Numbers - సంఖ్యాకాండము 33 | View All

1. మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.

1. moshe aharonulavalana thama thama senalachoppuna aigupthudheshamulonundi bayaludherivachina ishraayeleeyulu chesina prayaanamulu ivi.

2. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమ ముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.

2. moshe yehovaa selavichina prakaaramu, vaari prayaanamulanubatti vaari sanchaarakramamulanu vraasenu. Vaari sanchaarakrama mula prakaaramu vaari prayaanamulu ivi.

3. మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.

3. modati nela padunayidava dinamuna vaaru raamesesulo nundi prayaanamai paskaapandugaku marunaadu vaari madhyanu yehovaa hathamu chesina tolichoolula nandarini aiguptheeyulu paathipettuchundagaa ishraayeleeyulu aiguptheeyulandari kannulayeduta jayotsaahamuthoo bayaludheri vachiri.

4. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.

4. appudu aiguptheeyula dhevathalaku yehovaa theerpu theerchenu.

5. ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.

5. ishraayeleeyulu raame sesulonundi bayaludheri sukkothulo digiri.

6. సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి.

6. sukko thulonundi vaaru bayaludheri aranyapu kadanunna ethaa mulodigiri.

7. ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.

7. ethaamulonundi bayaludheri bayalsephonu edutanunna peehaheerothuthattu thirigi migdolu eduta digiri.

8. పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.

8. peehaheerothulonundi bayaludheri samudramu madhyanundi aranyamuloniki cheri ethaamu aranyamandu moodudinamula prayaanamu chesi maaraalo digiri. Maaraalonundi bayaludheri eleemuku vachiri.

9. ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.

9. eleemulo pandrendu neetibugga lunu debbadhi yeethachetlunu undenu; akkada digiri.

10. ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.

10. eleemulonundi vaaru bayaludheri erra samudramu noddha digiri.

11. ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.

11. errasamudramu noddhanundi bayaludheri seenu aranyamandu digiri.

12. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి

12. seenu aranyamulo nundi bayaludheri dopakaalo digiri

13. దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.

13. dopakaalonundi bayaludheri aalooshulo digiri.

14. ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.

14. aalooshulonundi bayaludheri repheedeemulo digiri. Akkada janulu traagutakai neellu lekapoyenu.

15. రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.

15. repheedeemulonundi bayaludheri seenaayi aranyamandu digiri.

16. సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.

16. seenaayi aranyamunundi bayaludheri kibrothuhatthaavaalo digiri.

17. కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.

17. kibrothuhathaa vaalonundi bayaludheri hajerothulo digiri.

18. హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.

18. haje rothulonundi bayaludheri ritmaalo digiri.

19. రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.

19. ritmaalonundi bayaludheri rimmonu paaresulo digiri.

20. రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.

20. rimmonu paare sulonundi bayalu dheri libnaalo digiri.

21. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.

21. libnaalo nundi bayaludheri reesaalo digiri.

22. రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.

22. reesaalonundi bayalu dheri kehelaa thaalo digiri.

23. కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.

23. kehelaathaalonundi bayaludheri shaaperu kondanoddha digiri.

24. షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.

24. shaaperu konda noddhanundi bayaludheri haraadaalo digiri.

25. హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.

25. haraadaalo nundi bayaludheri makelothulo digiri.

26. మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.

26. makelothulo nundi bayaludheri thaahathulo digiri.

27. తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.

27. thaahathulonundi bayaludheri thaarahulo digiri.

28. తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.

28. thaarahulonundi bayaludheri mitkaalo digiri.

29. మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.

29. mitkaalonundi bayalu dheri hashmonaalo digiri.

30. హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.

30. hashmonaalonundi bayaludheri moserothulo digiri.

31. మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.

31. moserothulo nundi bayaludheri beneyaakaanulo digiri.

32. బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.

32. beneyaakaanulonundi bayaludheri hor‌haggidgaadulo digiri.

33. హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.

33. hor‌haggidgaa dulonundi bayaludheri yotbaathaalo digiri.

34. యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.

34. yotbaa thaalonundi bayaludheri ebronaalo digiri.

35. ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.

35. ebro naalonundi bayaludheri eson'geberulo digiri.

36. ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.

36. eson'ge berulonundi bayaludheri kaadheshu anabadina seenu aranya mulo digiri.

37. కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.

37. kaadheshulonundi bayaludheri edomu dheshamukadanunna horukonda daggara digiri.

38. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.

38. yehovaa selavichina prakaaramu yaajakudaina aharonu horu kondanekki, ishraayeleeyulu aigupthudheshamulonundi bayaludheri vachina naluvadhiyava samvatsaramuna ayidava nela modati dinamuna akkada mruthinondhenu.

39. అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.

39. aha ronu noota iruvadhi moodendla yeedugalavaadai horu kondameeda mruthinondhenu.

40. అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.

40. appudu dakshinadhikkuna kanaanu dheshamandu nivasinchina araaduraajaina kanaaneeyudu ishraayeleeyulu vachina sangathi vinenu.

41. వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.

41. vaaru horu kondanundi bayaludheri salmaanaalo digiri.

42. సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి.

42. salmaanaalo nundi bayaludheri poononulo digiri.

43. పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.

43. poononulo nundi bayaludheri obothulo digiri.

44. ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.

44. obothulonundi bayaludheri moyaabu polimera yoddhanunna eeyye abaareemulo digiri.

45. ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.

45. eeyye abaareemulonundi bayalu dheri deebonugaadulo digiri.

46. దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.

46. deebonugaadulonundi bayaludheri almonu diblaathaayimulo digiri.

47. అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.

47. almonu diblaa thaayimulonundi bayaludheri neboyeduti abaa reemu kondalalo digiri.

48. అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.

48. abaareemu kondalalonundi bayaludheri yeriko daggara yordaanuku sameepamaina moyaabu maidaanamulalo digiri.

49. వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.

49. vaaru moyaabu maidaanamulalo betyeshimothu modalukoni aabelu shittheemuvaraku yordaanudaggara digiri.

50. యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

50. yerikoyoddha, anagaa yordaanuku sameepamaina moyaabu maidaanamulalo yehovaa mosheku eelaagu selavicchenu.

51. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముమీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత

51. neevu ishraayeleeyulathoo itlanumumeeru yordaanunu daati kanaanudheshamunu cherina tharuvaatha

52. ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి

52. aa dheshanivaasulandarini mee yeduta nundi vellagotti, vaari samastha prathimalanu naashanamuchesi vaari pothavigrahamulanannitini nashimpachesi vaari unnatha sthalamulanannitini paaduchesi

53. ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.

53. aa dheshamunu svaadheenaparachukoni daanilo nivasimpavalenu; yelayanagaa daani svaadheenaparachukonunatlu aa dheshamunu meekichithini.

54. మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.

54. meeru mee vanshamulachoppuna chitluvesi aa dheshamunu svaasthyamulugaa panchukonavalenu. Ekkuva mandiki ekkuva svaasthyamunu thakkuvamandiki thakkuva svaasthyamu iyyavalenu. Evani chiti ye sthalamuna paduno vaaniki aa sthalame kalugunu. mee thandrula gotramula choppuna meeru svaasthyamulu pondavalenu.

55. అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.

55. ayithe meeru mee yedutanundi aa dheshanivaasulanu vellagottaniyedala, meeru vaarilo evarini undanicchedaro vaaru mee kannulalo mundlu gaanu mee prakkalalo shoolamulugaanu undi, meeru nivasinchu aa dheshamulo mimmunu baadhapettedaru.

56. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.

56. mariyu nenu vaariki cheya thalanchinatlu meeku chesedhanani vaarithoo cheppumu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 33 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇశ్రాయేలీయుల శిబిరాలు. (1-49) 
ఇశ్రాయేలు పిల్లలు కనానుకు వెళ్లేందుకు ఎడారి గుండా ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన కథ ఇది. వారు ఎల్లప్పుడూ కదులుతూ ఉంటారు మరియు వారికి శాశ్వత ఇల్లు లేదు. ఇది మనం ఎల్లప్పుడూ జీవితంలో ఎలా కదులుతున్నామో అలాగే శాశ్వతంగా ఒకే చోట ఉండకూడదు. వారు వెళ్ళడానికి సరైన మార్గాన్ని చూపించిన ప్రత్యేక మేఘం మరియు అగ్ని ద్వారా వారు నడిపించబడ్డారు. వారు వేర్వేరు దిశలలో వెళ్ళినప్పటికీ, దేవుడు వారిని ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపించాడు. దేవుడు మనకు మరియు మన కుటుంబాలకు చేసిన మంచి పనులను మనం గుర్తుంచుకోవాలి మరియు ఆయన ప్రేమ మరియు సంరక్షణకు కృతజ్ఞతతో ఉండాలి. కొన్నిసార్లు మనం మన గతం గురించి ఆలోచించినప్పుడు, దేవుడు మనకు చేసిన మంచి పనులను మనం గుర్తుంచుకుంటాము, కానీ మనం ఎల్లప్పుడూ సరైనది చేయలేదని కూడా గుర్తుంచుకుంటాము. మనకు అర్హత లేకపోయినా దేవుడు ఎల్లప్పుడూ మనపట్ల దయతో ఉన్నాడు. మనం మంచిగా చేసి దేవుడిని సంతోషపెట్టగలిగితే తప్ప, ఆ సమయాలను తిరిగి పొంది, మళ్లీ మళ్లీ జీవించాలని మనం కోరుకోము. భూమిపై మన సమయం తక్కువగా ఉంది మరియు మనం దానిని సద్వినియోగం చేసుకోవాలి. మనం దేవుని మార్గనిర్దేశాన్ని అనుసరించి మంచి పనులు చేస్తే, మనం సంతోషంగా ఉండగలము మరియు దేవుని ప్రేమను శాశ్వతంగా పొందగలము. ఇప్పుడు దేవుని వైపు తిరగడానికి మరియు క్షమాపణ కోరడానికి సమయం ఆసన్నమైందని బైబిల్ చెబుతుంది. మనం మన సమయాన్ని మంచి చేయడానికి మరియు దేవుణ్ణి గర్వపడేలా చేయడానికి ఉపయోగించాలి మరియు మనం ఎప్పటికీ ఆయనతో ఉండే వరకు ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. 

కనానీయులు నాశనం చేయబడతారు. (50-56)
ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటబోతున్నప్పుడు, వారు మళ్లీ విగ్రహాలను ఆరాధించాలనే శోదానికి గురయ్యే ప్రమాదం ఉంది. వారు ఈ ప్రలోభానికి లొంగిపోతే, వారు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తారు. విషపూరితమైన పాములను వారి దగ్గర ఉంచుకున్నట్లే అవుతుంది. దేశంలో ఇంకా నివసించే కనానీయులలో ఎవరితోనైనా వారు స్నేహం చేస్తే, కొద్దికాలం అయినా, ఆ ప్రజలు వారికి ఇబ్బంది మరియు బాధను కలిగిస్తారు. తప్పు అని మనకు తెలిసిన పనులు చేసినప్పుడు మనం ఎల్లప్పుడూ ఇబ్బంది మరియు విచారాన్ని ఆశించాలి. కనానీయులు దేశాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకున్నాడు, అయితే ఇశ్రాయేలీయులు వారిలా ప్రవర్తించడం ప్రారంభించినట్లయితే, వారు కూడా బలవంతంగా విడిచిపెట్టబడతారు. ఇలా జరుగుతుందని మనం భయపడాలి. మన చెడు అలవాట్లకు మరియు కోరికలకు వ్యతిరేకంగా పోరాడకపోతే, అవి మనల్ని నియంత్రించి మన ఆత్మలను నాశనం చేస్తాయి.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |