Numbers - సంఖ్యాకాండము 3 | View All

1. యెహోవా సీనాయి కొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.

1. These are the generacions of Aaron & Moses, whan ye LORDE spake vnto Moses at ye same tyme vpon mount Sinai.

2. అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.

2. And these are ye names of the sonnes of Aron. The firstborne, Nadab: then Abihu, Eleasar & Ithamar.

3. ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను.

3. These are ye names of the sonnes of Aaron, which were anoynted to be prestes, & their handes fylled for ye presthode.

4. నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.

4. But Nadab & Abihu dyed before ye LORDE, wha they offred strauge fyre before ye LORDE, in ye wildernesse of Sinai, & had no sonnes. But Eleasar and Ithamar executed ye prestes office wt their father Aaron.

5. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవిగోత్రికులను తీసికొనివచ్చి

5. And the LORDE spake vnto Moses, & sayde:

6. వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.

6. Bringe hither the trybe of Leui, and set them before Aaron the prest, yt they maye serue wt him, & wayte vpon him

7. వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవచేయవలెను. తాము కాపాడ వలసిన దానిని, సర్వసమాజము కాపాడవలసిన దానిని, వారు కాపాడవలెను.

7. & vpo the whole congregacion before ye Tabernacle of witnesse, and execute the seruyce of the habitacion,

8. మందిరపు సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసిన దంతటిని, వారే కాపాడవలెను.

8. and kepe all the apparell of the Tabernacle of wytnesse, and wayte vpon the children of Israel, to mynistre in the seruyce of the habitacion.

9. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలో నుండి అతని వశము చేయబడినవారు.

9. And thou shalt geue ye Leuites vnto Aaron and his sonnes for a gift, vnto euery one his awne, from amonge the children of Israel.

10. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.

10. As for Aaron & his sonnes, thou shalt appoynte them to wayte on their prestes office. Yf another preasse therto, he shal dye.

11. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా

11. And the LORDE spake vnto Moses, and saide

12. ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.

12. Beholde, I haue take the Leuites fro amonge the childre of Israel, for all the first borne that open the Matrix amonge the children of Israel, so that the Leuites shalbe myne.

13. ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.

13. For the firstborne are myne, sence ye tyme that I smote all the first borne in ye lande of Egipte, wha I sanctified vnto me all the first borne in Israel, from me vnto catell, that they shulde be myne. I the LORDE.

14. మరియసీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

14. And the LORDE spake vnto Moses in the wyldernesse of Sinai, and sayde:

15. లేవీయుల పితరుల కుటుంబములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింపవలెను.

15. Nombre the children of Leui after their fathers houses and kynreds, all that are males of a moneth olde and aboue.

16. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించి నట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను.

16. So Moses nombred them acordinge to the worde of the LORDE, as he had commaunded.

17. లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.

17. And these were the children of Leui with their names: Gerson, Rahath, Merari.

18. గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.

18. The names of the children of Gerson in their kynreds, were: Libni and Semei.

19. కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.

19. The childre of Rahath in their kynreds were, Amram, Iezehar, Hebron and Vsiel.

20. మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.

20. The children of Merari in their kynreds, were Maheli and Musi. These are the kynreds of Leui after their fathers houses.

21. లిబ్నీయులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.

21. These are ye kynreds of Gerson: The Libnites and Semeites,

22. వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందల మంది.

22. the summe was founde in nombre, seuen thousande and fyue hundreth, of all that were males of a moneth olde and aboue.

23. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను.

23. And the same kynreds of the Gersonites shal pitche behinde the Habitacion on the west syde:

24. గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.

24. Let Eliasaph the sonne of Lael be their ruler.

25. ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు

25. And they shal waite vpon the Tabernacle of wytnesse, of the habitacion, and of the tent, and couerynges therof, and the hangynge in the dore of the Tabernacle of wytnesse,

26. ప్రాకారయౌవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును.

26. the hangynge aboute the courte, & the hangynge in ye courtedore, which (courte) goeth aboute the habitacion and the altare, and the cordes of it, & all that belongeth to the seruyce therof.

27. కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీయుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.

27. These are the kynreds of Rahath: The Amramites, the Iezeharites, the Hebronites, and Vsielites,

28. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి.

28. all that were males of a moneth olde & aboue, in nombre eight thousande and sixe hundreth, waytinge vpon the Tabernacle of the Sanctuary,

29. కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.

29. & shal pitch on the south syde of ye Habitacion:

30. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.

30. Let Elisaphan the sonne of Vsiel be their ruler.

31. వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.

31. And they shal kepe the Arke, the table, the candilsticke, the altare and all the vessels of the Sanctuary, to do seruyce in, and the vayle, and all that belongeth to the seruice therof.

32. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త.

32. But the chefe of all the rulers of the Leuites, shalbe Eleasar the sonne of Aron the prest, ouer them that are apoynted to kepe the watch of the Sanctuary.

33. మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.

33. These are ye kynreds of Merari: The Mabelites and Musites,

34. వారిలో లెక్కింపబడిన వారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందల మంది.

34. which were in nombre sixe thousande and two hudreth, all that were males of a moneth olde and aboue:

35. మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.

35. Let Zuriel ye sonne of Abihail be their ruler, and they shall pitche vpon the north syde of the Habitacion.

36. మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణము లన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని

36. And their office shalbe to kepe the bordes, and barres, and pilers, and sokettes of the Habitacion, and all the apparell therof and that serueth therto:

37. దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.

37. ye pilers also aboute ye courte, with the sokettes, and nales, and cordes.

38. మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.

38. But before the Habitacion and before ye Tabernacle on the East syde shal Moses & Aaron & his sonnes pytche, that they maye wayte vpon the Sanctuary, & the children of Israel. Yf eny other preasse therto, he shal dye.

39. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి, తమ తమ వంశ ములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేల మంది.

39. All the Leuites in the summe, whom Moses and Aaron nombred after their kynreds, acordinge to the worde of the LORDE, all that were males, of a moneth olde and aboue, were two and twentye thousande.

40. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలు కొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.

40. And ye LORDE saide vnto Moses: Nombre all the first borne, that are males amonge the children of Israel, of a moneth olde and aboue, and take the nombre of their names.

41. నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగ పిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలొ తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసికొనవలెను.

41. And ye Leuites shalt thou take out vnto me the LORDE, for all ye first borne of ye childre of Israel, & the catell of the Leuites for all the first borne amonge the catell of ye children of Israel.

42. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారి నందరిని లెక్కించెను.

42. And Moses nombred all the first borne amoge the childre of Israel, as the LORDE commaunded him.

43. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండు వేల రెండువందల డెబ్బదిమూడు.

43. And in the nombre of the names of all the first borne, that were males of a moneth olde & aboue, in their summe, there were foude two and twentye thousande, two hundreth, and thre and seuentye.

44. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

44. And the LORDE spake vnto Moses, & sayde:

45. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నా వారైయుందురు; నేనే యెహోవాను.

45. Take the Leuites for all ye first borne amonge the childre of Israel, & the catell of ye Leuites for their catell, yt the Leuites maye be myne the LORDES.

46. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.

46. But the redempcion money of the two hundreth thre & seuentye yt remayne of the first borne of the children of Israel,

47. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.

47. aboue the nombre of the Leuites, shalt thou take, euen fyue Sycles of euery heade, after the Sycle of the Sanctuary (one Sycle is worth twentye Geras)

48. తులము ఇరువది చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను.

48. & the money yt remayneth ouer their nobre, shalt thou geue vnto Aaron and his sonnes.

49. కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను.

49. Then toke Moses ye redempcion money (that remayned ouer aboue the nombre of the Leuites)

50. పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువది యైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను.

50. from ye first borne of the childre of Israel, euen a thousande, thre hundreth, and fyue and thre score Sycles, after ye Sycle of the Sanctuary,

51. యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడి పింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.

51. & gaue it vnto Aaron and his sonnes, acordinge to the worde of the LORDE, as the LORDE commaunded Moses.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
అహరోను కుమారులు, మొదటి సంతానానికి బదులుగా లేవీయులు తీసుకున్నారు. (1-13) 
పూజారులకు చాలా పని ఉంది, కానీ చేయడానికి తగినంత మంది లేరు. కాబట్టి, యాజకులకు సహాయం చేయడానికి దేవుడు లేవీయులు అని పిలువబడే ఇతరులను ఎన్నుకున్నాడు. మొదటి కుమారులకు బదులుగా వారు ఎంపిక చేయబడ్డారు. దేవుడు మనలను రక్షించినప్పుడు, మనం కృతజ్ఞతతో ఉండి, ఆయనకు నమ్మకంగా సేవ చేయాలి. దేవుడు మనపై హక్కు కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన మనలను సృష్టించాడు మరియు మనలను కూడా రక్షించాడు.

లేవీయులను వారి కుటుంబాల వారీగా లెక్కించారు, వారి విధులు. (14-39)
లేవీయులు గెర్షోను, కహాతు మరియు మెరారీ అనే వారి పూర్వీకుల ఆధారంగా మూడు సమూహాలుగా విభజించబడ్డారు. ప్రతి సమూహం చిన్న కుటుంబాలుగా విభజించబడింది. మోషే చాలా ముఖ్యమైన వ్యక్తి అయినప్పటికీ, అతని కుటుంబం ఇతర లేవీయుల కంటే మెరుగ్గా పరిగణించబడలేదు. మోషే తన కుటుంబానికి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వడానికి లేదా వారికి మరింత ముఖ్యమైన ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నించలేదని ఇది చూపిస్తుంది. లేవీ తెగ నిజానికి అతి చిన్న తెగలలో ఒకటి. ప్రపంచంలోని మిగిలిన వారితో పోలిస్తే దేవుడు ఎన్నుకున్న ప్రజలు కేవలం చిన్న సమూహం మాత్రమే.

మొదటి జన్మించినవారు లెక్కించబడ్డారు. (40-51)
ఎంతమంది మొదటి సంతానాలు మరియు లేవీయులు ఉంటారో దేవునికి ముందుగానే తెలుసు మరియు వారి మధ్య న్యాయమైన సమతుల్యత ఉండేలా చూసుకున్నాడు. అదనపు మొదటి జన్మించిన పిల్లలు విమోచించబడటానికి డబ్బు చెల్లించవలసి వచ్చింది మరియు డబ్బు ఆరోన్‌కు వెళ్ళింది. చర్చిని మొదట జన్మించినవారి చర్చి అని పిలుస్తారు, ఎందుకంటే ఇది డబ్బుతో కాకుండా యేసు యొక్క విలువైన రక్తం ద్వారా విమోచించబడింది. ప్రతి ఒక్కరూ దేవునికి చెందినవారు ఎందుకంటే ఆయన వారిని సృష్టించాడు, అయితే నిజమైన క్రైస్తవులు విమోచించబడినందున వారు ప్రత్యేకమైనవారు. ప్రతి ఒక్కరూ తమ పాత్ర మరియు బాధ్యతలను తెలుసుకోవడం చాలా ముఖ్యం మరియు దేవుణ్ణి సేవించడం ఎప్పుడూ చెడ్డ పని కాదు.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |