Numbers - సంఖ్యాకాండము 5 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.

1. The LORD said to Moses,

2. ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.

2. 'Command the Israelites to send away from the camp anyone who has a defiling skin disease or a discharge of any kind, or who is ceremonially unclean because of a dead body.

3. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను.

3. Send away male and female alike; send them outside the camp so they will not defile their camp, where I dwell among them.'

4. ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.

4. The Israelites did so; they sent them outside the camp. They did just as the LORD had instructed Moses.

5. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో

5. The LORD said to Moses,

6. పురుషుడుగాని స్త్రీగాని యెహోవామీద తిరుగబడి మనుష్యులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు

6. 'Say to the Israelites: 'Any man or woman who wrongs another in any way and so is unfaithful to the LORD is guilty

7. వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను.

7. and must confess the sin they have committed. They must make full restitution for the wrong they have done, add a fifth of the value to it and give it all to the person they have wronged.

8. ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేని యెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును.

8. But if that person has no close relative to whom restitution can be made for the wrong, the restitution belongs to the LORD and must be given to the priest, along with the ram with which atonement is made for the wrongdoer.

9. ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకునివగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును.

9. All the sacred contributions the Israelites bring to a priest will belong to him.

10. ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చినయెడల అది అతని దగునని చెప్పుము.

10. All sacred gifts belong to the donors, but what they give to the priest will belong to the priest.' '

11. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

11. Then the LORD said to Moses,

12. ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన యెడల

12. 'Speak to the Israelites and say to them: 'If a man's wife goes astray and is unfaithful to him

13. ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను,

13. so that another man has sexual relations with her, and this is hidden from her husband and her impurity is undetected (since there is no witness against her and she has not been caught in the act),

14. వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడిన యెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల,

14. and if feelings of jealousy come over her husband and he suspects his wife and she is impureor if he is jealous and suspects her even though she is not impure

15. ఆ పురుషుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాప కముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము.

15. then he is to take his wife to the priest. He must also take an offering of a tenth of an ephah of barley flour on her behalf. He must not pour oil on it or put incense on it, because it is a grain offering for jealousy, a reminder-offering to draw attention to wrongdoing.

16. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను.

16. ' 'The priest shall bring her and have her stand before the LORD.

17. తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను.

17. Then he shall take some holy water in a clay jar and put some dust from the tabernacle floor into the water.

18. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.

18. After the priest has had the woman stand before the LORD, he shall loosen her hair and place in her hands the reminder-offering, the grain offering for jealousy, while he himself holds the bitter water that brings a curse.

19. అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమనగా ఏ పురుషుడును నీతో శయనింపని యెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము.

19. Then the priest shall put the woman under oath and say to her, 'If no other man has had sexual relations with you and you have not gone astray and become impure while married to your husband, may this bitter water that brings a curse not harm you.

20. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసిన యెడల

20. But if you have gone astray while married to your husband and you have made yourself impure by having sexual relations with a man other than your husband'

21. యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక.

21. here the priest is to put the woman under this curse'may the LORD cause you to become a curse among your people when he makes your womb miscarry and your abdomen swell.

22. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్‌ అని చెప్పవలెను.

22. May this water that brings a curse enter your body so that your abdomen swells or your womb miscarries.' ' 'Then the woman is to say, 'Amen. So be it.'

23. తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి

23. ' 'The priest is to write these curses on a scroll and then wash them off into the bitter water.

24. శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును.

24. He shall make the woman drink the bitter water that brings a curse, and this water that brings a curse and causes bitter suffering will enter her.

25. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్య మును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను.

25. The priest is to take from her hands the grain offering for jealousy, wave it before the LORD and bring it to the altar.

26. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములోనుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాని దహించి

26. The priest is then to take a handful of the grain offering as a memorial offering and burn it on the altar; after that, he is to have the woman drink the water.

27. ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును.

27. If she has made herself impure and been unfaithful to her husband, this will be the result: When she is made to drink the water that brings a curse and causes bitter suffering, it will enter her, her abdomen will swell and her womb will miscarry, and she will become a curse.

28. ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగునని చెప్పుము.

28. If, however, the woman has not made herself impure, but is clean, she will be cleared of guilt and will be able to have children.

29. రోషము విషయమైన విధియిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి,

29. ' 'This, then, is the law of jealousy when a woman goes astray and makes herself impure while married to her husband,

30. లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడినయెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను.

30. or when feelings of jealousy come over a man because he suspects his wife. The priest is to have her stand before the LORD and is to apply this entire law to her.

31. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.

31. The husband will be innocent of any wrongdoing, but the woman will bear the consequences of her sin.' '



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
శిబిరం నుండి అపవిత్రులు తొలగించబడాలి, అపవిత్రత కోసం తిరిగి చెల్లించాలి. (1-10) 
శిబిరంలోని ప్రజలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చర్చిని స్వచ్ఛంగా మరియు శాంతియుతంగా ఉంచడం ముఖ్యం. ఎవరైనా తప్పు చేసిన వారిని మిగిలిన సమూహం నుండి వేరు చేయవలసి ఉంటుంది. తాము మతస్థులమని చెప్పుకునే వ్యక్తులు చెడు పనులు చేయకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తమ స్నేహితుడిని మోసం చేస్తే లేదా అన్యాయంగా ప్రవర్తిస్తే, అది చెడ్డ విషయం మరియు దేవుడు కోరుకున్నదానికి విరుద్ధంగా ఉంటుంది. ఎవరైనా తప్పు చేసినందుకు అపరాధ భావంతో ఉంటే, వారు అబద్ధం చెప్పారని అంగీకరించడం కష్టంగా ఉన్నప్పటికీ, వారు దేవునికి మరియు వారు బాధపెట్టిన వ్యక్తికి ఒప్పుకోవాలి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, దేవునికి క్షమించాలి మరియు మనం బాధపెట్టిన వ్యక్తితో విషయాలను సరిదిద్దాలి. జస్ట్ సారీ చెప్పడం లేదా ఏదైనా తిరిగి ఇవ్వడం సరిపోదు - మనం చేసిన దాని గురించి మనం నిజంగా బాధపడాలి మరియు మళ్లీ అలా చేయకూడదని వాగ్దానం చేయాలి. మనకు తెలిసిన వస్తువును చెడు మార్గంలో ఉంచుకుంటే, మనం దానిని ఇతర మార్గాల్లో భర్తీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, మనం అపరాధభావంతో ఉంటాము. ఇది దేవుని బోధల నుండి మనం నేర్చుకునేది మరియు ఇది నిజాయితీగా మరియు దయగల వ్యక్తులుగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ బోధనలను అనుసరించడం ద్వారా మరియు యేసును విశ్వసించడం ద్వారా, మన హృదయాలలో శాంతిని పొందవచ్చు.

అసూయ యొక్క విచారణ. (11-31)
ఇజ్రాయెల్‌లో స్త్రీలు తమపై అనుమానం వచ్చేలా పనులు చేయకుండా జాగ్రత్త వహించాలని చెప్పే చట్టం ఉంది. ఆ అనుమానాల కారణంగా ప్రజలు చెడుగా ప్రవర్తించకుండా నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. ఈ చట్టం దోషులుగా ఉన్న వ్యక్తులను తప్పించుకోవడం కష్టతరం చేసింది మరియు నిర్దోషులుగా ఉన్న వారిని తప్పుగా నిందించకుండా కాపాడింది. నేరం రుజువు కాకపోతే, ఆ స్త్రీ తాను నిర్దోషినని దేవునికి ప్రమాణం చేసి, కొన్ని ప్రత్యేకమైన నీరు త్రాగాలి. ఆమె దోషి అయితే, ఆమె దేవునికి అబద్ధం చెప్పకుండా ఈ పని చేయదు. శాపంలో భాగమైనందున నీటిని చేదు అని పిలిచేవారు. ప్రజలు చెడు పనులు చేసినప్పుడు, అది వారికి తరువాత ఇబ్బంది మరియు నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి తప్పు అని తెలిసిన వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. 1. మనం చేసే చెడు పనుల గురించి దేవుడికి తెలుసు, మనం వాటిని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ. కొన్నిసార్లు, ఈ చెడు విషయాలు ఊహించని విధంగా బయటకు వస్తాయి. ఒకరోజు, మనం చేసిన చెడు పనులన్నిటినీ, ఎవరికీ తెలియదని మనం అనుకున్నవాటిని కూడా యేసు తీర్పుతీరుస్తాడు. రోమీయులకు 2:16 2. వారి సంబంధాలలో నమ్మకద్రోహం చేసే మరియు అనుచితమైన లైంగిక ప్రవర్తనలో పాల్గొనే వ్యక్తులను దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకరి అపరాధాన్ని వారు గతంలో చేసినట్లుగా నిరూపించడానికి మనకు మార్గం లేనప్పటికీ, మంచిగా ఉండాలని మరియు హానికరమైన కోరికలను నివారించడానికి మనకు దేవుని బోధలు ఉన్నాయి. ఈ కోరికలకు లొంగిపోవడం విచారం మరియు పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. 3. అమాయకులు అమాయకులు అని దేవుడు చూపిస్తాడు. కొన్నిసార్లు దేవుడు ప్రజలకు సహాయం చేస్తాడు, మరియు కొన్నిసార్లు దేవుడు వారికి చెడు జరిగేలా చేస్తాడు. ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది మరియు ఇది దేవుని ప్రణాళికలో భాగం.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |