనతో పోల్చడం ద్వారా, మనం చాలా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ పాపంతో పుడతారని ఈ నియమాలు మనకు చూపుతాయి, అది మనల్ని అపవిత్రం చేసే మురికి వంటిది. మనల్ని మరింత మురికిగా మార్చే చెడు విషయాలకు దూరంగా ఉండాలి. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |